కశ్మీర్ కల్లోలం.. ! కారణం, కారకులెవరు ? వికాసం విశ్లేషణ

జమ్ము కశ్మీర్.. ! భారత్ లో ప్రకృతి అందాల పరంగా భూతల స్వర్గం. శాంతి, భద్రత పరంగా చూస్తే మాత్రం నిత్యం రగులుతున్న కాష్టం. పాకిస్తాన్ సైన్యం ఓ వైపు, ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు మరోవైపు బరితెగించి జమ్ము కశ్మీర్ లో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. 1947లో మొదలైన ఈ విధ్వంసంనేటికీ కొనసాగతోంది. కశ్మీర్ ప్రజలను నిత్యం అశాంతిలో, ఆందోళనలో, ఆవేదనలో బతుకులీడ్చేలా చేస్తోంది. ఈ మారణకాండలో వేలాది సైనికులు, సామాన్యులు సమిధలయ్యారు. భారత సైన్యం కంటిమీద కునుకులేకుండా జల్లెడపడుతూ తీవ్రవాదులను ఏరివేస్తున్నాసరిహద్దులో గుంట నక్కలా కాచుకోని కూర్చున్న పాకిస్తాన్ కశ్మీర్ లో యువతను తీవ్రవాదం వైపు మళ్లిస్తు భారత్ పైకి ఉసిగొల్పుతోంది. పాకిస్తాన్ నిఘా సంస్థ ISI తోడ్పాటుతో జై షే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి కరుడుగట్టిన తీవ్రవాద సంస్థలు.. భారత్ లో రక్తపుటేరులు పారిస్తున్నాయి. సైన్యానికి సవాల్ విసురుతున్నాయి. ఫిబ్రవరి 14న జమ్మ కశ్మీర్ లోని పుల్వామాలో జై షే మొహమ్మద్ తీవ్రవాది ఆదిల్ అహ్మద్ ధర్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ప్రతీకారంగా ఆ ప్రాంతం మొత్తం జల్లెడపట్టిన భారత సైన్యందాడిలో కీలక పాత్ర పోషించిన ఉగ్రమూకలను అంతమొందించింది. సరిహద్దులో ఇంకా వేట కొనసాగిస్తోంది. పుల్వామాలో సీఆర్పీఎఫ్ పై జరిగిన దాడితో భారత్ లో ఆగ్రహావేశాలు మిన్నంటాయి. యువత ప్రతీకార నినాదాలతో ర్యాలీలు చేపట్టింది. మేధావుల్లో ఓ వర్గం పాకిస్తాన్ కి గట్టి బుద్ధి చెప్పాలని నినదిస్తేమరో వర్గం కశ్మీర్ లో అశాంతిని పరిష్కరించాలని సూచిస్తున్నారు. అయితే…. కశ్మీర్ లో ఈ అశాంతి ఇంకా ఎన్నాళ్లు.. ? ప్రకృతి అందాల నిలయమైన కశ్మీర్ లో కల్లోలంగా ఎందుకు మారింది ? కారకులెవరు ? భారత్ పాకిస్తాన్ ల విభజనకు ముందు…. తర్వాత ఏం జరిగింది… ?

కశ్మీర్క్లిష్ట సమస్య

భారత్, పాకిస్తాన్ ల మధ్య ఏళ్లుగా కొనసాగుతున్న అతి క్లిష్ట సమస్య.. కశ్మీర్. 1947 నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. ఎందరో మహనీయుల పోరాటాలతో 1947లో భారత్ కు స్వాతంత్ర్యం ఇచ్చేందుకు బ్రిటీష్ అంగీకరించింది. ఈ సమయంలోనే.. హిందూ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని భారత్ గాముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్ గా విభజించింది. అప్పటికీ ఈ రెండు ప్రాంతాల్లో రాజుల ఆధీనంలో దాదాపు 500 సంస్థానాలు ఉండేవి. కశ్మీర్, హైదరాబాద్ అందులోవే. అందుకేబ్రిటీష్ ప్రభుత్వం సంస్థానాల ముందు 4 ఆప్షన్స్ ఉంచింది. వాటిలో నుంచి సంస్థానాలను ఏదైనా ఎంపిక చేసుకోవచ్చని చెప్పిందిఅవి

  1. కావాలంటే భారత్ లో కలవచ్చు

  2. కావాలంటే పాకిస్తాన్ లో కలవచ్చు

  3. స్వతంత్ర రాజ్యంగాను ఉండొచ్చు

  4. ప్రజా అభిప్రాయం ప్రకారం నడుచుకోవచ్చు ( Plebiscite )

దీని ప్రకారం చాలా సంస్థానాలు భారత్, పాకిస్తాన్ లో కలిశాయి. ముస్లిం ప్రజలు అధికంగా ఉన్న కశ్మీర్ కి ఆ సమయంలో మహారాజా హరిసింగ్ రాజుగా ఉండేవారు. అలాగేహిందూ ప్రజలు అధికంగా ఉన్న హైదరాబాద్ లో నిజాం రాజుగా ఉండేవారు. నెహ్రూ ఎంత ఒత్తిడి చేసినా.. కశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ భారత్ లో కలిసేందుకు అంగీకరించలేదు. కశ్మీర్ చెందిన రాజకీయ నేత షేక్ అబ్దుల్లా (జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తాత) నెహ్రూకి మం

చి మిత్రుడు. ఒక వేళ భారత్ లో కలిస్తే నెహ్రూ కశ్మీర్ ని షేక్ అబ్దుల్లా చేతిలో పెడతాడని రాజా హరిసింగ్ భావించారని…. అందుకే స్వతంత్రంగా ఉండేందుకే నిర్ణయించుకున్నా

రని చరిత్రకారులు చెబుతారు. అందులో భాగంగానేకశ్మీర్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. మహారాజా హరిసింగ్ ఆధీనంలో తక్కువ సైన్యంతో ఉన్న జమ్ము కశ్మీర్ పై పాకిస్తాన్ కన్నేసింది. సమయం కోసం వేచి చూసిగుంట నక్కలా అదును చూసి పాకిస్తాన్.. కశ్మీర్ ఆక్రమణకు తెగించింది. హరిసింగ్ సేనలు వీరోచితం

Maharaja Harisingh

గా పోరాడినాసగం కశ్మీర్ పాకిస్తాన్ ఆధీనంలోకి వెళ్లింది. దీన్నే POK ( Pakisthan Occupied Kashmir ) అంటున్నాం. జరుగుతున్న భారీ నష్టాన్ని చూసి హరిసింగ్ భారత్ సహాయాన్ని కోరారు. నెహ్రూ విధించిన షరతులకుభారత్ లో విలీనమయ్యేందుకు, రాజ్యాధికార పదవి నుంచి తొలగేందుకు హరిసింగ్ అంగీకరించారు. 1947 అక్టోబర్ 26న విలీన పత్రంపై మహారాజా హరిసింగ్ సంతకం చేశారు. దీన్నే Instrument of Accession అంటారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే .. కదనరంగంలోకి దిగిన భారత్ సేనలు పాకిస్తాన్ సైన్యాన్ని విజయవంతంగా నిలువరించాయి. అప్పటికే పాకిస్తాన్ ఆక్రమించిన ప్రాంతం వారీ ఆధీనంలోనే ఉండిపోయింది. భారత్ ఆధీనంలో జమ్మూ, లడాక్, కశ్మీర్ మిగిలాయి. జమ్ము, ల‌‌‌డాక్ ప్రజలు భారత్ లోనే ఉండాలని కోరుకుంటారు. కానీ వచ్చిన సమస్య మొత్తం కశ్మీర్ లోనే.

 

కశ్మీర్ ప్రాంతం భారత్ లో విలీనమయ్యాకనెహ్రూ తన మిత్రుడు షేక్ అబ్దుల్లాని కశ్మీర్ రెండో ప్రధానిగా (కశ్మీర్ మొదటి ప్రధాని మెహర్ చంద్ మహాజన్ ) నియమించారు. పాకిస్తాన్ సానుభూతి పరుడిగా ఉంటూఆ ప్రాంత ప్రజల్లో భారత్ పట్ల విద్వేషాలు నూరిపోసేవాడన్నది షేక్ అబ్దుల్లా పై ప్రధాన ఆరోపణ. ఈ కారణంగానే ఆయన 11 ఏళ్ల జైలులో ఉన్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దొంగచాటున పాకిస్తాన్, ఇంటి దొంగల కారణంగా కశ్మీర్ ప్రజల్లో అప్పటికే భారత్ పట్ల విద్వేషాల విత్తనాలు పెరిగి చెట్టుగా మారాయి. అయినా…. 1989 వరకు శాంతి భద్రతలు ఎన్నడూ చేయి దాటలేదు. 1947 కశ్మీర్ పోరాటం, 1965, 1971 యుద్ధాల్లో భారత్ సైన్యం చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్… అంగబలం ద్వారా భారత్ ను జయించలేమనే నిర్ణయానికి వచ్చింది. కుయుక్తులు పెంచి.. కశ్మీర్ లో అశాంతిని పెంచి పోషించేందుకు చర్యలు తీవ్రం చేసింది. అందులో భాగంగాఉగ్రవాదులను ఉసిగొల్పికశ్మీర్ లో యువతను తీవ్రవాదం వైపు మళ్లించేలా ప్రోత్సహించింది. కశ్మీర్ లో ముస్లిం జనాభా అధికం. ఆనాడు కశ్మీర్ పండిట్లు 5 శాతంగా ఉండేవారు. వేర్పాటువాద ముసుగులో తీవ్రవాదులుకశ్మీరి పండిట్లపై దాడులకు దిగారు. వారి ఇళ్లను ధ్వంసం చేశారు. దొరికిన కాడికి దోచుకున్నారు. దేవాలయాలను కూల్చివేశారు. ఇదంతా పాకిస్తాన్ కనుసన్నల్లోనే జరిగిందని మాజీ సైనికాధికారులు చెబుతారు. ఇలా సరిహద్దు వెంట ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంతో పాటు కశ్మీర్ లో యువతను ప్రభావితం చేసివారిలో వేర్పాటువాద భావాలను నూరిపోసింది. కశ్మీర్ ని పాకిస్తాన్ లో కలపండి అనే నినాదాన్ని వారి నోట పలకించిభారత్ కి వ్యతిరేకంగా పోరాడేలా తయారు చేసింది. కొంతమంది కశ్మీరిలు మాత్రం ఇప్పటికీ తమని ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలావేర్పాటువాద, ప్రత్యేక వాదుల నినాదాలు, ఆందోళనలు, తీవ్రవాదుల స్వేచ్ఛా కదలికలతో కశ్మీర్ నిత్యం రణరంగాన్ని తలపిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎన్ని శాంతి చర్చలు జరిపినాఅడుగు ముందుకు పడటం లేదు

Sheikh Abdullah

. కాల్పుల విరమణ ఒప్పందాలకు కూడా తూట్లు పొడిచి పాక్ సరిహద్దు వెంట నిత్యం కాల్పులు జరుపుతూనే ఉంది. పాక్ పెంచి పోషించిన ఉగ్రమూకలు…. భారత్ లో అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటూనే ఉన్నారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ, భారత పార్లమెంట్, ముంబయిలోని తాజ్ హోటల్ పై దాడులు పాక్ ప్రేరేపతి ఉగ్రదాడులే అన్నది సుస్పష్టం. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడి కూడా తామే చేశామని జై షే మహమ్మద్ తీవ్రవాద సంస్థ ప్రకటించింది. దాని చీఫ్ మౌలానా మసూద్ అజూర్ పాకిస్తాన్ లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. పాకిస్తాన్ సహాయంతోనే తీవ్రవాదులు భారత్ లో దాడులకు తెగబడుతున్నారని చెప్పేందుకు ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఏం కావాలి.. ?

కశ్మీర్ భారత్ కు ఎందుకు కీలకం.. ?

మరి కశ్మీర్ వేర్పాటువాదులు పాకిస్తాన్ లో కలుస్తామని అంటున్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నిర్ణయం తీసుకోవచ్చు కదా ? అని కొందరు మేధావులు భారత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మానవత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ పేరిట చాలా మంది ఇలాంటి వ్యాఖ్యలు, డిమాండ్లు చేస్తున్నారు. కానీఅలా చేస్తే దేశం మొత్తానికి ప్రమాదమే అన్నది సుస్పష్టం. ఎందుకంటేకశ్మీర్ భౌగోళిక స్వరూపం, నదీ జలాలు, పర్యాటక రంగం, వ్యూహాత్మక అంశాల పరంగా భారత్ కు అత్యంత కీలక ప్రాంతం.

నీరు

కశ్మీర్ లో నీటి వనరులు పుష్కలం. ఇక్కడి నుంచే పలు నదులు పారుతున్నాయి. ఈ నీటి కోసమే భారత్, పాకిస్తాన్ మధ్య ఏళ్లుగా వివాదం నడుస్తోంది. అందుకేప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ మధ్య ఇండస్ వాటర్ ఒడంబడిక కుదిరింది. ఇండస్ కింద ఆరు నదులు ఉన్నాయి. అవి బియాస్, రవి, సట్లెజ్, ఇండస్, చెనాబ్, జెలమ్.

రవి, బియాస్, సట్లెజ్ నదులు భారత్ నియంత్రణ కింద… ఇఇండస్, జెలమ్, చెనాబ్ నదులపై పాకిస్తాన్ నియంత్రణ ఉండేలా ఒడంబడిక జరిగింది. లాగే భారత్ మీదుగా ప్రవహించే ఇండస్ నదిలో సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి కోసం 20 శాతం నీటిని భారత్ ఉపయోగించుకోవాలి. ఈ మేరకు 1960 సెప్టెంబర 19న అప్పటి భారత్ ప్రధాన మంత్రి జవహార్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ సంతకం చేశారు. అయితేకశ్మీర్ ని పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకుంటేనీటి వనరులు పూర్తిగా తమకే దక్కుతాయన్నది పాకిస్తాన్ కుట్ర. అందులో భాగంగానే.. కశ్మీర్ లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తోంది.

