Karimnagar No1 In Telangana
Karimnagar No1 In Telangana | కరీంనగర్ జిల్లాను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుదాం..
ఇందుకు ఉత్సాహంగా పని చేస్తున్నా
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలో ఎన్నోసార్లు మంత్రులను కలిశాను
కేంద్ర మత్రి కట్టర్‌కురాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
Hyderabad : రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో నెంబర్ వన్ ఉండేందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ డంప్ యార్డ్ సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఉత్సాహంగా తాను పని చేస్తున్నానని, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలో ఎన్నోసార్లు మంత్రులను కలిసినట్లు తెలిపారు. కరీంనగర్ స్మార్ట్ సిటీగా ఎంపికైనప్పటికీ గతంలో నిధులు మంజూరు కాలేదన్నారు. 2019 తర్వాత బండి సంజయ్ సహకారంతో రూ. 400 కోట్ల రూపాయల నిధులు విడుదల అయ్యాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా స్మార్ట్ సిటీ కోసం 396 కోట్ల నిధులను విడుదల చేసిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కరీంనగర్ నగరం నుంచి డంప్ యార్డు తరలించాలని, కరీంనగర్ ని వేధిస్తున్న డంప్ యార్డు సమస్యను పరిష్కరించాలని కోరారు. తమరు తెలుగు నేర్చుకోని కరీంనగర్, తెలంగాణ పైనా ప్రేమ చూపాలని, తెలంగాణ అభివృద్ధి కి సహకరించాలని శుక్రవారం కేంద్ర మంత్రి కట్టర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
* * *
Leave A Comment