Central University Admissions
Central University Admissions |
సెంట్రల్ యూనివర్సిటీ పీజీ అడ్మిషన్లపై టి-సాట్ ప్రత్యేక లైవ్
టీశాట్ సీఈవో వెల్లడి
Hyderabad దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Central University Admissions ) సహా దేశవ్యాప్త సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ అడ్మిషన్లపై ఈ నెల 24వ తేదీ శుక్రవారం రోజు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని లక్షలాది మంది విద్యార్థులకు వివిధ కోర్సులలో విద్యాబోధన చేసి అత్యున్నత యూనివర్సిటీలుగా పేరుతెచ్చుకున్న కేంద్రీయ విశ్వ విద్యాలయాలలో ఏ కోర్సులు ఉన్నాయి, ఏ భాషల్లో.. ఎన్ని విభాగాల్లో అడ్మిషన్లు తీసుకోనున్నారనే వివరాలు ప్రత్యేక లైవ్ ద్వారా విద్యార్థి లోకానికి తెలియచెప్పనున్నామని, లైవ్ కార్యక్రమంలో యూనివర్సిటీలకు సంబంధించిన ఫ్యాకల్టీ పాల్గొంటారని సీఈవో తెలిపారు. అయితే శుక్రవారం ఉదయం 11 నుండి 12 గంటల వరకు గంట పాటు నిపుణ ఛానల్ లో ప్రసారయ్యే ప్రత్యేక కార్యక్రమం మరుసటి రోజు శనివారం సాయంత్రం ఏడు నుండి ఎనిమిది గంటల వరకు విద్య ఛానల్ లో ప్రసారమౌతుందన్నారు. అడ్మిషన్ల వివరాలు తెలుసుకునేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 040 23540326/726 టోల్ ఫ్రీ నం.1800 425 4039 లకు కాల్ చేయాలని వేణుగోపాల్ రెడ్డి సూచించారు.
* * *
Leave A Comment