మంచిర్యాల టూ అమెరికా – సింగరేణి బిడ్డ ఘనత

ఓ వైపు కోవిడ్ ప్రభావం, మరోవైపు విద్యావ్యవస్థలో గందరగోళం ఉన్నప్పటికీ తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ స్టూడెంట్స్ తమ సత్తా చాటుతున్నారు. మొన్న సూర్య దీపిక నేడు సుహర్ష ప్రతిష్టాత్మక అమెరికా యూనివర్సీటీ ఆఫ్ అబర్న్ లో ఎం.ఎస్సీ సీటు సాధించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఫారెస్ట్ కాలేజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్న వీరిద్దరికీ ఈ గొప్ప అవకాశం వచ్చింది. గతంలో సూర్య దీపిక, ఎం ఎస్సీ ఫారెస్ట్ జెనటిక్స్ లో సీటు సాధించింది. ఇప్పుడు సుహర్ష ఎం.ఎస్సీ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో రెండేళ్ల కోర్సును ఎంపికైంది. ట్యూషన్ ఫీజు రెండేళ్లకు కలిపి 30 వేల డాలర్లు యూనివర్సిటీ మినహాయింపును ఇచ్చింది. దీనితో పాటు 1500 డాలర్ల స్కాలర్ షిప్ ను కూడా రెండేళ్ల పాటు ఆఫర్ చేసింది.…

Read More