వ్యూహాత్మక ప్రాముఖ్యత

కశ్మీర్ భారత్ లోచైనా, పాకిస్తాన్ మధ్య ఉంటుంది. ఈ రెండు దేశాలతో భారత్ కు ఎప్పటికీ ప్రమాదం పొంచి ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాంతం పూర్తిగా పాకిస్తాన్ చేతిలోకి వెళితేచైనా, పాక్ కలిసి.. భారత్ ను ఇరకాటంలోకి నెట్టే ప్రమాదం ఉంది. అలాగేప్రస్తుతం పీవోకే గా పిలుస్తోన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతం భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటేమన దేశానికి ఆఫ్గనిస్తాన్ తో నేరుగా దారి ఏర్పడుతుంది.

పర్యాటకరంగం

కశ్మీర్ అందాల గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. ఇక్కడి ప్రకృతి అందాలని చూసి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలా కశ్మీర్ ప్రాంతానికి టూరిజం రంగం నుంచి భారీ ఆదాయం సమకూరుతుంది. అక్కడ పూర్తిగా శాంతి వాతావరణం నెలకొంటే.. టూరిస్టుల సంఖ్య ప్రస్తుతానితో పోలిస్తే నాలుగు రెట్లు పెరుగుతుంది. అది దేశానికి ఆదాయంతో పాటు ఖ్యాతిని పెంచుతుంది. అందుకేదీనిపై కన్నేసింది పాకిస్తాన్.

డ్రై ఫ్రూట్స్ రంగం కశ్మీర్ భారత్ లోని డ్రై ఫ్రూట్స్ వ్యాపారానికి రాజధాని.

కశ్మీర్ విల్లో క్రికెట్ తో పరిచయం ఉన్న వారికి కశ్మీర్ విల్లో తెలుసు. కేవలం అక్కడ మాత్రమే పెరిగే విల్లో చెట్లతో క్రికెట్ బ్యాచ్ లు తయారు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే క్రికెట్ బ్యాట్లు ఇక్కడి నుంచే సరఫరా అవుతాయి.

శాంతి నెలకొల్పే అస్త్రం ఏది.. ?

పాకిస్తాన్ ఎన్ని కుయుక్తులు, కుట్రలు పన్నినా.. భారత్ మాత్రం శాంతికే ప్రాముఖ్యత ఇచ్చింది. దెబ్బకు దెబ్బ పరిష్కారం కాదన్న సూత్రంతో.. ముందుకు సాగింది. చర్చల ద్వారా కశ్మీర్ సమస్య పరిష్కారానికి సిద్ధమని అంతర్జాతీయ వేదికలపై ఎన్నోసార్లు స్పష్టం చేసింది. మాజీ ప్రధాని, భారత రత్న వాజ్ పేయి ఈ అంశంలో చాలా అడుగులు ముందుకు వేశారు. అయినా.. కుట్రల పాకిస్తాన్ తన వక్రబుద్ధిని దాడుల ద్వారా మళ్లీ మళ్లీ ప్రదర్శించింది. ఇలాంటి దాడులు, సైనికుల వీర మరణాలు, ప్రజల్లో భావోద్వేగాలు పెంచుతాయి. యుద్ధం ప్రకటించాలనే నినాదాలు పెళ్లుబికుతాయి. కానీ.. యుద్ధం ఏనాడూ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపదు. అందుకే.. ముందుగా కశ్మీర్, పాకిస్తాన్ అంశంలో భారత్ లోని రాజకీయ పార్టీలు, నేతలు ఏకాభిప్రాయానికి రావాలి. ఐక్యంగా పోరాడాలి. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా.. ఈ అంశంలో విపక్షాలు రాజకీయాలను వదిలేసి ప్రభుత్వంతో కలిసి నడవాలి. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఒంటరి చేయాలి. అగ్రదేశాలు, ఐరాస పాకిస్తాన్ ను తీవ్రవాద దేశంగా ప్రకటించేలా ఒత్తిడి తీసుకురావాలి. ప్రపంచ దేశాలు పాకిస్తాన్ తో వాణిజ్య సంబంధాలు నిలిపివేశేలా చర్చలు జరపాలి. ఇలా దౌత్య పరంగా పాకిస్తాన్ ఏకాకి చేస్తూనేసరిహిద్దు వెంట ఉన్న తీవ్రవాదులను ఏరివేయాలి. వారి స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేయాలి. తీవ్రవాదులపై చర్యలకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి.

ఇలా అంతర్జాతీయ స్థాయిలో అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తే పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులతో దారికి వస్తుంది. అప్పుడే కల్లోల కశ్మీర్ లో శాంతి నెలకొంటుంది. వర్ణనలో ఉన్న భూతల స్వర్గంకశ్మీర్ లో ఎప్పుడు చూస్తామో అని ప్రతి భారతీయుడు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు… !

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments