కూలీల కొరత రైతులకు ప్రధాన అడ్డంకిగా మారినందున … వ్యవసాయంలో యాంత్రీకరణ ఆవశ్యకత మరింత పెరుగుతోంది. ప్రస్తుత వరి నాట్ల సీజన్ లో చాలా చోట్ల కూలీలు దొరకడం లేదు. దొరికినా నాట్లు వేసేందుకు ఖర్చు ఎక్కువ అవుతోంది. ఈ ఇబ్బందని అధిగమించేందుకు తెలంగాణ, ఏపీలో అనేక చోట్ల నాట్లు వేసేందుకు రైతులు యంత్రాలు వాడుతున్నారు. అతి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో నాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో… వరినాట్ల మెషీన్ పనితీరుపై అవగాహన కల్పించేందుకే ఈ వీడియో.. !!
Read MoreCategory: సాగుబడి
ఎడారి మిడతలు అంటే ఏమిటి ? వాటిని ఎలా నిలువరించాలి ?
ఎడారి మిడతలు (Desert Locust) అంటే ఏమిటి ? వ్యవసాయ, పశు సంపదకు ఇవి ఏ మేర నష్టం కలిగిస్తాయి ? మన దేశంలో ఇంతకముందు ఎప్పుడైనా వచ్చాయా ? ఈ మిడతల జన్మస్థానం ఎక్కడ ? ఎక్కడి నుంచి వస్తున్నాయి ? ఎడారి మిడతల జీవన క్రమం ఎంత ? నివారణ మార్గాలు ఏవి ? ఈ వివరాలను రైతు శ్రీనివాస మూర్తి గారు సవివరంగా ఈ వీడియోలు వివరించారు. వ్యవసాయంపై ఆసక్తితో విస్తృత అధ్యయనాలు జరిపి.. విలువైన జ్ఞానాన్ని ఆర్జించిన ఆయన.. ఆ సమాచారాన్ని రైతులకు యూట్యూబ్ ద్వారా అందిస్తున్నారు.
Read Moreతెలంగాణ సోనాకు అంతర్జాతీయ మార్కెటింగ్
షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే సన్నబియ్యం రకం తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048)కు జాతీయ, ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ బియ్యం రకానికి మరింత ప్రాచుర్యం కల్పించి మార్కెటింగ్ అవకాశాలు పెంచేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)తో చేతులు కలిపింది. ఈ మేరకు జూలై 28న ప్రభుత్వం, వ్యవసాయ యూనివర్సిటీ, ఐఎస్బీ మధ్య ఒప్పందం కుదిరింది. తెలంగాణ సోనాను 2015లో జయశంకర్ వ్యవసాయవర్సిటీ రూపొందించింది. ఈ బియ్యంలో గ్లూకోజ్శాతం (గ్రైసిమిక్స్) తక్కువగా ఉన్నట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) తేల్చింది. దీంతోపాటు అంతర్జాతీయ జర్నల్స్‌లో రీసర్చ్ రిజల్స్ట్ ను ప్రచురించింది. విటమిన్-B3 కూడా పుష్కలంగా ఉన్నట్టు గుర్తించింది. ఇతర రకాల సాగుతో పోల్చితే తెలంగాణ సోనా తక్కువ సమయంలో పంటకొస్తుంది. వానకాలం, యాసంగి రెండు సీజన్లలోనూ సాగుకు…
Read More