Weekly Current Affairs – October 24 – 31, 2018

జాతీయం

న్యూఢిల్లీలో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్

ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2018 (ఐఎంసీ) న్యూఢిల్లీలో అక్టోబర్ 25న ప్రారంభమైంది. ఐఎంసీ ప్రారంభ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, వొడాఫోన్ ఐడియా చైర్మన్ కూమార్ మంగళం బిర్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముకేశ్ మాట్లాడుతూబ్రాడ్‌బ్యాండ్ వినియోగంలో ప్రస్తుతం 135వ స్థానంలో ఉన్న భారత్ త్వరలో టాప్ 3 దేశాల్లో ఒకటిగా ఎదగగలదని చెప్పారు.

త్వరలో అతిపొడవైన రైలురోడ్డు వంతెన ప్రారంభం
దేశంలోనే అత్యంత పొడవైన రైలు
రోడ్డు వంతెనను త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ అక్టోబర్ 25న తెలియజేశారు. ‘బోగీబీల్ బ్రిడ్‌‌జ’ గా పిలిచే ఈ వంతెనను అరుణాచల్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల మధ్య బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్నారు. 4.94 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన అసోంలోని దిబ్రుగఢ్‌ను అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాసిఘాట్‌ను కలుపుతుంది. వంతెన కింది డెక్‌లో రెండు రైల్వే ట్రాక్‌లు, పైన డెక్‌లో మూడు వరుసల రోడ్డును నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చివరి దశలో ఉండగా త్వరలో మోదీ దీనిని ప్రారంభించనున్నారు. 2002లో నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు.

పరిశోధనల ప్రోత్సాహానికి రెండు పథకాలు
దేశంలో మానవ వనరులు
, శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు కొత్తగా రెండు పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ‘సామాజిక శాస్త్రాల్లో ప్రభావవంత విధానాల పరిశోధన’ (ఇంప్రెస్), ‘విద్యా సంబంధిత, పరిశోధనల్లో తోడ్పాటుకు పథకం’ (స్పార్క్) పేరుతో ఈ పథకాలను ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఈ రెండు వెబ్‌సైట్లను కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అక్టోబర్ 25న ఆవిష్కరించారు. ఇంప్రెస్ పథకానికి కేంద్రం ఏటా రూ. 414 కోట్లు కేటాయిస్తుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూమానవ వనరుల రంగంలోనూ పరిశోధనలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాలను తీసుకువచ్చినట్లు చెప్పారు.

పాకిస్థాన్‌లో భారతీయ సినిమాలపై నిషేధం
పాకిస్థాన్ టీవీ చానళ్లలో భారతీయ సినిమాలు
, టీవీ కార్యక్రమాల ప్రసారంపై గతంలో ఉన్న నిషేధాన్ని అక్టోబర్ 27న ఆ దేశ సుప్రీంకోర్టు పునరుద్ధరించింది.

పాకిస్థాన్ అధికారులు ఆమోదించిన చిత్రాలు, కార్యక్రమాలనే ప్రసారం చేయాలని ఆదేశించింది. యునెటైడ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(యూపీఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ప్రధాన జడ్జి జస్టిస్ సకీజ్ నిసార్ ఈ మేరకు తీర్పునిచ్చారు.

బయో మెట్రిక్ విధానంలో ఈవీసా
పర్యాటకులకు బయో మెట్రిక్ విధానంలో ఈ
వీసా మంజూరు చేయనున్నట్లు భారత విదేశాంగశాఖ అక్టోబర్ 28న ప్రకటించింది. ప్రపంచంలోని మరో 8 నగరాల నుంచి పర్యాటకులు ఇకపై సులభంగా భారత్‌ను సందర్శించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగశాఖ పేర్కొంది. 8 నగరాల్లో ఒట్టావా (కెనడా), సెయింట్ పీటర్స్‌బర్గ్, వ్లాడివోస్తక్ (రష్యా), మ్యూనిచ్ (జర్మనీ), బ్రస్సెల్స్ (బెల్జియం), ఓస్లో (నార్వే), బుడాపెస్ట్ (హంగేరి), జగ్రీబ్ (క్రొయేషియా) ఉన్నాయి. ఆయా నగరాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాల్లో బయో మెట్రిక్ వివరాలు ఇస్తే ఈవీసా ఇస్తారు. భారత్‌కు వచ్చాక మళ్లీ ఈవీసాకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

పెట్టుబడుల విషయంలో భారత్‌కు అగ్రస్థానం
ఆసియాలో పెట్టుబడుల విషయంలో అధిక చైతన్యం కలిగిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది
. ఈ మేరకు ‘ఎమర్జింగ్ అఫ్లూయంట్ స్డడీ 2018’ని స్టాండర్డ్ చార్టర్డ్ సంస్థ అక్టోబర్ 29న విడుదల చేసింది. ఈ సంస్థ ఆసియా, ఆఫ్రికా, మిడిల్‌ఈస్ట్ ప్రాంతాల్లో చార్టర్డ్ సంస్థ అధ్యయనం చేసి అప్లూయంట్ స్టడీని రూపొందించింది. ఈ స్టడీ ప్రకారం భారత్ లో సంపన్న వినియోగ వర్గాల్లో మూడింట రెండొంతుల (68 శాతం) మంది ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలను అనుసరిస్తున్నారు. 44 శాతం మంది కెరీర్‌లో పురోగతి, వేతనంలో వృద్ధిని కోరుకుంటున్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ
స్టాట్యూ ఆఫ్ యూనిటీ’
(ఐక్యతా విగ్రహం)పేరుతో నిర్మించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంను పటేల్ 143వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 31న ఆవిష్కరించారు. 182 మీటర్ల ఎత్తయిన ఈ విగ్రహం ప్రపంచంలో ఎత్తై విగ్రహంగా గుర్తింపు పొందింది. గుజరాత్‌లోని నర్మదా జిల్లా కేవడియాలో నర్మదా నది రూ.2,989 కోట్లతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. 2010లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఈ విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

పటేల్ విగ్రహ నిర్మాణంలో టర్నర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రధాన నిర్మాణదారుగా వ్యవహరించగా దానికి మెయిన్‌హార్డ్, మైఖేల్ గ్రేవ్‌‌స, ఎల్‌అండ్‌టీ సంస్థలు సహకరించాయి. విగ్రహం స్టక్చ్రర్ డిజైన్, ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్, కాంక్రీట్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఎల్‌అండ్‌టీ చేపట్టింది. త్రీ డెమైన్షనల్ స్కానింగ్ టెక్నిక్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ ప్రొడక్షన్ టెక్నిక్‌లను ఉపయోగించి కేవలం 33 నెలల్లోనే విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేశారు.

5 జోన్లుగా విగ్రహం
పటేల్ ఐక్యతా విగ్రహాన్ని
5 జోన్లుగా విభజించారు. మొదటి జోన్‌లో మెమోరియల్ గార్డెన్, మ్యూజియం, రెండో జోన్‌లో 149 మీ. విగ్రహ మే ఉంటుంది. మూడో జోన్‌లో 157 మీ. వరకు గ్యాలరీ, నాలుగో జోన్‌లో మెయింట నెన్స్ ఏరియా, ఐదో జోన్‌లో పటేల్ భుజాలు, తల ఉంటుంది. మూడో జోన్ వరకు సందర్శకులను అనుమతిస్తారు. గ్యాలరీలో ఒకేసారి 200 మంది తిరగవచ్చు. ఈ విగ్రహాన్ని రోడ్డు మార్గంలో నుంచి చూస్తే 182 మీటర్లు, నదీ మార్గం నుంచి చూస్తే 208.5 మీటర్ల ఎత్తు ఉంటుంది.
పర్యాటకం
ఐక్యతా విగ్రహం ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దారు
. పర్యాటకుల విడిది, విశ్రాంతి, ఆహారం కోసం శ్రేష్ఠ భారత్ భవన్, పటేల్ జీవిత విశేషాలతో మ్యూజియం, పరిశోధనా కేంద్రం కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటుచేస్తున్నారు. విగ్రహం నుంచి చూస్తే సర్దార్ సరోవర్ డ్యాం పరిసర ప్రాంతాలు కనువిందు చేస్తాయి. సర్దార్ సరోవర్ డ్యాం ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలోనే అత్యధిక కాంక్రీట్ వాడిన రెండో డ్యాంగా ప్రసిద్ధి చెందింది. అలాగేత 1210 మీటర్ల పొడవైన కాంక్రీట్ గ్రావిటీ డ్యాంగా గుర్తింపు పొందింది.
మరోవైపు విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో సామాజిక
, ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల మెరుగైన రవాణా సౌకర్యం, ఉపాధి, ఆరోగ్య సేవలు, విద్య, మౌలిక వసతులు ఆ ప్రాంత గిరిజనులకు సమకూరుతాయనేది ప్రభుత్వ భావన.

అంతర్జాతీయం

అమెరికాలో భారతీయ విద్యార్థులకు రెండోస్థానం

అమెరికాలో చదువుకుంటున్న విదేశీయుల్లో భారతీయ విద్యార్థులకు రెండోస్థానం లభించింది. ఈ మేరకు స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ నివేదికను అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్ విభాగం అక్టోబర్ 26న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2017లో అమెరికాలో 2,49,763 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ జాబితాలో 4,81,106 మంది విద్యార్థులతో చైనా తొలిస్థానంలో నిలవగా, దక్షిణకొరియా(95,701), సౌదీ అరేబియా(72,358), జపాన్(41,862) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
మరోవైపు 24 నెలల గడువుండే సైన్స్టెక్నాలజీఇంజనీరింగ్గణితం(స్టెమ్) ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ)లో భారతీయ విద్యార్థులు అగ్రస్థానంలో ఉన్నారు. అమెరికాలో స్టెమ్ డిగ్రీ విద్యార్థులకు అదనంగా ఉండే ఈ కోర్సులో 2017లో 89,839 మంది విదేశీ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో భారతీయులు(53,507 మంది) తొలిస్థానంలో ఉండగా, చైనీయులు(21,705), దక్షిణకొరియా (1,670), తైవాన్(1,360), ఇరాన్(1,161) విద్యార్థులు తర్వాతి స్థానాల్లో నిలిచారు.

శ్రీలంక పార్లమెంటు రద్దు
శ్రీలంక పార్లమెంటును తాత్కాలికంగా రద్దు చేస్తూ ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అక్టోబర్ 27న ఉత్తర్వులు జారీ చేశారు. బలనిరూపణ కోసం అత్యవసరంగా పార్లమెంటును సమావేశపరచాలని శ్రీలంక పార్లమెంటు స్పీకర్ సిరిసేనకు లేఖ రాయగా అందుకు అవకాశం లేకుండా సిరిసేన నవంబరు 16 వరకు పార్లమెంటును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సిరియా కన్నా 3 రెట్లు ప్రమాదకరంగా పాకిస్థాన్ : జీటీటీఐ
సిరియా కన్నా 3 రెట్లు ప్రమాదకరంగా పాకిస్థాన్ మారుతోందని ‘‘హ్యూమానిటీ ఎట్ రిస్క్ గ్లోబల్ టై్ థ్రెట్ ఇండికెంట్’’(జీటీటీఐ) నివేదిక పేర్కొంది. ఎక్కువ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తూ, సహాయపడుతున్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్‌తో మానవాళికి ముప్పు ఉందని ఈ నివేదిక వెల్లడించింది. మొత్తం 200 ఉగ్రసంస్థలపై అధ్యయనం చేసి రూపొందించిన జీటీటీఐ రిపోర్టును ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ట్రాటజిక్ ఫోర్‌సైట్ గ్రూప్‌లు సంయుక్తంగా అక్టోబర్ 27న విడుదల చేశాయి.

కాలుష్యం కారణంగా 6 లక్షల మంది మృత్యువాత
వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 6 లక్షల మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అక్టోబర్ 29న ఒక నివేదికను విడుదల చేసింది. ‘ఆరోగ్యంవాయు కాలుష్యం ప్రభావం’పై త్వరలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో ఈ నివేదికను రూపొందించారు.

ఈ నివేదిక ప్రకారం నిత్యం 15 ఏళ్లలోపు పిల్లలలో 93 శాతం మంది అంటే 180 కోట్ల మంది కలుషిత గాలిని పీలుస్తున్నారు. వీరిలో 63 కోట్ల మంది ఐదేళ్లలోపు బాలలు ఉన్నారు. 2016లో దాదాపు 6 లక్షల మంది శ్వాసకోశ వ్యాధులకు గురై చనిపోయారు. ప్రతి పది మందిలో 9 మంది కలుషిత గాలినే పీలుస్తున్నారు. దీని కారణంగా ఏటా 70 లక్షల గర్భస్థ శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఐదేళ్లలోపు చనిపోయే ప్రతి పది మంది శిశువుల్లో ఒకరు వాయు కాలుష్యం కారణంగానే చనిపోతున్నారు. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌గా టీఏ ఘెబ్రెయ్‌సస్ ఉన్నారు.

ద్వైపాక్షికం

జపాన్ పర్యటనలో ప్రధాని మోదీ

భారత్జపాన్ 13వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 27న జపాన్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని షింజో అబేతో బేటీ అయిన మోదీ అనధికారిక చర్చలు జరిపారు. రోబోల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఎఫ్‌ఏఎన్‌యూసీ పరిశ్రమను ఇరు దేశాధినేతలు సందర్శించారు. జపాన్‌లోని అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ ఫుజి ఆవరించి ఉన్న తన విడిది గృహంలో అబే ప్రధాని మోదీకి అక్టోబర్ 28న విందు ఇచ్చారు. ఈ గౌరవం పొందిన తొలి విదేశీ నేత మోదీనే.

జపాన్ ప్రధానితో మోదీ భేటీ
భారత్
జపాన్ 13వ ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా జపాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని షింజో అబేతో మరోసారి భేటీ అయ్యారు. జపాన్ రాజధాని టోక్యోలో అక్టోబర్ 29న జరిగిన ఈ భేటీలో ఆర్థిక, రక్షణ, ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదం, జపాన్ ఆర్థిక సాయంతో నిర్మిస్తున్న ముంబైఅహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు సహా పలు అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు. అలాగే వివిధ రంగాలకు సంబంధించిన ఆరు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. భారత్, జపాన్‌ల విదేశాంగ, రక్షణ మంత్రులతో కూడిన 2+2 చర్చలు జరపాలని మోదీ, అబే నిర్ణయించారు. అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత సభ్యత్వానికి జపాన్ మద్దతు తెలిపింది.

ఇటలీ ప్రధాని కాంటేతో మోదీ సమావేశం
ఒక్క రోజు భారత పర్యటనకు వచ్చిన ఇటలీ ప్రధాని గిసెప్ కాంటేతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్
30న సమావేశం అయ్యారు. సమావేశంలో భాగంగా ప్రాంతీయ, జాతీయ అంతర్జాతీయ అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు. రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత విసృ్తతం చేసుకోవాలని మోదీకాంటే నిర్ణయించారు.

మరోవైపు న్యూఢిల్లీలో అక్టోబర్ 30న జరిగిన కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ (డీఎస్టీ)-సీఐఐ ఇండియాఇటలీ టెక్నాలజీ సమిట్‌లో ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని గిసెప్ కాంటే పాల్గొన్నారు. సామాజిక న్యాయం, సాధికారత, పారదర్శకత, సమ్మిళితం సాధించేందుకు భారత్ సాంకేతికతను మాధ్యమంగా ఉపయోగించుకుంటోందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు.

ప్రాంతీయం

హైదరాబాద్‌లో పాండ్రాల్ ప్లాంటు

రెల్వేలకు అవసరమైన విడిభాగాల తయారీలో ఉన్న అంతర్జాతీయ సంస్థ పాండ్రాల్రాహీ టెక్నాలజీస్‌తో కలిసి హైదరాబాద్‌లో అక్టోబర్ 29న ప్లాంటును ప్రారంభించింది. ఏటా 40 లక్షల క్లిప్స్‌ను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉన్న ఈ ప్లాంటు ద్వారా ప్రధానంగా భారత మార్కెట్‌కు విడిభాగాలను సరఫరా చేస్తారు. ఇక్కడి ఫెసిలిటీలో తయారయ్యే క్లిప్స్‌ను మారిషస్‌లో ఎల్‌అండ్‌టీ నిర్మిస్తున్న రైల్వే ప్రాజెక్టుకు వినియోగించనున్నట్టు పాండ్రాల్రాహీ టెక్నాలజీస్ ఎండీ ప్రదీప్ ఖైతాన్ తెలిపారు. భారత మెట్రో రైల్ ప్రాజెక్టులతోపాటు బంగ్లాదేశ్, ఘనాలో ట్రాక్‌ల పునరుద్ధరణలోనూ వీటిని వాడతారని తెలియజేశారు.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది
. ఓటరు నమోదు, ఓటుహక్కు వినియోగంలో అవగాహన కల్పించే ‘స్వీప్’ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద అక్టోబర్ 30న నిర్వహించిన రంగోలీ కార్యక్రమంతో ఈ రికార్డు దక్కింది. సూమారు 2,500 విద్యార్థులు, 2 వేల మంది ఉద్యోగుల భాగస్వామ్యంతో 4,66,279 అడుగుల విస్తీర్ణంలో భారీ స్థాయి ఇండియా మ్యాప్‌ను 30 నిమిషాల్లో రూపొందించారు.

ఏపీలో వాహనాలకు ఒకే కోడ్ తో రిజిస్ట్రేషన్ నంబర్లు
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని కేటగిరీల వాహనాలకు జిల్లాల వారీగా కాకుండా రాష్ట్ర స్థాయిలో ఒకే కోడ్‌తో రిజిస్ట్రేషన్ నంబర్లను కేటాయించనున్నారు
. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అక్టోబర్ 31న తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇప్పటిదాకా వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో ఒక్కో జిల్లాకు ఒక్కో కోడ్ తో నంబర్ జారీ చేస్తుండగా ఇకపై జిల్లాల వారీగా కాకుండా రాష్ట్రాన్ని యూనిట్ తీసుకుని ఒకే కోడ్‌తో నంబర్లు కేటాయించనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏపీ 38 కోడ్ వరకు నంబర్లు కేటాయించగా మరో 15 రోజుల్లో ఏపీ 39 కోడ్‌తో కొత్త నంబర్లు కేటాయించనున్నారు. దీంతో ఒకే రాష్ట్రం.. ఒకే కోడ్‌ను అమలుచేయనున్న మొదటి రాష్ట్రంగా ఏపీ నిలవనుంది.

ఆర్థికం

30 సార్లు సమావేశమైన జీఎస్టీ మండలి

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని వస్తుసేవల పన్ను(జీఎస్టీ) మండలి గత రెండేళ్లలో 30 సార్లు సమావేశమైందని కేంద్ర ఆర్థిక శాఖ అక్టోబర్ 28న తెలిపింది. ఈ కాలంలో జీఎస్టీకి సంబంధించి మొత్తం 918 నిర్ణయాలను జీఎస్టీ మండలి తీసుకుంది. ఇందులో జీఎస్టీ విధి విధానాలు, రేట్లు, పరిహారం వంటి నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పటికే సుమారు 96 శాతం నిర్ణయాలను అమలు చేయగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.

ఒకే దేశంఒకే పన్ను నినాదంతో 2000లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ జీఎస్టీకి శ్రీకారం చుట్టగా 2017 జూలై 1న అమల్లోకి వచ్చింది.

సులభతర వాణిజ్యంలో భారత్‌కు 77వ ర్యాంకు
సులభతర వాణిజ్యం
(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ర్యాంకుల్లో భారత్‌కు 77వ ర్యాంకు లభించింది. ఈ మేరకు ‘డూయింగ్ బిజినెస్-2019’ నివేదిక ను ప్రపంచబ్యాంకు అక్టోబర్ 31న విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లోని పరిస్థితులను పది పరామితుల ఆధారంగా అంచనా వేసి ప్రపంచబ్యాంకు ఈ ర్యాంకులను ప్రకటించింది. 2014లో 142వ స్థానంలో ఉన్న భారత్.. గత ఏడాది 100కి, ఈ ఏడాది 77కి చేరింది. దీంతో వరుసగా రెండేళ్లు అత్యధిక ర్యాంకులు అధిగమించిన దేశంగా భారత్ గుర్తింపు పొందింది. బ్రిక్స్, దక్షిణాసియా దేశాల్లో అత్యుత్తమ పురోగతి సాధించిన తొలి దేశంగా నిలిచింది. ర్యాంకుల పరంగా 2014లో దక్షిణాసియా దేశాల్లో ఆరో స్థానంలో ఉన్న భారత్ ఈసారి ఒకటో స్థానానికి చేరింది.

డూయింగ్ బిజినెస్-2019 ర్యాంకుల్లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో నిలవగా సింగపూర్, డెన్మార్క్, హాంకాంగ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికా 8వ స్థానంలో చైనా 46వ స్థానంలో, పాకిస్థాన్ 136వ స్థానాల్లో నిలిచాయి.

సైన్స్ అండ్ టెక్నాలజీ

ఎగిరే రోబోను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు

అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఎగిరే రోబోను అభివృద్ధి చేశారు. ఫ్లైక్రో టగ్‌‌సగా పిలిచే ఈ రోబో రిమోట్‌తో ఆదేశిస్తే సహాయకుడిలా అన్ని పనులు చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆహారం తేవడం, కెమెరాతో వీడియో తీయడం వంటి ఎన్నో చిన్న చిన్న పనులు చేసేలా ఈ రోబోను రూపొందించారు. ఈ రోబోను దాని బరువు కంటే 40 రెట్లు ఎక్కువ బరువును మోసేలా అభివృద్ధి పరిచారు. భవిష్యత్తులో ఈ రోబోల్లో స్వీయనియంత్రణ వ్యవస్థను ప్రవేశపెట్టేలా పరిశోధనలు చేస్తున్నామని వర్సిటీ శాస్త్రవేత్త మార్క్ కట్కోస్కై తెలిపారు.

శక్తి’ మైక్రోప్రాసెసర్ ఆవిష్కరణ
దేశంలో తొలిసారిగా తయారుచేసిన ‘శక్తి’ మైక్రోప్రాసెసర్‌ను మద్రాసు ఐఐటీ అక్టోబర్
26న ఆవిష్కరించింది. చండీగఢ్‌లోని ఇస్రో సెమీకండక్టర్ ల్యాబ్‌లో శక్తి ని తయారు చేశారు. రక్షణ, అణు శక్తి రంగాలతో పాటు ప్రభుత్వ సంస్థలకు ఈ మైక్రోప్రాసెసర్ ఉపయోగపడుతుంది.

తొలి ఇంజన్ రహిత రైలు ప్రారంభం
దేశ తొలి ఇంజన్ రహిత సెమీ హైస్పీడ్ రైలు ‘ట్రైన్
18’ ప్రారంభమైంది. చెన్నైలో అక్టోబర్ 29న రైల్వే బోర్డు చైర్మన్ అశ్వని లోహని ఈ రైలును ప్రారంభించారు. అనంతరం రైలు ఢిల్లీకి బయలుదేరింది. చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) లో తయారుచేసిన ఈ అత్యాధునిక రైలులో పూర్తిగా ఏసీ సదుపాయం ఉంది. 18 నెలల్లో తయారుచేసిన ఈ రైలు కోసం రూ. వంద కోట్లు వెచ్చించారు. గత 30 ఏళ్లుగా నడుపుతున్న శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు బదులుగా ‘ట్రైన్ 18’ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. 2019-20 చివరి నాటికి మరో ఐదు రైళ్లు తయారుచేయనున్నట్లు వెల్లడించింది.

సూర్యుడికి అత్యంత చేరువలో ‘పార్కర్’
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ‘పార్కర్’ అంతరిక్ష నౌక సూర్యుడికి అతి సమీపంలోకి వెళ్లింది
. దీంతో ఇప్పటివరకు మానవుడు తయారు చేసిన వస్తువుల్లో సూర్యుడి అతి సమీపానికి వెళ్లిన దానిగా పార్కర్ రికార్డు సృష్టించింది. అక్టోబర్ 29 నాటికి సూర్యుడి ఉపరితలానికి ఈ పార్కర్ 4.2 కోట్ల మైళ్ల దూరంలో ఉన్నట్లు పార్కర్ సోలార్ ప్రోబ్ బృందం లెక్కించింది.

అచేతనంగా కెప్లర్ స్పేస్ టెలిస్కోప్
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన కెప్లర్ స్పేస్ టెలిస్కోప్
(కె2) అచేతనంగా మారింది. విశ్వంలో మరిన్ని పరిశీలనలు సాగించేందుకు అవసరమైన ఇంధనం కెప్లర్‌లో లేదని అక్టోబర్ 31న నాసా వెల్లడించింది. 2009 మార్చి 6న ప్రయోగించిన ఈ టెలిస్కోప్ ఇప్పటివరకు సుమారు 2,600కి పైగా కొత్త గ్రహాలను గుర్తించింది. కెప్లర్ మిషన్ వ్యవస్థాపకులు విలియం బ్రూకీ మాట్లాడుతూ ‘35 ఏళ్ల కింద సౌర వ్యవస్థకు అవతల ఉన్న ఒక్క గ్రహం ఉనికి కూడా మాకు తెలియదు. కానీ కెప్లర్ తెలిపిన వివరాల ద్వారా భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేయడానికి పునాది పడింద’ని పేర్కొన్నారు.

అవార్డులు

ఏపి ట్రాన్స్ కోకు గోల్డెన్ పీకాక్ అవార్డు

ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ కో కు గోల్డెన్ పీకాక్ అవార్డు-2018 లభించింది. ఈ మేరకు కార్పొరేట్ గవర్నెన్స్, సుస్థిరతపై లండన్‌లో నిర్వహించిన 18వ అంతర్జాతీయ సదస్సులో అక్టోబర్ 25న ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆర్ధిక నిర్వహణ, సరఫరా, పంపిణీ నష్టాల తగ్గింపులో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ట్రాన్స్‌కోకు ఈ అవార్డు దక్కింది. ప్రస్తుతం ఏపి ట్రాన్స్ కో సీఎండీగా విజయానంద్ ఉన్నారు.

ఎమ్మెస్ స్వామినాథన్‌కు అగ్రికల్చర్ ప్రైజ్
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్‌కు
(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్) ఐసీఎఫ్‌ఏ అగ్రికల్చర్ ప్రైజ్ లభించింది. ఈ మేరకు న్యూఢిల్లీలో అక్టోబర్ 26న జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ అవార్డును ప్రదానం చేశారు. వ్యవసాయ రంగంలో విశేష సేవలు అందించినందుకుగాను స్వామినాథన్ కు ఈ అవార్డు దక్కింది. ఐసీఎఫ్‌ఏ ప్రకటించిన అగ్రికల్చర్ ప్రైజ్‌ను మొదటిసారి అందుకున్న వ్యక్తి స్వామినాథన్ గుర్తింపు పొందారు. అగ్రికల్చర్ ప్రైజ్ కింద లక్ష డాలర్ల బహుమతిని ఆయనకు అందజేశారు.

తెలంగాణ విత్తన సంస్థ కమిషనర్ కు గ్లోబల్ సీఈవో అవార్డు
తెలంగాణ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ కమిషనర్ కె
. కేశవులు కి గ్లోబల్ సీఈవో అవార్డు లభించింది. ఈ మేరకు ఢిల్లీలో అక్టోబర్ 26న జరిగిన కార్యక్రమంలో భారత ఆహార, వ్యవసాయ మండలి ఈ అవార్డును అందజేసింది. వ్యవసాయరంగంలో ఉత్తమ విధానాలకు అమలుకు కృషి చేసినందుకుగాను కేశవులుకు ఈ అవార్డు దక్కింది.

తెలంగాణకు టూరిజంకు ఫిల్మ్ అవార్డు

తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన ‘విజట్ తెలంగాణ’చిత్రానికి ఏషియన్ టూరిజం ఫిల్మ్ అవార్డు లభించింది. యూరప్‌లోని పోర్చుగల్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అక్టోబర్ 27న రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఫిల్మ్ మేకర్ సత్యనారాయణ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా బుర్రా మాట్లాడుతూహైదరాబాద్‌లో అంతర్జాతీయ టూరిజం ఫెస్టివల్ నిర్వహణకు చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగా త్వరలో నిర్వాహకుల బృందం హైదరాబాద్‌లో పర్యటించనుందని చెప్పారు.

తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు ఆగ్రో వరల్డ్ అవార్డు
తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు ఇఫ్కా
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలోని ప్రతిష్టాత్మక ఆగ్రో వరల్డ్-2018 అవార్డు లభించింది. ఢిల్లీలో అక్టోబర్ 28న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. నూనె దిగుబడి పెరగడంలో కృషి చేసినందకు ఈ అవార్డు దక్కింది. రాష్ట్రంలో సగటున 18.84 శాతం నూనె దిగుబడి వస్తోంది.

శాంతినారాయణకు ‘నూతలపాటి’ పురస్కారం
అనంతపురం జిల్లాకి చెందిన ప్రఖ్యాత నవల
, కథా రచయిత డాక్టర్ శాంతినారాయణకు ‘నూతలపాటి సాహితీ పురస్కారం’ లభించింది. ఈ మేరకు సాహితీ పురస్కార కమిటీ అక్టోబర్ 31న ప్రకటించింది. శాంతినారయణ రచించిన ‘బతుకు బంతి’ కథా సంపుటికి ఈ అవార్డు దక్కింది. నవంబర్ 15న తిరుపతిలో జరిగే గంగాధర 79వ జయంతి సాహితీ సభలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

క్రీడలు

అంతర్జాతీయ క్రికెట్ నుంచి బ్రావో విరమణ

టి20 స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్‌గా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు సుపరిచితుడైన వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరమించాడు. ఈ మేరకు అక్టోబర్ 25న ప్రకటించాడు. అయితే టి20 లీగ్‌లు మాత్రం ఆడతానని బ్రావో తెలిపాడు. 35 ఏళ్ల బ్రావో… 2004లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టు ద్వారా వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేశాడు.

ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌గా సౌరవ్ కొఠారి
ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ టైటిల్
-2018 విజేతగా భారత బిలియర్డ్స్ ఆటగాడు సౌరవ్ కొఠారి నిలిచాడు. ఇంగ్లండ్‌లోని లీడ్‌‌సలో అక్టోబర్ 26న జరిగిన ఫైనల్లో కోల్‌కతాకు చెందిన 33 ఏళ్ల సౌరవ్ 1134-944 పాయింట్ల తేడాతో ప్రపంచ మాజీ చాంపియన్ పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)పై గెలుపొందాడు. దీంతో తొలిసారిగా కొఠారి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచినట్లయింది. 2014 ఆసియా బిలియర్డ్స్ విజేత అయిన సౌరవ్.. గతంలో మూడుసార్లు (2011, 2014, 2015) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యాలు సాధించాడు.

దేవధర్ ట్రోఫీ విజేత భారత్ ‘సి’
దేశవాలీ వన్డే టోర్నీ దేవధర్ ట్రోఫీ విజేతగా భారత్ ‘సి’ జట్టు నిలిచింది
. న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో అక్టోబర్ 27న జరిగిన ఫైనల్లో భారత్ ‘సి’ జట్టు 29 పరుగుల తేడాతో భారత్ ‘బి’పై గెలుపొందింది. ఈ టోర్నీలో భారత్ ‘సి’ జట్టుకి చెందిన సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 39; 1 ఫోర్, 4 సిక్స్‌లు)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. ఈ టోర్నీలో భారత్ ‘సి’ జట్టు కెప్టెన్‌గా అజింక్య రహానే, భారత్ ‘బి’ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించారు.

స్వితోలినాకు డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్
మహిళల టెన్నిస్ సంఘం
(డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్‌ను ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలీనా స్వితోలినా సొంతం చేసుకుంది. సింగపూర్‌లో అక్టోబర్ 28న రిగిన ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ స్వితోలినా 3-6, 6-2, 6-2తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)ను ఓడించింది. ఈ క్రమంలో 2013లో సెరెనా విలియమ్స్ తర్వాత ఈ టోర్నీలో అజేయంగా నిలిచి టైటిల్ దక్కించుకున్న క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.

ఆసియా హాకీ విజేతలుగా భారత్, పాకిస్తాన్
ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్
, పాకిస్తాన్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్, మాజీ విజేత పాకిస్తాన్ జట్ల మధ్య ఒమన్ రాజధాని మస్కట్‌లో అక్టోబర్ 28న జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. దీంతో భారత్, పాకిస్తాన్ లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు.

హామిల్టన్‌కు ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు ఫార్ములావన్
(ఎఫ్1) ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ లభించింది. మెక్సికోలో అక్టోబర్ 29న జరిగిన రేసులో 71 ల్యాప్‌లను గంటా 39 నిమిషాల 47.589 సెకన్లలో పూర్తి చేసి నాలుగో స్థానం పొందడంతోపాటు 12 పాయింట్లు సంపాందించాడు. ఈ ప్రదర్శనతో టైటిల్ గెలవడానికి అవసరమైన ఐదు పాయింట్లను హామిల్టన్ సాధించి చాంపియన్ గా నిలిచాడు. మరో రెండు రేసులు మిగిలి ఉన్న ఈ సీజన్‌లో ఓవరాల్‌గా 358 పాయింట్లతో హామిల్టన్(బ్రిటన్) అగ్రస్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. గతంలో హామిల్టన్ 2008, 2014, 2015, 2017లలో ప్రపంచ టైటిల్‌ను గెలిచాడు.

భారత నంబర్‌వన్ డబుల్స్ ప్లేయర్‌గా దివిజ్
అంతర్జాతీయ టెన్నిస్
(ఏటీపీ) ర్యాంకింగ్‌‌స డబుల్స్ విభాగంలో భారత ఆటగాడు దివిజ్ శరణ్ 38వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఫలితంగా భారత నంబర్‌వన్ డబుల్స్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇంత వరకు రోహన్ బొపన్న భారత్ తరఫున అత్యుత్తమ ర్యాంక్‌లో కొనసాగాడు. అక్టోబర్ 29న ప్రకటించిన తాజా ర్యాంకింగ్‌‌సలో బొపన్న 30నుంచి 39వ స్థానానికి పడిపోయాడు. వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 60కి చేరుకున్నాడు. జీవన్ నెడుంజెళియన్ కూడా కెరీర్‌లో అత్యుత్తమంగా 72వ ర్యాంక్‌లో నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో 197వ స్థానంలో నిలిచిన అంకితా రైనా టాప్-200లో ఉన్న ఏకై క భారత క్రీడాకారిణి కాగా కర్మన్ కౌర్ తాండి 215వ ర్యాంక్‌లో కొనసాగుతోంది.

వార్తల్లో వ్యక్తులు

స్వాతంత్య్ర సమరయోధుడు సత్యనారాయణ కన్నుమూత

స్వాతంత్య్ర సమరయోధుడు, సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ (95) పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అక్టోబర్ 25న కన్నుమూశారు. 1924 అక్టోబరు 1న పశ్చిమగోదావరిలోని ఇరగవరం మండలం పేకేరులో వెంకటరామదాసు, భద్రమ్మ దంపతులకు సత్యనారాయణ జన్మించారు. తర్వాతి కాలంలో ఆయన తణుకులో స్థిరపడ్డారు. క్విట్ ఇండియా సహా పలు ఉద్యమాల్లో పాలొన్న సత్యనారయణ అనేక పర్యాయాలు జైలు జీవితం గడిపారు.

1942లో సీపీఐలో చేరిన సత్యనారయణ 1962, 1972, 1994లో మూడు పర్యాయాలు పెనుగొండ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2018 ఆగస్టు 975వ క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగాడిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.

అమెరికా ఎఫ్‌ఈఆర్‌సీ ఛైర్మన్‌గా భారతీయ సంతతి వ్యక్తి
అమెరికా ఫెడరల్ ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్
(ఎఫ్‌ఈఆర్‌సీ) ఛైర్మన్‌గా భారతీయ సంతతికి చెందిన నెయిల్ ఛటర్జీ నియమితులయ్యారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 25న ఉత్తర్వులు జారీ చేశారు. పస్తుతం ఎఫ్‌ఈఆర్‌సీ ఛైర్మన్‌గా ఉన్న కెవిన్ మేక్ ఇంటైర్ స్థానంలో ఛటర్జీ అనారోగ్యం కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా పవర్ గ్రిడ్, వేలకోట్ల డాలర్ల విద్యుత్ ప్రాజెక్ట్‌లు ఎఫ్‌ఈఆర్‌సీ పరిధిలోకి వస్తాయి. ఛటర్జీ ఎఫ్‌ఈఆర్‌సీ ఛైర్మన్ బాధ్యతలు నిర్వర్తించడం ఇది రెండోసారి. గతంలో మెక్ ఇంటైర్ ఎఫ్‌ఈఆర్‌సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించకముందు 2017 ఆగస్టు 10 నుంచి డిసెంబర్ 7 వరకు ఛటర్జీ ఆ బాధ్యతలు నిర్వర్తించారు.

ఇథియోపియా తొలి మహిళా అధ్యక్షురాలిగా షాహ్లె
ఇథియోపియా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆ దేశ పార్లమెంటు సభ్యులు షాహ్లె వర్క్‌జ్యూడె ఎన్నికయ్యారు
. ఈ మేరకు అక్టోబర్ 26న ఆమె ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా షాహ్లె మాట్లాడుతూఇథియోపియాలో స్త్రీపురుష సమానత్వం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ఇథియోపియా ప్రధానిగా అమీ అహ్మద్ ఉన్నారు.

మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ విజేత క్లారా సోసా
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్
-2018 విజేతగా పరాగ్వేకు చెందిన క్లారా సోసా నిలిచింది. మయన్మార్‌లో అక్టోబర్ 25న నిర్వహించిన అందాల పోటీల్లో సోసా మొదటిస్థానంలో నిలిచి కిరీటం సొంతంచేసుకోగా భారతీయ యువతి మీనాక్షి చౌదరి రెండోస్థానం దక్కించుకుంది.

ఈడీ కొత్త డెరైక్టర్‌గా సంజయ్ కుమార్
ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్
(ఈడీ) కొత్త డెరైక్టర్‌గా సంజయ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ(ఏసీసీ) అక్టోబర్ 27న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్‌గా ఉన్న మిశ్రా ప్రిన్సిపల్ స్పెషల్ డెరైక్టర్ హోదాలో మూడు నెలలపాటు లేదా మరొకరు నియమితులయ్యే వరకు ఈడీ డెరైక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వం తెలిపింది. ఎస్‌కే మిశ్రా ఇండియన్ రెవెన్యూ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్ అధికారి. ప్రస్తుతమున్న ఈడీ డెరైక్టర్ కర్నాల్ సింగ్ పదవి అక్టోబర్ 28తో ముగియనుంది.

శ్రీలంక ప్రధానిగా రాజపక్స
శ్రీలంక నూతన ప్రధానిగా మహిందా రాజపక్స నియమితులయ్యారు
. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆయనతో అక్టోబర్ 26న ప్రమాణం చేయించారు. ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమసింఘేకు చెందిన యునెటైడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు సిరిసేన పార్టీ యునెటైడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలియన్‌‌జ(యూపీఎఫ్‌ఏ) ప్రకటించింది. దీంతో విక్రమసింఘే తన పదవిని కొల్పోయారు.

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఖురానా కన్నుమూత
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి
, బీజేపీ సీనియర్ నేత మదన్‌లాల్ ఖురానా (82) అనారోగ్య కారణాలతో ఢిల్లీలో అక్టోబర్ 27న కన్నుమూశారు. 1936, అక్టోబర్ 15న పంజాబ్ ప్రావిన్స్(బ్రిటిష్ ఇండియా)లోని ల్యాల్‌పూర్‌లో ఎస్‌డీ ఖురానా, లక్ష్మీదేవి దంపతులకు మదన్‌లాల్ ఖురానా జన్మించారు. 1993-96 మధ్య కాలంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన 2004లో రాజస్తాన్ గవర్నర్‌గా నియమితులయ్యారు.

300 వన్డేలకు రిఫరీగా వ్యవహరించిన బ్రాడ్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎలైట్ ప్యానెల్ రిఫరీ అయిన క్రిస్ బ్రాడ్
300 వన్డేలకు రిఫరీగా వ్యవహరించిన రెండో వ్యక్తిగా నిలిచారు. భారత్వెస్టిండీస్ మధ్య పుణేలో అక్టోబర్ 27న జరిగిన మూడో వన్డేతో బ్రాడ్ ఈ రికార్డును అందుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ బ్రాడ్ 2004లో ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌కు తొలిసారి రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన కంటే ముందు రంజన్ మధుగలె (శ్రీలంక-336 మ్యాచ్‌లు) అత్యధిక మ్యాచ్‌లకు రిఫరీగా ఉన్నారు.

బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా జాయర్ బోసానారు
బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా సంప్రదాయ ఫాసిస్ట్ నాయకుడు జాయర్ బోసానారు ఎన్నికయ్యారు
. అక్టోబర్ 28న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జాయర్ కమ్యూనిస్ట్ కూటమికి చెందిన వర్కర్స్ పార్టీ నాయకుడు ఫెర్నాండో హాడడ్‌పై సంపూర్ణ మెజారిటీ సాధించారు. జాయర్ కు 5.2 శాతం ఓట్లు రాగా, ఫెర్నాండోకు 44.8 శాతం ఓట్లు దక్కాయి. గతంలో సైనికాధికారిగా పనిచేసిన జాయర్ ఎన్నికల ప్రచార సమయంలో తరచూ మహిళలు, గేలపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచి ‘బ్రెజిల్ ట్రంప్’గా పేరొందారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments