Weekly Current Affairs – October 8 – 15, 2018

జాతీయం

లక్నోలో ఐఐఎస్ఎఫ్ – 2018

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్-2018 (IISF – 2018) జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అక్టోబర్ 6న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 • రాష్ట్రపతి మాట్లాడుతూదేశంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం తక్కువగా ఉందని అన్నారు. పతిష్టాత్మక సీఎస్‌ఐఆర్‌లో మహిళా శాస్త్రవేత్తలు 18.3 శాతం మాత్రమేఉన్నారని చెప్పారు.

 • కేంద్రం చర్యల కారణంగా గత ఐదేళ్లలో దాదాపు 649 మంది శాస్త్రవేత్తలు విదేశాల నుంచి భారత్‌కి తిరిగి వచ్చారని రాష్ట్రపతి తెలిపారు.

సర్ చోటూరామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

హరియాణాకు చెందిన జాట్ నేత, రైతు పోరాట యోధుడు, దీన్‌బంధు సర్ చోటూరామ్ 64 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 9న ఆవిష్కరించారు. రోహ్‌తక్ జిల్లా గర్హి సంప్లాలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. స్వాతంత్య్రానికి ముందు రైతుల కోసం సర్ చోటూరామ్ ఎన్నో ఉద్యమాలు నడిపారని చెప్పారు.

 • హరియాణ పర్యటనలో భాగంగా…. సొనిపట్ జిల్లా బర్హిలో రూ.500 కోట్లతో ఏర్పాటు చేసే రైల్ కోచ్ మరమ్మతు, ఆధునీకరణ కర్మాగారానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 160 ఎకరాల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు 2020-21కల్లా పూర్తవుతుందని ఉత్తర రైల్వే తెలిపింది.

కల్తీ విత్తనాలు అమ్మినందుకు జరిమానా

నాణ్యతలేని బీటీ పత్తి విత్తనాలు విక్రయించిన 90 మల్టీనేషనల్ కంపెనీలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.1200 కోట్ల జరిమానా విధించింది. వీటిలో మోన్ శాంటో వంటి టాప్ కంపెనీలున్నాయి. నకిలీ విత్తనాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 11.50 లక్షల మంది రైతులు నష్టపోయారని వెల్లడించింది. జరిమానా నుంచి రైతులకు పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

అసమానతల్లో 147వ స్థానంలో భారత్

ప్రజల మధ్య అసమానతలు రూపుమాపడంలో భారత్ 147వ స్థానంలో నిలిచింది. ఈ అంశంలో భారత్ తగిన స్థాయిలో కృషి చేయడం లేదని పేర్కొంటూ.. జపాన్ కు చెందిన ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థ నివేదికను విడుదల చేసింది. మొత్తం 157 దేశాల్లో ఉన్న పరిస్థితులను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు.

 • ఈ ర్యాంకింగ్స్ లో డెన్మార్ తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో జర్మనీ, మూడో స్థానంలో ఫిన్లాండ్ నిలిచాయి.

 • జపాన్ 11వ ర్యాంక్ తో ఆసియా దేశాల్లో అత్యుత్తమ ర్యాంక్ ని సొంతం చేసుకుంది.

ఖైదీలకు వీడియోకాల్ సౌకర్యం

దేశంలోనే తొలిసారిగా మహారాష్ట్రలో మహిళా ఖైదీలు, ఓపెన్ జైళ్లలోని ఖైదీలు వారి కుటుంబాలకు వీడియో కాల్ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి ఖైదీ 5 నిమిషాలు వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. తొలుత పూణెలోని ఎర్రవాడ జైలులో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఇప్పుడు రాష్ట్రమంతటా విస్తరించారు. నిర్దేశించిన రోజు ఖైదీలు 5 నిమిషాలకు రూ. 5 చెల్లించి ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

రాష్ట్రీయం

హైదరాబాద్ లో క్వాల్కమ్

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ క్వాల్కామ్తన ఉత్పత్తుల అభివృద్ధి కేంద్రం (క్యాంపస్)ను హైదరాబాద్‌లోని కోకాపేటలో ఏర్పాటు చేయనున్నట్లు అక్టోబర్ 6న ప్రకటించింది. రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపస్‌లో 5జీ మొబైల్ టెక్నాలజీపై పరిశోధనలు, పరీక్షలు నిర్వహిస్తారు. చనున్నారు.

 • ఈ క్యాంపస్ ద్వారా 10 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

 • అమెరికాలోని శాన్‌డియాగో కేంద్రంగా క్వాల్కమ్ పనిచేస్తోంది.

 • ఈ అభివృద్ధి కేంద్రం అమెరికా బయట ఉన్న క్యాంపస్‌లలో అతిపెద్ద క్యాంపస్ కానుందని ఆ సంస్థ పేర్కొంది.

భీమా పుష్కరాలు ప్రారంభం

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా మండలంలో ప్రవహిస్తున్న భీమా నది పుష్కరాలు అక్టోబర్ 11న ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 22 వరకు ఈ పుష్కరాలు కొనసాగుతాయి.

 • తెలంగాణలో కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే భీమా నది ప్రవహిస్తోంది.

