అవంతి – గంటా. విశాఖలో ఎవరిది పై చేయి ?

విశాఖ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది ప్రత్యేక స్థానం. ఏపీ రాజకీయాల్లోనే గంటా అన్నాఆయన గ్యాంగ్ అన్నాపార్టీలు వెల్ కమ్ బోర్డులతో పచ్చజెండా ఊపేస్తుంటాయి. రాష్ట్రస్థాయి రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో గంటా శ్రీనివాసరావుతన సామర్థ్యాన్ని గుర్తుంచుకొని జిల్లాపై పూర్తి పట్టుసాధించే క్రమంలో అనుచరగణాన్ని పెంచుకున్నారు. తాను ఎటువెళ్తే అటు వచ్చే పరివారాన్ని తయారు చేసుకున్నారు. వారిలో ప్రథముడు అవంతి శ్రీనివాస్. టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఆయన అనుచరుడిగా ఎదిగిన అవంతితదుపరి ప్రజారాజ్యంలో అక్కడి నుంచి కాంగ్రెస్ మళ్లీ తిరిగి టీడీపీలో గంటా వెంటే నిలిచారు. కానీ ఏం లాభం మర్రి చెట్టు నీడలో మరో మొక్క ఎదగదన్నట్లు అయింది అవంతి పరిస్థితి. ఇది గుర్తించిన అవంతి శ్రీనివాస్ ఇక గంటా స్నేహానికి ఆఖరి గంట మోగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇవాళ హైదరాబాద్ లో వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

అవంతి శ్రీనివాస్ ప్రస్తుత అనకాపల్లి ఎంపీ. గత ఎన్నికల్లో భీమిలి సీటు ఆశించి భంగపడ్డారు. మరోమారు భంగపాటుకు గురికావద్దని నిర్ణయించుకొని.. తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. పైకి తెలుగుదేశం పార్టీపై ఉన్న వ్యతిరేకత, ప్రజాసంకల్ప యాత్ర ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జగన్ పార్టీకి పెరిగిన మద్దతు గుర్తించి సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు చేరారని ఆయన మద్దతు దారులు చెబుతున్నావాస్తవం మాత్రం భీమిలి అసెంబ్లీ సీటు కోసమే అన్నది పొలిటకల్ సర్కిల్లో టాక్. ఇది తన గురువు గంటా శ్రీనివాసరావు దగ్గర నేర్చుకున్న చాణక్యమే అయినప్పటికీ ఇది గురువుని మించిన చాణక్యమని చెప్పకతప్పదు.

విశాఖ జిల్లాల్లో గెలుపు ఎక్కడుంటే గంటా అక్కడుంటాడు. గంటా ఎక్కడుంటే గెలుపు అక్కడుంటది అనేది నానుడి ఉంది. మొత్తానికి గంటా శ్రీనివాసరావు గెలుపుతోనే ఉంటాడు. అయితే ఆయన అడుగుజాడల్లో నడిచిన అవంతి శ్రీనివాస్ కు రాష్ట్రస్థాయి నేతగా ఎదగాలన్న కోరిక బలమైనది. ఇందుకు తన అర్ధబలం కూడా కారణం. ఎంపీగా ఢిల్లీకి చేరినా జిల్లా స్థాయిలో తన అనుచరగణానికి చేసిందేమీ లేదని అందుకు ఎంపీ పదవే కారణమని తన అనుంగు మిత్రులు సమీక్షిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడితేఉత్తరాంధ్రలో బలమైన సామాజికవర్గమైన తనకు ఏదో ఒక కోటాలో మంత్రిపదవి రావొచ్చని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగానే టీడీపీని, గంటా సాన్నిహిత్యాన్ని వీడి వైసీపీలో చేరారు. అయితే అవంతితో వైరం పెట్టుకునేందుకు గంటా శ్రీనివాసరావు ఆసక్తిగా లేరని ఆయన తాజా వ్యాఖ్యలు స్పష్టంచేస్తున్నాయి. భీమిలి సీటుకోసమే ఆయన పార్టీ మారబోతున్నారంటేఆ సీటు వదులుకోవడానికి సిద్ధమని గంటా ప్రకటించారు. అదే విషయాన్నిటీడీపీ అధిష్టానికి సైతం తెలియజేశారు. కానీ అవంతి శ్రీనివాస్ కు టీడీపీ బాస్ నుంచి స్పష్టమైన హామీ లభించలేదని టాక్. సో.. చేసేది లేక పనిలో పనిగా గంటాకు టాటా చెప్పేందుకు అవంతి శ్రీనివాస్ దీన్నే అదనుగా చేసుకొనివైసీపీ గూటికి చేరారు. చూడాలి మరి. ఈ సారి విశాఖ జిల్లాలో అవంతి, గంటా ఇద్దరిలో ఎవరిది పై చేయి అవుతోంది….. !

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments