MLC ఎలక్షన్స్ – లెక్క ఎక్కువైతే కారుకే లక్కు !!

MLC Kodandaram

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి జోరందుకుంది. హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి స్థానం నుంచి ఎవరు పోటీలో ఉంటారన్న విషయంపై ఇంకా క్లారిటీ లేకున్నావరంగల్ నల్గొండ – ఖమ్మం సీటు నుంచి బరిలో ఉండేవారెవరనే విషయంలో స్పష్టత వచ్చింది. తెలంగాణ జన సమితి నుంచి ఆచార్య కోదండరామ్ పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. తెలంగాణ ఇంటి పార్టీ నుంచి డాక్టర్ చెరుకు సుధాకర్.. యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమ బరిలో నిలవటం ఖాయమైంది. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి మళ్లీ పోటీలో ఉంటారని సమాచారం. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థి ఎవరన్నది తేల్చలేదు. తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్), సుదగాని ఫౌండేషన్ ఛైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మరికొంత మంది విద్యావేత్తలు, పాత్రికేయులు ఎన్నికల్లో నిలబడేందుకు ఆసక్తిగా ఉన్నారు.

హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ తో పోలిస్తేవరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎలక్షన్ రసవత్తరంగా మారింది. ఇంతమందిలో విజయం ఎవరిని వరిస్తుందన్నది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కారణంఎన్నికల బరిలో ఉన్న ఒక్కొక్కరు ఒక్కో విషయంలో తమకంటూ ఓ ప్రత్యేకత సాధించుకొని విద్యావంతుల దృష్టిని ఆకర్షించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత ఎవరంటే.. మరొ ఆలోచన లేకుండా అంతా ఆచార్య కోదండరామ్ పేరు చెబుతారు. తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీలు జేఏసీగా ఏర్పడటంలోసాగరహారం నిర్వహణలో కోదండరామ్ కీలక పాత్ర పోషించారు. ఆచార్య జయశంకర్ తర్వాత తెలంగాణ సమాజానికి అంతలా దగ్గరైన మరో దిక్సూచి కోదండరామ్. అందుకే విద్యావంతులు, ఓయూకేయూ విద్యార్థులంతా కోదండరామ్ ని సార్ అని ఆప్యాయంగా పిలుస్తూ ఆయనపై అభిమానం చూపిస్తారు.

తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన ప్రతిపోరాటంలో డాక్టర్ చెరుకు సుధాకర్ ముందు నిలిచారు. 1997లో మారోజు వీరన్న చొరవతో ఏర్పాటైన తెలంగాణ మహా సభ కన్వీనర్ గా వ్యవహరించిన ఈ పేదల డాక్టర్.. 17 డిమాండ్లతో సూర్యాపేట డిక్లరేషన్ను ప్రతిపాదించారు. టీఆర్ఎస్ లో కేసీఆర్ తో కలిసి ఉద్యమించారు. సకల జనుల సమ్మె సమయంలో ఆంధ్రా నుంచి వచ్చే బస్సులని అడ్డుకొని అరెస్టు అయ్యారు. అప్పటి ప్రభుత్వం ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసి.. ఏడాది పాటు నిర్బంధించింది. తెలంగాణ సాధన తర్వాత కేసీఆర్ తో విభేదాల వల్ల టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన చెరుకు సుధాకర్.. తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించారు. ఇప్పుడు పట్టభద్రులు తనని మండలికి పంపిస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు.యువ తెలంగాణ పార్టీ నుంచి బరిలో ఉన్న రాణి రుద్రమ రెడ్డికి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. టీవీ9, సాక్షి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీ న్యూస్, హెచ్ ఎం టీవీ వంటి ప్రధాన స్రవంతి మీడియాలో పని చేసిన అనుభవం తో పాటు దశ దిశ వంటి ప్రోగ్రాంలకు సమన్వయ కర్త గా, ప్రయోక్త గా వ్యవరించి ప్రజల్లోకి వెళ్లగలిగారు. యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీగా గట్టి పోటీ ఇచ్చారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దిగుతున్నట్లు కొంత కాలంగా చెబుతూనే ఉన్న తీన్మార్ మల్లన్నగతంలో V6 ఛానల్ లో పనిచేసి తర్వాత 10 టీవీ కి మారారు. ఇప్పుడు టీవీ ఫైవ్ లో స్లాట్ కు పని చేస్తున్నారు. సొంతంగా క్యూ న్యూస్ ఛానల్ నడిపిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిత్యం ప్రజల్లో ప్రజాభిమానం చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థిగా మాజీ హోంమంత్రి దేవేందర్‌గౌడ్‌ వ్యక్తిగత సహాయకుడైన యాదాద్రి జిల్లాకు చెందిన సుదగాని హరిశంకర్‌ గౌడ్‌ పోటీకి సిద్ధమయ్యారు. సుధగాని ఫౌండేషన్‌ తరఫున రెండేళ్లుగా ఈయన యాదాద్రి, వరంగల్‌ జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రస్తుతానికి ఏ అభ్యర్థినీ ప్రకటించలేదు.ఇంత మంది ప్రముఖులు పోటీ చేస్తున్న ఈ స్థానంలోపట్టభద్రులు ఎటు మొగ్గుచూపుతారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తెలంగాణ ఉద్యమ, ఆకాంక్షపరులు, విద్యావేత్తలు తనకు అండగా ఉంటారని కోదండరామ్ విశ్వసిస్తున్నారు. పేదల డాక్టర్ గా తనకున్న పేరు.. ఉద్యమకాలంలో చేసిన పోరాటం చూసి గ్రాడ్యుయేట్లు తనవైపు నిలుస్తారని డాక్టర్ చెరుకు సుధాకర్ ఆశాభావంతో ముందడుగు వేస్తున్నారు. రాణి రుద్రమ, తీన్మార్ మల్లన్న, సుధగాని హరిశంకర్ గౌడ్ విజయంపై ధీమాతో ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.

ఇంత మంది ఒకే స్థానం నుంచి పోటీ పడుతుండటంగ్రాడ్యుయేట్ ఓటర్లను అయోమయంలో పడేసింది. నామినేషన్ విత్ డ్రా తర్వాత కూడా వీరంతా మా దారి మాదేనంటు బరిలో ఉంటే మాత్రంవరంగల్ నల్గొండ ఖమ్మం స్థానంలో టీఆర్ఎస్ నక్క తోక తొక్కినట్లే !!!

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments