Lava Smart Phone Rs.6000
Lava Smart Phone Rs.6000 | రూ.6 వేలకు లావా స్మార్టు ఫోన్
ఏఐ ఫీచర్లతో కొత్తగా మార్కెట్‌లోకి లావా..
Hyderabad : మార్కెట్ ప్రపంచంలోకి సరికొత్తగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ (Lava International) భారత్ మార్కెట్లో సోమవారం లావా యువ స్మార్ట్ (Lava Yuva Smart) ఫోన్ విడుదల చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మద్దతుతో 13-మెగా పిక్సెల్ డ్యుయల్ కెమెరా సెటప్‌తో ఈ స్మార్టు ఫోన్ మార్కెట్‌లోకి వస్తుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ రూ.6000 కే మార్కెట్‌లో అందుబాటులో ఉంటుందని ఆ కంపెని ప్రతినిధులు ప్రకటించారు. అలాగే రూ.10 వేల లోపు ధరకే అందుబాటులో ఉంటుంది. 60 హెర్ట్జీ ఫ్రెష్ రేట్‌తో పాటు 6.75 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. లావా యువ స్మార్ట్ (Lava Yuva Smart) ఫోన్ ఇంట్రడ్యూసరీ ధర రూ.6000గా లావా ఇంటర్నేషనల్ ప్రకటించింది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్టులల్లో ఇది లభిస్తుందని తెలిపింది. గ్లాసీ బ్లూ, గ్లాసీ లావెండర్, గ్లాసీ వైట్ కలర్ వెరియంట్లలో వస్తున్న ఈ ఫోన్‌పై ఏడాది వారంటీ ఇస్తుంది. అలాగే ఫ్రీ సర్వీస్ ఎట్ హోం కూడా అందిస్తుంది. యూనిసోక్ 9863 ఏ ఒక్టోకార్ ప్రాసెసర్, 3జీబీ + 3జీబీ (వర్చువల్) ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో 512 జీబీ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 గో వర్షన్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది. Lava Yuva Smart (లావా ) ఫోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో పాటు 13 – మెగా పిక్సల్, డ్యుయల్ రేర్ కెమెరా వంటి సెటప్ ఉంటుంది. ఏఐ పవర్డ్, హెచ్‌డీఆర్ మద్దతుతో పోర్ట్రైట్, నైట్ మోడ్‌లకు మద్దతుగా నిలుస్తుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5- మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. స్లో మోషన్ వీడియో, ఏఐ మోడ్స్ ఉంటాయి. డ్యుయల్ 4జీ వోల్ట్, వై -ఫై 5, బ్లూటూత్ 4.2, ఓటీజీ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. 10 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్‌తో పాటు క్యూఆర్ కోడ్ స్కానర్ బ్యాటరీ సేవర్ మోడ్ వంటి పలు ఫీచర్లు ఇందులో ఉంచారు.
* * *
Leave A Comment