• Login / Register
  • పొలిటిక‌ల్/ జ‌న‌ర‌ల్ |

    New Osmania Hospital

    New Osmania Hospital | కొత్త ఆసుప‌త్రిలో హెలిప్యాడ్‌
    ఉస్మానియా ఆసుప‌త్రి కొత్త నిర్మాణానికి ఈ నెల 31న శంకుస్థాప‌న‌
    అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని అధికారుల‌కు సీఎం రేవంత్ ఆదేశాలు
    అధునాతన సౌకర్యాలతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం

    Hyderabad :  హైద‌రాబాద్ న‌గ‌రంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి కొత్త నిర్మాణం కోసం ఈ నెల 31న శంకుస్థాప‌న చేయ‌నున్నామ‌ని, అందుకోసం సంబంధిత అధికారులు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా ఉస్మానియా ఆసుప‌త్రి నూత‌న నిర్మాణానికి సంబంధించిన అంశంపై ఆయ‌న శ‌నివారం సంబంధిత అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. 
    వైద్య సేవ‌ల‌లో భాగంగా అవ‌య‌వాల మార్పిడి.. అత్య‌వ‌స‌ర స‌మయాల్లో రోగుల త‌ర‌లింపున‌కు వీలుగా హెలీ అంబులెన్స్‌లు వినియోగిస్తున్నందున హెలీప్యాడ్ నిర్మాణం కూడా చేప‌ట్టాలి. ఆసుప‌త్రిలో అడుగుపెట్ట‌గానే ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం ఉండేలా తీర్చిదిద్దాలి. ఆసుప‌త్రి భ‌వ‌న నిర్మాణాల‌కు సంబంధించిన న‌మూనాల్లో ప‌లు మార్పులు చేర్పుల‌ను సూచించారు.
    అయితే కొత్త‌గా నిర్మించ‌బోతున్న ఉస్మానియా ఆసుప‌త్రిని భ‌విష్య‌త్తును ద్రుష్టిలో పెట్టుకుని, అత్యాధునిక హంగుల‌తో నిర్మాణాలు ఉండాల‌న్నారు. ముఖ్యంగా కార్పోరేట్ ఆసుప‌త్రుల త‌ర‌హాలో పార్కింగ్‌, మార్చురీతో పాటు ఇత‌ర సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని అధికారులకు తెలిపారు. ఈ సంద‌ర్భంగా రోడ్లు, బిల్డింగ్ డిజైన్లలో పలు మార్పులు చేయాల‌ని సీఎం రేవంత్ సూచించారు. అలాగే లే అవుట్, బిల్డింగ్ డిజైన్, ల్యాండ్ స్కేపింగ్ విషయంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల‌న్నారు. రోగులు, వైద్య సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేలా ఆసుప‌త్రి నిర్మాణాలు జ‌రుగాల‌ని ఆదేశించారు.
    *  *  *

    Leave A Comment