 • పుష్కరాలను పురస్కరించుకొని తంగిడి, కుసునూర్, శుక్రలింగంపల్లి గ్రామాల్లో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు.

 • మహారాష్ట్రలోని పూణె జిల్లాలో గల సహయాద్రి కొండల్లో భీమాశంకర్ దేవాలయం వద్ద భీమా నది ప్రారంభం అవుతుంది.

 • మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ప్రవహించితెలంగాణ, కర్ణాటక సరిహద్దులో కృష్ణా నదిలో కలుస్తుంది.

తిరుపతిలో ఐఐఎస్ఈఆర్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ లోని ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో భారత వైజ్ఞానిక విద్య, పరిశోధన సంస్థ(IISER-Indian Institute of Science and Research) శాశ్వత కేంద్రం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒడిశాలోని బరంపురంలోనూ ఇదే తరహా కేంద్రం ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. 2021 నాటి కల్లా ఆయా కేంద్రాల్లో భవన నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

తిత్లీతుపాను బీభత్సం.. శ్రీకాకుళం అతలాకుతలం

తిత్లీ తుపాన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో విధ్వంసం సృష్టించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తిత్లీ తుపాను అక్టోబర్ 11న ఉదయం 4:30 నుంచి 5:30 మధ్య శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారథి గ్రామం వద్ద గంటకు 150 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటింది. అనంతరం బలహీనపడింది.

 • శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానంపై తిత్లీ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 2 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. జిల్లావ్యాప్తంగా 3 లక్షల కొబ్బరి చెట్లు నేలకూలాయి.

 • తుపాన వల్ల మొత్తంగా రూ.1,500 కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని ప్రాథమిక అంచనా.

హైదరాబాద్ లో అంతర్జాతీయ విత్తన సదస్సు

2019 జూన్ 26 నుంచి జూలై 3 వరకు హైదరాబాద్ లో అంతర్జాతీయ విత్తన సదస్సు జరగనుంది. ఇస్టా కాంగ్రెస్ (International Seed Testing Association) ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి తెలిపారు. అక్టోబర్ 11న సదస్సు లోగో, కరదీపికలను ఆవిష్కరించారు.

 • 94 ఏళ్ల ఇస్టా చరిత్రలో ఇలాంటి సదస్సుని ఆసియా ఖండంలో నిర్వహించడం ఇదే తొలిసారి.

 • ISTA ను 1924లో స్థాపించారు.

అందుబాటులోకి టీ చిట్స్ యాప్

తెలంగాణలో చిట్ ఫండ్ సంస్థల మోసాలు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ టీచిట్స్పేరుతో కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా రిజిస్టర్ అయిన చిట్ ఫండ్ సంస్థల వివరాలు, అనుమతులు, పరిధులు, సహా అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. చిట్టీలకు సంబంధించి ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని నాలుగు చిట్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పైలెట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. అమలులో ఇబ్బందులుంటే సరిచేసి త్వరలోనే రాష్ట్రం మొత్తం అమల్లోకి తేనున్నారు.

అంతర్జాతీయం

మోస్ట్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్ గా.. జపాన్ పాస్ పోర్ట్

అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్ట్ గా.. జపాన్ పాస్ పోర్ట్ నిలిచింది. ఇటీవల జపాన్ దేశస్తులు వీసా అవసరం లేకుండా వెళ్లే 190వ దేశంగా మయన్మార్ గుర్తింపు పొందడంతోజపాన్ పాస్ పోర్ట్.. అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టు అయ్యింది. 189 దేశాలతో సింగపూర్ రెండో స్థానంలో, 188 దేశాలతో ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణాఫ్రికా దేశాలు 3వ స్థానంలో ఉన్నాయి.

 • ఏ దేశానికైతే అత్యధిక విదేశాలకు వెళ్లడానికి వీసా అవసరం లేదో.. ఆ దేశ పాస్ పోర్ట్ ను అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణిస్తారు.

 • ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా దేశాల మధ్య ఈ సదుపాయం ఏర్పడుతుంది.

 • ఈ జాబితాలో భారత్ 76వ స్థానంలో ఉంది. భారత పాస్ పోర్టుతో వీసా లేకుండా కానీ, వీసా ఆన్ అరైవల్ విధానం ద్వారా కానీ 59 దేశాలకు వెళ్లవచ్చు.

మరణ శిక్ష రద్దుకి మలేసియా కేబినెట్ నిర్ణయం

తీవ్రమైన నేరాలకు పాల్పడే దోషులకు విధించే మరణ శిక్షను త్వరలోనే రద్దు చేసే దిశగా మలేసియా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రధాని ముహతీర్ మొహమ్మద్ అధ్యక్షతన అక్టోబర్ 10న జరిగిన కేబినెట్ సమావేశంలోమరణ శిక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 • ఈ మేరకు మరణ దండనకు సంబంధించిన చట్టంలో సవరణలు చేస్తూ త్వరలో కొత్త బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెడతామని మలేసియా ప్రభుత్వం ప్రకటించింది.

 • తాజా నిర్ణయంతో త్వరలో మరణశిక్ష అమలు కానున్న 1,200 మందికిపైగా ఖైదీలకు ఊరట లభించింది.

 • ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 142 దేశాలు మరణ శిక్షను తిరస్కరిస్తున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శి కుమీ నైదూ వెల్లడించారు. భారత్, సింగపూర్, చైనా, ఇండోనేషియా, థాయ్ లాండ్, వియత్నాం దేశాలు శిక్షను ఇంకా అమలు చేస్తున్నాయి.

UNHRC ఎన్నికల్లో భారత్ గెలుపు

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో( United Nations Human Rights Commission ) సభ్య దేశాల ఎంపిక కోసం జరిగిన ఎన్నికలలో భారత్ విజయం సాధించింది. అక్టోబర్ 12న జరిగిన ఓటింగ్ లో విజయం సాధించేందుకు 97 ఓట్లు అవసరం కాగాభారత్ కు 188 ఓట్లు వచ్చాయి. దీంతో.. 2019 జనవరి 1 నుంచి 3 ఏళ్ల కాలానికి భారత్ యూఎన్ హెచ్ఆర్సీలో సభ్య దేశంగా ఎంపికైంది. భారత్ తో పాటు మరో 18 దేశాలు కూడా ఎంపికయ్యాయి.

 • 2011-14, 2014-17 మధ్య భారత్ రెండుసార్లు UNHRCకి ఎంపికైంది.

 • UNHRC ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది.

 • ఈ సంస్థను 2006లో స్థాపించారు. అంతర్జాతీయంగా మానవ హక్కుల రక్షణ కోసం ఈ సంస్థ కృషి చేస్తుంది.

SCO సదస్సులో పాల్గొన్న సుష్మా స్వరాజ్

తజకిస్థాన్ రాజధాని డుషన్‌బేలో అక్టోబర్ 12న జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సభ్యదేశాల ప్రభుత్వ విభాగాధిపతుల సదస్సులో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. ఈ సదస్సుకి భారత ప్రతినిధిగా హాజరైన సుష్మా మాట్లాడుతుఅభివృద్ధికి ఉగ్రవాదం అవరోధంగా నిలిచిందన్నారు. పారదర్శకత, సుపరిపాలన, ప్రాదేశిక సమైక్యత, సంప్రదింపులే ప్రాతిపదికగా దేశాల మధ్య కనెక్టివిటీని పెంచుకోవాలని పేర్కొంటూపరోక్షంగా చైనాపాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) కోసం ఇరు దేశాలు అనుసరిస్తున్న విధానాలని తప్పు పట్టారు.

 • చైనాపాకిస్థాన్ ఆర్థిక కారిడార్ ని 50 బిలియన్ డాలర్ల వ్యయంతో పాకిస్థాన్చైనా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఫ్రాన్స్ లో పర్యటించిన భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్

భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అక్టోబర్ 12న ఫ్రాన్స్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలురెండు దేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతంపై చర్చించారు.

అనంతరంరఫేల్ యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని నిర్మలా సీతారామన్ సందర్శించారు. విమానాల తయారీ పురోగతిని పరిశీలించారు. ఫ్రెంచ్ కంపెనీ డసో ఏవియేషన్ తయారుచేసే రఫేల్ యుద్ధ విమానాలను 2019లో భారత్‌కు సరఫరా చేయనున్నారు.

ఆర్థికం

2018-19లో భారత వృద్ధి రేటు 7.3 శాతం: ప్రపంచ బ్యాంక్

2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఈ మేరకు అక్టోబర్ 7ఓ నివేదికను విడుదల చేసింది.

 • 2019-20, 2020-21లో వృద్ధి రేటు 7.5 శాతంగా నమోదవుతుందని ముందస్తు అంచనాల్లో పేర్కొంది.

ఉత్తరాఖండ్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ప్రారంభించిన ప్రధాని

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ‘డెస్టినేషన్ ఉత్తరాఖండ్: ఇన్వెస్టర్స్ సమ్మిట్-2018’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 7న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం కీలక సామాజిక, ఆర్థిక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, పెట్టుబడులకు ప్రపంచంలోనే అత్యంత అనుకూలంగా మారిందని అన్నారు. వచ్చే దశాబ్దాల్లో భారత్ ప్రపంచ ఆర్థిక చోదక శక్తిగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

 • ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్

2018-19లో భారత వృద్ధి రేటు 7.3 శాతం : ఐఎంఎఫ్

2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF) అంచనా వేసింది. 2019-20లో 7.4 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ 9‘వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

 • 2018-19లో భారత్ ‘ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ’ హోదాను దక్కించుకుంటుందని ఐఎంఎఫ్ తెలిపింది.

 • ఇదే సమయంలో ప్రపంచ వృద్ధి రేటును 0.2 శాతం మేర ఐఎంఎఫ్ తగ్గించింది.

మహారాష్ట్రలో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం

ప్రపంచ ఆర్థిక ఫోరమ్.. 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం(Fourth Industrial Revolution Centre) వేదికగా భారత్ ను ఎంచుకుంది. మహారాష్ట్రలో ఏర్పాటు కానున్న ఈ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 11న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.

 • డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీలను తొలి మూడు ప్రాజెక్టులుగా అమలు చేస్తారు.

 • వీటిలో ముందుగా ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, బ్లాక్ చెయిన్ పై ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్లు World Economic Forum – WEF ప్రకటించింది.

 • ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూమొదటి రెండు పారిశ్రామిక విప్లవాల సమయంలో భారత్ స్వతంత్ర దేశం కాదని.. మూడో పారిశ్రామిక విప్లవం సందర్భంలో సవాళ్లను ఎదుర్కునే క్రమంలో ఉందని అన్నారు. ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్ సమర్థవంతంగా లీడ్ చేస్తుందని భరోసా వ్యక్తం చేశారు.

 • ప్రస్తుతం దేశంలో 120 కోట్ల మందికి ఆధార్ ఉందని.. 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ త్వరలో పూర్తవుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు.

అవార్డులు

ఏపీ సీఎం చంద్రబాబుకి గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డు లభించింది. ఈ మేరకు డాక్టర్ స్వామినాథన్ కమిటీ అక్టోబర్ 8న ప్రకటించింది. ఢిల్లీలో అక్టోబర్ 24న జరిగే కార్యక్రమంలో కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చంద్రబాబుకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

 • ప్రభుత్వ పరంగా వ్యవసాయ విధానాలు, రైతులకు చేయూత, ప్రోత్సాహకాలు, పంటల అభివృద్ధి, పరిశోధన, సాగునీరు, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటెంగ్ వంటి అంశాల ఆధారంగా ఈ అవార్డుకు చంద్రబాబును స్వామినాథన్ కమిటీ ఎంపిక చేసింది.

జమ్ము పోలీస్ అహ్మద్ కు శౌర్య చక్ర

తీవ్రవాదులతో జరిగిన పోరులో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించి అమరుడైన జమ్ము కశ్మీర్ పోలీస్ కానిస్టేబుల్ మన్జూర్ అహ్మద్ నాయక్ కు కేంద్ర హోంశాఖ శౌర్య చక్రప్రకటించి గౌరవించింది.

 • బారాముల్లా జిల్లా ఊడీ ప్రాంతానికి చెందిన మన్జూర్.. దక్షిణ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో 2017 మే 5న మిలిటెంట్లతో జరిగిన కాల్పుల్లో మరణించారు.

జయరాజుకు సుద్దాల జాతీయ పురస్కారం – 2018

ప్రజా కవి సుద్దాల హనుమంతు జానకమ్మల జాతీయ పురస్కారం – 2018ని ప్రఖ్యాత ప్రజాకవి జయరాజుకు ప్రదానం చేశారు. సుద్దాల అశోక్ తేజ తన తల్లిదండ్రుల పేరిట ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని సాహిత్యం రంగంలో విశేష కృషి చేసిన వారికి ఏటా ప్రదానం చేస్తున్నారు.

ఒడిశా పోలీస్ ప్రమోద్ కుమార్ కు అశోక చక్ర

నక్సల్స్ తో జరిగిన పోరాటంలో అమరుడైన ఒడిశా పోలీస్ అధికారి ప్రమోద్ కుమార్ సత్పతికి కేంద్ర ప్రభుత్వం అశోక చక్ర అవార్డు ప్రకటించింది. Special Operations Group (SOG) అసిస్టెంట్ కమాండెంట్ గా పనిచేసిన ప్రమోద్ కుమార్.. 2008, ఫిబ్రవరి 16న జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించారు. సత్పతి ధైర్య సాహసాలను గుర్తిస్తు ఆయనకు మరణానంతరం అశోకచక్ర ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

సిక్కింకు ఫ్యూచర్ పాలసీ గోల్డ్ అవార్డ్

దేశంలో తొలి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా నిలిచిన సిక్కింఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(FAO) అందించే ప్రతిష్టాత్మక ఫ్యూచర్ పాలసీ గోల్డ్ అవార్డుకు ఎంపికైంది. పూర్తిగా సేంద్రియ వ్యవసాయం విధానం పాటిస్తున్న ప్రపంచంలోని తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందినందుకు గాను సిక్కింకు ఈ అవార్డు ప్రకటించారు.

 • ఈ అవార్డుని ఎఫ్ఏఓ గోల్డ్ ప్రైజ్ గాను పిలుస్తారు.

 • FAO ను 1945 అక్టోబర్ 16న ఏర్పాటు చేశారు. దీని కేంద్ర కార్యాలయం రోమ్ లో ఉంది.

 • ఈ సంస్థలో ప్రస్తుతం 194 సభ్య దేశాలు ఉన్నాయి.

సైన్స్ అండ్ టెక్నాలజీ

గూగల్ ప్లస్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన గూగుల్

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కి చెందిన సోషల్ మీడియా సైట్ గూగుల్ ప్లస్ ను మూసివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. సాఫ్ట్ వేర్ పరమైన సాంకేతిక లోపాలతో వినియోగదారుల వివరాలు ఇతరుల చేతికి చేరే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ఒక బగ్ కారణంగా 5 లక్షల మంది వినియోగదారుల ప్రైవేట్ డేటా బయటి డెవలపర్లకు చేరిందని గుర్తించిన గూగుల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

 • గూగుల్ ప్లస్ ని 2011 జూన్ 28న ప్రారంభించింది.

