సాగర్ సామర్థ్యంలో 110 టీఎంసీలు స్వాహా !!

వానాకాలంలో న్యూస్ పేపర్లో చాలా మంది ఆసక్తితో చూసే కాలమ్… ఏ ప్రాజెక్టులో ఎంత నీరు ఉంది, ఇన్ ఫ్లో ఎంత.. ఔట్ ఫ్లో ఎంత అనే వివరాలు. ఆయా ప్రాజెక్టులు నిండినయ్ అంటే.. అవి మన దగ్గర లేకున్నా.. మనసులో ఏదో తెలియని ఆనందం వస్తుంది. కానీ.. వాస్తవానికి ప్రాజెక్టుల్లో నిజంగా సామర్థ్యానికి తగిన నీటి నిల్వ చేరుతుందా అంటే.. నిస్సందేహంగా లేదనే చెప్పాలి. దశాబ్దాలుగా ప్రాజెక్టుల అడుగన పేరుకుపోతున్న పూడిక… వాటర్ స్టోరేజ్ కెపాసిటీని తగ్గిస్తోంది. దాదాపు 408 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు.. నేడు 312 టీఎంసీలకే పరిమితం అయ్యింది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లోను ఇంతకుమించి పూడిక పేరుకుపోయింది. 53 ఏళ్లలో 110 టీఎంసీలు.. !! నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన…

Read More

నకిలీ సర్టిఫికెట్లతో పట్టభద్రుల ఓటు నమోదు సాధ్యమేనా ??

తెలంగాణలో రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ నియోజవర్గాల ఓటు నమోదు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో జరుగుతోంది. రాజకీయ పార్టీలు ఏజెంట్లను పెట్టి మరీ పట్టభద్రుల నుంచి సర్టిఫికెట్లు, ఫోటోలు సేకరించి ఫాం – 18 నింపి తహసీల్దార్, మున్సిపల్ ఆఫీసుల్లో సమర్పిస్తున్నాయి. పార్టీకి అనుకూలంగా ఉన్నవారందరినీ ఓటర్లుగా నమోదు చేసేందుకు పొలిటికల్ పార్టీలు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాయి. అయితే.. ఓటరు నమోదు ప్రక్రియపై అనుమానం వ్యక్తం చేసిన కాంగ్రెస్.. టీఆర్ఎస్ నకిలీ సర్టిఫికెట్లతో పట్టభద్రుల ఓట్లు నమోదు చేస్తోందని ఆరోపిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలోని టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ.. ఎన్నికల ముఖ్య కార్యనిర్వాహణ అధికారి శశాంక్ గోయల్ ను కలిసి.. ఓటరు నమోదుపై దృష్టి సారించాలని కోరింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో…

Read More

కరంట్ అఫైర్స్ – జూలై 16, 2020

జియోలో గూగుల్ రూ. 33వేల కోట్ల పెట్టుబడులు జియో ప్లాట్ ఫామ్స్ లో టెక్నాలజీ దిగ్గజం గూగుల్ రూ. 33,737 కోట్ల పెట్టుబడి పెట్టనుందని, తద్వారా జియోలో 7.7% వాటాను పొందనుందని రిలయన్స్ ఇండస్ర్టీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ జూలై–15న జరిగిన రిలయన్స్ ఇండస్ర్టీస్ వాటాదారుల 43వ వార్షిక సాధారణ సమావేశంలో వెల్లడించారు. కరోనా నేపథ్యంలో తొలిసారిగా రిలయన్స్ వర్చువల్ సమావేశంలో ముఖేష్ మాట్లాడుతూ ఇప్పటివరకు జియో ప్లాట్ ఫామ్స్ లోకి రూ. 2.12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 150 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించిన తొలి కంపెనీగా రిలయన్స్ చరిత్ర సృష్టించిందన్నారు. దేశంలో అత్యధిక వస్తుసేవల పన్ను చెల్లించిన రిలయన్స్ వాటాదారులకిచ్చిన హామీ ప్రకారం గడువుకు ముందే రుణ రహిత కంపెనీగా మారిందన్నారు. కరోస్యూర్ విడుదల ప్రపంచంలోనే అత్యంత చౌక కరోనా టెస్ట్…

Read More

కరంట్ అఫైర్స్ – జూలై 15, 2020

☛ భారత్ కు ఇజ్రాయిల్ క్షిపణులు భారత్ తన సరిహద్దు రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందకు… ఇజ్రాయిల్ నుంచి ఎమర్జీ ఫైనాన్షియల్ పవర్స్ కింద.. 12 స్పైక్ లాంచర్స్, 200 మిస్సైల్స్ ను కొనుగోలు చేయనుంది. గతేడాది బాలాకోట్ ఏరియల్ స్ర్టైక్ సమయంలో కూడా భారత్ ఇంతే మొత్తంలో స్పైక్ లాంచర్స్, మిస్సైల్స్ ను ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేసింది. పాకిస్తాన్ వైపు ఉన్న సరిహద్దులో వాటిని మోహరించింది. ఇప్పుడు కొనుగోలు చేయనున్న మిసైల్లను చైనాతో ఉన్న సరిహద్దు వెంట మోహరించనున్నారు.   ☛ జూమ్, జియో మీట్ కు పోటీగా ఎయిర్ టెల్ బ్లూజీన్స్ కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఇళ్ల నుంచి బయటికొచ్చే పరిస్థితులు లేకపోవడంతో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో జూమ్, జియో మీట్ లాంటి వీడియో…

Read More

కరెంట్ అఫైర్స్ – జూలై 14, 2020

కరోనా కట్టడికి తొలి వ్యాక్సిన్…. క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న రష్యా రష్యా కరోనా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుందని సెచెనోవ్ వర్సిటీ పేర్కొంది. వలంటీర్లపై ప్రయోగ పరీక్షలు పూర్తయ్యాయని ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ లేషన్ మెడిసిన్ అండ్ బయోటెక్నాలజీ డైరెక్టర్ వాడిత్ తారాసోవ్ వెల్లడించారు. గమలీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రో బయాలజీ ఉత్పత్తి చేసిన ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జూన్-18న మొదలు పెట్టారని, ప్రయోగ పరీక్షలు ఎదుర్కొంటున్న వలంటీర్ల తొలి బృందం బుధవారం(జూలై–15) డిశ్చార్జ్ కానుండగా రెండో బృందం ఈ నెల 20వ తేదీన డిశ్చార్జ్ అవుతుందని తారాసోవ్ వివరించారు. FTCCI తొలి ఆన్ మెంటర్ షిప్ మహిళా ఎంటర్ ప్రెన్యూర్ల కోసం ఏర్పాటు కరోనా సమస్యలను అధిగమిస్తూ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్…

Read More

Current Affairs – Telugu – August 11 – 14 – 2019

☛ మోదీ సాహసయాత్ర – డిస్కవరీలో ప్రసారం ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్, ప్రధాని నరేంద్ర మోదీ కలిసి ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్పెట్ జాతీయ పార్కులో చేపట్టిన సాహసయాత్ర ఆగస్టు 12న డిస్కవరీ గ్రూప్ ఛానళ్లలో ప్రపంచవ్యాప్తంగా 180కిపైగా దేశాల్లో ప్రసారమైంది. ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో భాగంగా ఈ సాహస యాత్రను చిత్రీకరించారు. ఈ యాత్ర లో బెంగాల్ పులులు, మొసళ్లు, విషసర్పాల మధ్య ఎలా మనుగడ సాగించాలో గ్రిల్స్ మోదీకి వివరించారు. పులుల అడుగుజాడల్ని చూసుకుంటూ వీరిద్దరూ హిమాలయాల్లోని ఓ నదిని తెప్పపై దాటారు. ఇన్‌క్రెడిబుల్ ఇండియాకు వైల్డ్ లైఫ్ థీమ్ అంతర్జాతీయంగా పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారత ప్రభు త్వం చేపట్టిన ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా ’ కార్యక్రమానికి ‘వైల్డ్ లైఫ్’ను ఇతివృత్తంగా ఎంచుకోనున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి ప్లహాద్ పటేల్ ఆగస్టు…

Read More

Current Affairs in Telugu – August 1 – 2019

☛  నవయుగతో పోలవరం కాంట్రాక్టు రద్దు ఆంధ్రప్రదేశ్ జీవధారగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి నవయుగ కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనుల నుంచి తప్పించి.. కాంట్రాక్ట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాంట్రాక్ట్ ఒప్పందంలోని 89.3 క్లాజును అనుసరించి కాంట్రాక్ట్ ను ప్లీ క్లోజూర్ చేస్తున్నామని పేర్కొంటు కంపెనీకి నోటీసు పంపింది. పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన స్పిల్ వే, స్పిల్ చానల్ పనులు ఏడాదిలో పూర్తి చేసేందుకు జల వనరుల శాఖ గతంలో నవయుగతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ. 1,244 కోట్లు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున.. కాంట్రాక్ట్ రద్దుకి కేంద్రం అమోదం తప్పనిసరి. ☛  సెప్టెంబర్ 28న ఐరాసలో ప్రధాని మోదీ ప్రసంగం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఐక్యరాజ్య…

Read More

November 2018 Current Affairs – Awards

అరుణిమ సిన్హాకు డాక్టరేట్ భారత మాజీ వాలీబాల్ క్రీడాకారిణి, పర్వతారోహకురాలు అరుణిమ సిన్హాకు యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన స్ట్రాత్ క్లైడ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను అందజేసింది. 2011లో దుండగులు రైలు నుంచి తోసివేయడంతో కాలు పోగొట్టుకున్న అరుణిమ 2013, మే-21న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. దీంతో ప్రపంచంలోనే ఆ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళా దివ్యాంగురాలిగా ఆమె రికార్డులకెక్కారు. 2015లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. జాతీయ జర్నలిజం ప్రతిభా పురస్కారాలు 2018 సంవత్సరానికి గాను జాతీయ జర్నలిజం ప్రతిభా పురస్కారాలను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(PCI) 2018, నవంబర్ -5న ప్రకటించింది. పాత్రికేయ రంగంలో విశేష సేవలు అందించినందుకు హిందు గ్రూపు ఛైర్మన్ N.రామ్ కు ప్రతిష్ఠాత్మక రాజా రామ్మోహన్ రాయ్ పురస్కారాన్ని; గ్రామీణ పాత్రికేయ విభాగంలో రుబీ సర్కార్(దేశ్…

Read More

November 2018 Current Affairs – Sports

ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు రాయుడు బై వన్డేలలో నిలకడగా రాణిస్తున్న అంబటి రాయుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి వైదొలిగారు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రాయుడు ఫ స్ట్ క్లాస్ కెరీర్ లో 97 మ్యాచ్ లు ఆడి 6,151 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు సాధించగా అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 210 పరుగులు. ఆసియన్ స్నూకర్ విజేత పంకజ్ చైనాకు చెందిన జు రెటీని 6-1తేడాతో ఓడించడం ద్వారా ఆసియన్ స్నూకర్ టూర్ టైటిల్ రెండో దశ విజేతగా పంకజ్ అద్వాణి నిలిచారు. ఈ టైటిల్ అందుకున్న తొలిభారతీయుడు పంకజ్. మహారాష్ట్రలోని పుణెకు చెందిన పంకజ్ అద్వాణీ ప్రపంచ టైటిల్ ను 19 సార్లు గెలుచుకున్నాడు. ఐదోసారి ఫార్ములావన్ ఛాంపియన్ మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఐదోసారి…

Read More

November 2018 Current Affairs – Science and Technology

ఇండియాకి చేరిన INS తరంగిణి ప్రపంచ నౌకాయాత్ర కోసం ఇండియా నౌకాదళం చేపట్టిన ‘లోకయాన్-18′ లో INS-తరంగిణి నౌకను ఉపయోగించారు. ఇది 2018, ఏప్రిల్-10న కొచ్చిలో ప్రారంభమై అక్టోబర్-31న తిరిగి కొచ్చికి చేరుకుంది. 205 రోజుల పర్యటనలో 13 దేశాలు సందర్శించి 22,000నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించింది. రష్యాతో యుద్ధ నౌకల ఒప్పందం ప్రాజెక్ట్ 11356 తరగతికి చెందిన 4 యుద్ధ నౌకల కోసం అక్టోబర్-31న రష్యాతో ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. 950 మిలియన్ డాలర్ల విలువ గల ఈ నౌకల్లో రెండింటిని రష్యాలో నిర్మించి 2022 నాటికి అందజేయనుంది. మరో రెండింటిని గోవా షిప్ యార్డ్ లో నిర్మించనున్నారు. రిటైర్ అయివ నాసా కెప్లర్ టెలిస్కోప్ దాదాపు దశాబ్దం పాటు సౌర కుటుంబం వెలుపల, ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలను పసిగట్టిన కెప్లెర్ అంతరిక్ష…

Read More