మహిళల భద్రతకు వొడాఫోన్ ఐడియా సఖి

మహిళల భద్రత కోసం టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ‘వొడాఫోన్ సఖి’ పేరుతో మొబైల్ ఆధారిత సేఫ్టీ సేవలను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ.సింధు అక్టోబర్ 10న వొడాఫోన్ సఖిని ఆవిష్కరించారు.

 • ఈ కార్యక్రమంలో భాగంగాకస్టమర్లు అత్యవసర సమయంలో 1800123100 టోల్‌ ఫ్రీ నంబరు ద్వారా సఖి సేవలు పొందవచ్చు.

 • దీని ద్వారా కస్టమర్ ఉన్న ప్రాంతం (లొకేషన్) వివరాలు ముందుగా నమోదు చేసుకున్న 10 కాంటాక్ట్ నంబర్లకు వెళ్తుంది.

 • మొబైల్‌లో బ్యాలెన్స్ లేనప్పటికీ 10 నిముషాలపాటు కాల్స్ చేసుకోవచ్చు.

 • రిటైల్ ఔట్‌లెట్ వద్ద నంబర్ గోప్యత కోసం 10 అంకెల డమ్మీ నంబరును కస్టమర్‌కు కేటాయిస్తారు.

 • స్మార్ట్‌ఫోన్లతోపాటు ఫీచర్ ఫోన్ లలోనూ ఈ సేవలు పనిచేస్తాయి.

రష్యా సోయజ్ రాకెట్ కు ప్రమాదం.. వ్యోమగాములు క్షేమం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇద్దరు వ్యోమగాములని తీసుకెళ్లేందుకు కజకిస్తాన్ లోని బైకనూర్ కేంద్రం నుంచి రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ ప్రయోగించిన సోయజ్ రాకెట్ విఫలమైంది. ప్రయోగం అనంతరం భూమికి 50 కిలోమీటర్ల ఎత్తులో బూస్టర్లు మండకపోవడంతో.. రాకెట్ విఫలమైంది. దీంతో.. అందులోను మాడ్యూల్.. 8 వేల కిలోమీటర్ల వేగంతో భూమిమీదకు దూసుకొచ్చింది. కజక్ లో అత్యవసర లాండింగ్ అయింది.

 • ఇద్దరు వ్యోమగాములు నిక్ హాక్(అమెరికా), అలెక్సీ ఓవ్ చీ( రష్యా)క్షేమంగా ఉన్నారు.

 • వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపే క్రమంలో రష్యాకు చెందిన 13 రాకెట్లు విఫలమయ్యాయి. అందులో అత్యధికం సోయెజ్ రాకెట్లే.

భారత్ లో రెండు టైమ్ జోన్లపై చర్చ

దేశంలో పరిస్థితులకు అనుగుణంగా రెండు ప్రత్యేక టైమ్ జోన్ ల ఆవశ్యకత ఉందని ఢిల్లీలోని CSIR-National Physcial Laboratory(NPL) శాస్త్రవేత్తలు సూచించారు. ఈ అంశంలో పరిశోధనలు జరిపిన సైంటిస్టులుఈశాన్య భారతంలోని అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, త్రిపురతో పాటు అండమాన్, నికోబార్ ద్వీపాలకు ఓ టైమ్ జోన్, మిగతా దేశమంతటికీ మరో టైమ్ జోన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

 • ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారత ప్రామాణిక కాలమానం(IST) ఉదయం 5.30 గంటలుగా అమలవుతోంది. ఇది 1947 సెప్టెంబర్ 1న ఏర్పడింది.

 • అదే యూకేలోని గ్రీన్ విచ్ మీదుగా ప్రయాణించే ఊహాత్మక రేఖాంశం ఆధారంగా కో ఆర్డినేటెడ్ యూనివర్సిల్ టైం (UCT) అర్ధరాత్రి 0.00 గంటలకు గ్రీన్ విచ్ టైమ్ గా లెక్కిస్తున్నారు.

అధిక టైమ్ జోన్లు ఉన్న దేశాలు

ఫ్రాన్స్ – 12 టైమ్ జోన్లు

అమెరికా – 11 టైమ్ జోన్లు

రష్యా – 11 టైమ్ జోన్లు

బ్రిటన్ – 9 టైమ్ జోన్లు

ఆస్ట్రేలియా – 8 టైమ్ జోన్లు

ప్రపంచంలోనే వేగవంతమైన కెమెరాను కనుగొన్న అమెరికా

వెలుతురు లేదా కాంతిని స్లో మోషన్ లో బంధించగల ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కెమెరాను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ కెమెరా సెకనుకి 10 లక్షల కోట్ల ఫ్రేమ్స్ ను కేప్చర్ చేయగలదని వెల్లడించారు. కాలఫోర్నియా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు ఈ కెమెరాను అభివృద్ధి చేశారు. దీని వేగాన్ని భవిష్యత్తులో సెకనుకు క్వాడ్రిలియన్ ఫ్రేములకు పెంచడానికి అవకాశాలున్నాయి.

నాన్ స్టాప్ విమానంగా రికార్డ్

ఎక్కువ దూరం నాన్ స్టాప్ గా ప్రయాణించిన విమానంగా ఎయిర్ బస్ A 350 -900ULR రికార్డులకు ఎక్కింది. సింగపూర్ నుంచి న్యూయార్క్ వరకు ఏకంగా 16,700 కిలోమీటర్ల దూరం 19 గంటల పాటు ఎక్కడ దిగకుండా నాన్ స్టాప్ గా గాల్లోనే నడించింది. అక్టోబర్ 11న సింగపూర్ లోని చాంగీ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన విమానంఅలస్కా మీదుగా వెళ్లి న్యూయార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోవడంతో రికార్డు సృష్టించింది. ఇందులో 161 మంది ప్రయాణం చేశారు.

క్రీడలు

జపాన్ గ్రాండ్ ప్రీ విజేత హామిల్టన్

జపాన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేసు విజేతగా మెర్సడిసీ జట్టు జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నిలిచాడు. అక్టోబర్ 7న జరిగిన 53 ల్యాప్ ల రేసుని గంటా 27 నిమిషాల 17.062 సెకన్లలో పూర్తి చేసి తొలిస్థానంలో నిలిచాడు. తద్వారా 2018 ఫార్ములా వన్‌ సీజన్ లో హామిల్టన్ 9 విజయాన్ని నమోదు చేశాడు.

 • ఈ రేసులో ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడు, ఒకాన్ తొమ్మిది స్థానాల్లో నిలిచారు.

ఆసియా కప్ అండర్-19 టైటిల్ విజేత భారత్

ఆసియా అండర్ – 19 కప్ ను భారత్ జట్టు కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అక్టోబర్ 7న జరిగిన ఫైనల్లో భారత జట్టు.. 144 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించిటైటిల్ విజేతగా నిలిచింది. తద్వారా భారత్ ఆసియా కప్ అండర్-19 టైటిల్‌ను ఆరోసారి గెలుచుకుంది.

 • ఈ టోర్నిలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సిమ్రన్ సింగ్ వ్యవహరించాడు.

 • మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు ను భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ దక్కించుకున్నాడు.

 • భారత బౌలర్ హర్ష్ త్యాగికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది.

జాతీయ టీటీ యూత్ చాంపియన్ గా ఆకుల శ్రీజ

జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) యూత్ చాంపియన్‌షిప్ బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్‌కి చెందిన ఆకుల శ్రీజ విజేతగా నిలిచింది. మహారాష్ట్రలోని పుణేలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో శ్రీజ…. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రాప్తి సేన్‌పై విజయం సాధించింది.

 • శ్రీజ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తరఫున బరిలోకి దిగింది.

పారా ఆసియా క్రీడాల్లో 9వ స్థానంలో భారత్

ఇండోనేషియాలోని జకార్తా వేదికగా జరిగిన 3వ పారా ఆసియా క్రీడల్లో పతకాల పట్టికలో భారత్ 9వ స్థానంలో నిలిచింది. అక్టోబర్ 13న జరిగిన చివరి రోజు పోటీల్లో రెండు స్వర్ణాలు కైవసం చేసుకొనిమొత్తంగా 72 పతకాల ( 15 స్వర్ణాలు, 24 రజతాలు, 33 కాంస్యాలు)తో పారాక్రీడల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించింది.

 • 319 పతకాలతో(172 స్వర్ణాలు, 88 రజతాలు, 59 కాంస్యాలు) చైనా అగ్రస్థానంలో నిలవగా, 145 పతకాలతో దక్షిణ కొరియా రెండో స్థానంలో, 136 పతకాలతో ఇరాన్ మూడో స్థానంలో నిలిచాయి.

వెస్టిండీస్ తో టెస్ట్ సీరీస్ కైవసం చేసుకున్న భారత్

వెస్టిండీస్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సీరీస్ ను భారత్ 2 – 0 తేడాతో గెలుచుకుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన రెండో టెస్టులో మూడో రోజే భారత్ 10 వికెట్లతో భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా సీరీస్ ని సొంతం చేసుకుంది. 2013లోను ఇదే తరహాలో భారత్ వెస్టిండీస్ పై విజయం సాధించింది.

 • సొంతగడ్డపై భారత్ కు 2013 నుంచి వరుసగా పదో సీరీస్ విజయం. దీంతో ఆస్ట్రేలియా పేరిట(రెండు సార్లు) ఉన్న సొంత గడ్డపై వరుసుగా అత్యధిక సీరీస్ ల విజయాన్ని భారత సమం చేసింది.

పేస్ జంటకు సాంటో డొమింగో ఓపెన్ టైటిల్

ఢిల్లీలో జరిగిన సాంటో డొమింగో ఓపెన్ టెన్నిస్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, మెక్సికోకు చెందిన వరేలా జంట విజయం సాధించింది. అక్టోబర్ 14న జరిగిన ఫైనల్లో బెహర్ (ఉరుగ్వే) – రొబెర్టో(ఈక్వెడార్) ద్వయంపై గెలిచి టైటిల్ సాధించింది.

యూత్ ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు తొలి పసిడి

యూత్ ఒలింపిక్స్ లో మిజోరాంకు చెందిన వెయిట్ లిఫ్టర్ పదిహేనేళ్ల జెరెమీ లాల్రిన్ నుంగా భారత్ కు తొలి బంగారు పతకాన్ని అందించాడు. 62 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పసిడి సొంతం చేసుకున్నాడు.

 • 2010లో యూత్ ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కాగా ఆ ఏడాది భారత్ 6 రజతాలు, 2 కాంస్యాలు సాధించింది.

 • 2014 చైనాలో జరిగిన పోటీల్లో భారత్ కేవలం 2 పతకాలతో తిరిగివచ్చింది.

 • అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో జరిగిన 2018 పోటీలు అక్టోబర్ 7న ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 18 వరకు కొనసాగుతాయి.

 • ఈ టోర్నీలో ప్రారంభోత్సవంలో భారత యువ షూటర్ మనూ భాకర్ జాతీయ పతాకాన్ని చేతబూని ఫ్లాగ్ బేరర్ గా భారత బృందానికి మార్గదర్శనం చేశారు.

వార్తల్లో వ్యక్తులు

నాగాలాండ్ గాంధీ కన్నమూత

నాగాలాండ్ గాంధీగా పేరు గాంచిన సామాజిక కార్యకర్త నట్వర్ ఠక్కర్(86) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా అసోంలోని గువాహటిలో ఆయన అక్టోబర్ 7న తుదిశ్వాస విడిచారు.

 • నట్వర్ ఠక్కర్ 1932లో మహారాష్ట్రలో జన్మించారు.

 • 23 ఏళ్ల వయసులో నాగాలాండ్‌కు వచ్చి అక్కడే సమాజ సేవ కార్యక్రమాలు చేపట్టారు.

 • చుచుయిమ్‌లాంగ్ అనే గ్రామంలో ‘నాగాలాండ్ గాంధీ ఆశ్రమాన్ని స్థాపించారు. మహాత్మాగాంధీ బోధనలు, భావాల వ్యాప్తికి విశేష కృషి చేశారు.

 • ఠక్కర్ చేసిన సేవలను గుర్తింపుగా ప్రభుత్వం 1994లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారాన్ని, 1999లో పద్మశ్రీ అవార్డ్‌ను ప్రకటించింది.

ఐరాసలో యూఎస్ రాయబారి నిక్కీహేలీ రాజీనామా

ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ తన పదవికి రాజీనామా చేశారు. 2018 చివరి నాటికి బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె అక్టోబర్ 9న ప్రకటించారు. రాజీనామాకు గల కారణాన్ని మాత్రం తెలియజేయలేదు. అయితే.. 2020లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరపున ప్రచారం చేస్తానని నీక్కీ హేలీ తెలిపారు.

 • నిక్కీ హేలీ ఐరాస అమెరికా రాయబారిగా 2017 జనవరిలో నియమితులయ్యారు.

 • కేవలం 19 నెలల పాటు ఆమె ఈ పదవిలో ఉన్నారు.

 • నిక్కీ హేలీ అంతకముందు సౌత్ కరోలినా గవర్నర్ గా ఉన్నారు.

పాకిస్తాన్ ఐఎస్ఐ అధిపతిగా అసిమ్ మునీర్

పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ నియమితులయ్యారు. ఈ మేరకు పాకిస్తాన్ ఆర్మీ అక్టోబర్ 10న ప్రకటించింది.

 • ప్రస్తుత చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముఖ్తార్ అక్టోబర్ 1న రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో అసిమ్ కొత్త చీఫ్ గా నియమితులయ్యారు.

 • అసిమ్ మునీర్ 2016 నుంచి ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ (DG)గా ఉన్నారు.

ఉత్తరాఖండ్ సీజేగా జస్టిస్ రమేశ్ రంగనాథన్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్.. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ మదన్ బి. లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ లతో కూడిన కొలీజియంఈ మేరకు సిఫారసు చేసింది.

 • జస్టిస్ రమేశ్ రంగనాథన్.. 2016 జూలై 30 నుంచి 2017 జూన్ 30 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.

 • జస్టిస్ రమేశ్ రంగనాథన్ బెంగళూరు యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1985లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు.

 • 1996 నుంచి 2000 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు.

 • 2000-2004 వరకు ఏపీ అదనపు అడ్వొకేట్ జనరల్ గా వ్యవహరించారు.

గంగా ఉద్యమగారుడు అగర్వాల్ కన్నుమూత

గంగా నదిని ప్రక్షాళన చేసి.. కాలుష్య రహితంగా మార్చాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు దిగిన ప్రముఖ పర్యావరణ వేత్త, ఐఐటీ కాన్పూర్ మాజీ ప్రొఫెసర్, స్వామి జ్ఞానస్వరూప్ సనంద కన్నుమూశారు. జూన్ 22న నిరశన దీక్ష ప్రారంభించిన ఆయన అక్టోబర్ 11న తుదిశ్వాస విడిచారు. ఆయన 111 రోజులుగా కేవలం తేనె కలిపిన నీటినే ఆహారంగా తీసుకుంటున్నారు.

 • దీక్ష ప్రారంభించిన 19 రోజుల తర్వాత అగర్వాల్ ను పోలీసులు బలవంతంగా దీక్షాస్థలి నుంచి తరలించారు. నాటి నుంచి ఆయన రహస్య ప్రాంతంలో దీక్ష కొనసాగించారు.

 • గంగా నదిని శుభ్రం చేయాలని, ఉత్తరాఖండ్ లోని గంగోత్రి, ఉత్తర కాశీల మధ్య గంగా నది ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలన్న డిమాండ్ తో అగర్వాల్ దీక్షకు దిగారు.

 • అగర్వాల్ ఐఐటీ కాన్పూర్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిలో సభ్య కార్యదర్శిగా వ్యవహరించారు. యూపీఏ హయాంలో నేషనల్ రివర్ గంగా బేసిన్ అథారిటీ సభ్యుడిగా ఉన్నారు.

 • అగర్వాల్ 2009లోను భాగీరథి నదిపై జలాశయం నిర్మాణానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం దిగివచ్చి డ్యాం నిర్మాణాన్ని నిలిపివేసింది.

 • జీడీ అగర్వాల్.. 1932 జూలై 20న ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ కాండ్లాలో జన్మించారు. రూర్కీ ఐఐటీలో చదివారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోనూ విద్యాభ్యాసం చేశారు.

హిందుస్తానీ సంగీత దిగ్గజం అన్నపూర్ణ కన్నుమూత

హిందుస్తానీ సంగీతంలో ప్రముఖ కళాకారిణి అన్నపూర్ణ(92) అక్టోబర్ 13న ముంబైలో కన్నుమూశారు. ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ ను అన్నపూర్ణ 1941లో వివహామాడారు. 1962లో విడాకులు తీసుకున్నారు. అనంతరం శిష్యులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. హిందుస్తాన్ సంగీతంలో ప్రముఖ కళాకారుడు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ అన్నపూర్ణ సోదరుడు.

 • 1927లో మధ్యప్రదేశ్ లోని మైసూర్ పట్టణంలో ఉస్తాద్ బాబా అల్లాఉద్దీన్ ఖాన్, మదీనా బేగం దంపతులకు ఆమె జన్మించారు. బాల్యంలో ఆమె పేరు రోషనారాఖాన్. అప్పటి మైసూర్ మహరాజు బ్రిజ్ నాథ్ సింగ్ ఆమెను అన్నపూర్ణ అని సంబోధించడంతో ఆ పేరే స్థిరపడిపోయింది.

 • హిందూస్తానీ సంగీతానికి విశిష్ట సేవలు అందించిన అన్నపూర్ణదేవిని భారత్ ప్రభుత్వం 1977లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

CSIR డైరెక్టర్ జనరల్ గా శేఖర్ మండె

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్ – CSIR డైరెక్టర్ జనరల్ గా డాక్టర్ శేఖర్ మండె నియమితులయ్యారు. కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఈ మేరకు అక్టోబర్ 14న వెల్లడించింది. డిపార్టమెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ రీసర్చ్ – DSIR కార్యదర్శిగాను ఆయన నియమితులయ్యారు.

 • 2018 ఆగస్టులో పదవి విరమణ పొందిన గిరీశ్ సాహ్ని స్థానంలో సీఎస్ఐఆర్ కొత్త డీజీగా డాక్టర్ శేఖర్ మండె బాధ్యతలు చేపడతారు.

 • కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్ కేంద్రాన్ని 1942లో స్థాపించారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది.

 • భారత ప్రధాన మంత్రి సీఎస్ఐఆర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు.

2019-2028 నెల్సన్ మండేలా దశాబ్దం

నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా వందో జయంతిని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి 2019-2028 సంవత్సరాలను నెల్సన్ మండేలా శాంతి దశాబ్దంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

 • నెల్సన్ మండేలా 1918 జూలై 18న జన్మించారు.

 • 1994 మే 10 నుంచి 1999 జూన్ 16 వరకు దక్షిణాఫ్రికా తొలి అధ్యక్షుడిగా పనిచేశారు.

 • యాంటీ ఆపార్తెడ్ ఉద్యమంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

 • 1993లో నోబెల్ శాంతి బహుమతి పొందారు.

ఇంటర్ పోల్ అధిపతి మెంగ్ హాంగ్ వెయ్ రాజీనామా

ఇంటర్ పోల్ అధిపతి మెంగ్ హాంగ్ వెయ్ నుంచి రాజీనామా అందిందని, తక్షణమే అమల్లోకి వచ్చిందని ఇంటర్ పోల్ ప్రకటించింది. అనుమానాస్పద పరిస్థితుల్లో అదృశ్యమైన మెంగ్ ను అవినీతి ఆరోపణలపై విచారిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఆయన ఇదివరకు చైనాలో ప్రజా భద్రతా విభాగం ఉపమంత్రిగా ఉన్నారు. లంచాలు, ఇతర నేరాలకు పాల్పడినట్లు చైనా ప్రభుత్వం పేర్కొంది.

 • ఇంటర్ పోల్ అనేది అంతర్జాతీయ పోలీస్ సహకార సంస్థ. అంతర్జాతీయ స్థాయి కేసులకు సంబంధించి దేశాల పోలీసు వ్యవస్థల మధ్య సహకారం కోసం ఈ వ్యవస్థ పనిచేస్తుంది.

 • ఇంటర్ పోల్ లో ప్రస్తుతం 192 సభ్య దేశాలు ఉన్నాయి.

 • ఇంటర్ పోల్ ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ లోని లయోన్.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments