కరెంట్ అఫైర్స్ – జూలై 29, 2020

☛ ప్రపంచంలో 75 శాతం పులులు భారత్ లోనే జూలై 29న గ్లోబల్‌ టైగర్‌ డే సందర్భాన్ని పురస్కరించుకొని 2018లో చేపట్టిన పులుల గణన ఆధారంగా కేంద్రం జూలై 28న ఒక నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 50 టైగర్‌ రిజర్వ్‌లలో ఉత్తరాఖండ్‌లో కార్బెట్‌ టైగర్‌ రిజర్వ్‌లో అత్యధికంగా 231 పులులు, ఆ తర్వాత కర్ణాటకలోని నాగర్‌హోల్‌లో 127, బందీపూర్‌లో 127 పులులు ఉన్నట్టు వెల్లడించింది. మిజోరంలోని డంపా, బెంగాల్‌లోని బుక్సా, జార్ఖండ్‌లో పాలమూ రిజర్వ్‌లలో ఒక్క పులీ మిగల్లేదు. 2018 పులుల గణన ప్రకారం దేశవ్యాప్తంగా 2,967 పులులు ఉన్నాయి. 1973లో కేవలం తొమ్మిది మాత్రమే టైగర్‌ రిజర్వ్‌లు ఉన్న మన దేశంలో ఇప్పుడు వాటి సంఖ్య 50కి చేరుకుందని… దేశంలో ఉన్న అన్ని టైగర్‌ రిజర్వ్‌లూ నాణ్యతాపరంగా బాగున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ…

Read More

ప్రగతి భవన్ కు కేసీఆర్ – రైతుబంధుపై కీలక ఆదేశాలు !!

రెండు వారాలుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు.. ఇవాళ ప్రగతి భవన్ కి చేరుకున్నారు. రోజు రోజుకీ కరోనా తీవ్రత ఎక్కువ అవుతున్న పరిస్థితిలో.. వైద్య సదుపాయాలను సమీక్షిస్తూ ప్రజల్లో ధైర్యం నింపాల్సిన సీఎం.. ఫాం హౌస్ లో ఏం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. #WhereisKCR ట్యాగ్ తో ముఖ్యమంత్రి ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులతో ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. ఇద్దరు యువకులైతే ఏకంగా ప్రగతి భవన్ ముందు వేర్ ఈజ్ కేసీఆర్ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కోరుతు హై కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ పరిణామాల మధ్య తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలకు ఎండ్ కార్డ్ వేస్తూ.. రెండు వారాల…

Read More

Current Affairs in Telugu – August 1 – 2019

☛  నవయుగతో పోలవరం కాంట్రాక్టు రద్దు ఆంధ్రప్రదేశ్ జీవధారగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి నవయుగ కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనుల నుంచి తప్పించి.. కాంట్రాక్ట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాంట్రాక్ట్ ఒప్పందంలోని 89.3 క్లాజును అనుసరించి కాంట్రాక్ట్ ను ప్లీ క్లోజూర్ చేస్తున్నామని పేర్కొంటు కంపెనీకి నోటీసు పంపింది. పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన స్పిల్ వే, స్పిల్ చానల్ పనులు ఏడాదిలో పూర్తి చేసేందుకు జల వనరుల శాఖ గతంలో నవయుగతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ. 1,244 కోట్లు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున.. కాంట్రాక్ట్ రద్దుకి కేంద్రం అమోదం తప్పనిసరి. ☛  సెప్టెంబర్ 28న ఐరాసలో ప్రధాని మోదీ ప్రసంగం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఐక్యరాజ్య…

Read More

కేసీఆర్ రాజ్యంలో తెలంగాణ బాహుబలి పరిస్థితేంటి..?

టీఆర్‌ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు తన్నీరు హరీశ్‌రావు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారీ తనదైన వ్యక్తిత్వ ప్రదర్శనతో తెలంగాణ ప్రజల్లో గులాబీ గూడు కట్టుకునేలా చేసిన ఘనత కచ్చితంగా హరీశ్‌రావుదే. ఆయనో అజాత శత్రువు. ఇతర పార్టీలు సైతం హరీశ్‌రావును రాజకీయంగా, వ్యక్తిత్వపరంగా విమర్శలు చేసేందుకు సిద్ధపడవు. అది ఆయన నిజాయతీ, నిబద్ధతకు నిదర్శనం. టీఆర్‌ఎస్‌ పార్టీని తెలంగాణ ఉద్యమాన్ని జనంలో నిత్యం నానేలా చేయడంలో కేసీఆర్‌కు రాజకీయంగా తోడు–నీడగా నిలిచిన హరీశ్‌రావుకు ఇప్పుడు ప్రాధాన్యం తగ్గిపోతోందనేది తెలంగాణ రాజకీయాలపై అవగాహన ఉన్న చిన్న కుర్రాడ్ని అడిగినా తడుముకోకుండా చెప్పగలరు. హరీశ్‌రావును ఫేడవుట్‌ చేయాలన్న ప్రయత్నం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. కేసీఆర్‌ తానుండగానే కొడుకు కేటీఆర్‌కు ఎలాంటి రాజకీయ ఇబ్బందులు లేకుండా చక్కదిద్దే ప్రయత్నంలోనే ఈ కార్యచరణకు దిగినట్లు హరీశ్‌ అభిమానులు…

Read More

ఎన్నికల వేళ వైసీపీలోకి వలసలు టీడీపీకి లాభమా నష్టమా… ?

మొన్న మేడా మల్లికార్జున రెడ్డి, నిన్న ఆమంచి కృష్ణమోహన్, నేడు అవంతి శ్రీనివాస్… ఇలా అధికార టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి. ఎన్నికల వేళ జంప్ జిలానీల సంఖ్య పెరగడం సహజమైనా వరసబెట్టి అధికార పార్టీ నుంచి విపక్షానికి నేతలు వరస కడుతుండటం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరసగా 23 మంది ఎమ్మెల్యేలు జగన్ పార్టీని వీడి సైకిల్ సవారీ చేయగా… ఇప్పుడు టీడీపీ నుంచి ఫ్యాన్ కిందకు చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు ప్రధానంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఓ ఎంపీ అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకోగా… ఈ లిస్టు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయా పార్టీల నేతలు స్పష్టంచేస్తున్నారు. ఉత్తరాంధ్రలో గంటా గ్యాంగ్ గా ఎదిగిన అవంతి శ్రీనివాస్ ఇప్పుడు ఆయన…

Read More

పవన్ మౌనం.. ఏంటో వ్యూహం.. !

ప్రశ్నించేందుకే అంటు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. జనసేనతో ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. శ్రీకాకుళం ఉద్దానం కిడ్నీ సమస్య, ఉత్తరాంధ్ర వెనకబాటుతనం వంటి విషయాల్లో ఆలోచింపజేసే విధానాలతో ఆకట్టుకున్నారు. కానీ.. సినిమాల్లో లాగే.. రాజకీయాల్లోను ఆయనలో కంటిన్యుటీ లోపించినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను ప్రభావితం చేయగలిగే పలు సంఘటనలు ఇటీవల జరిగినా.. పవన్ మాత్రం వాటిపై కనీసం తమ పార్టీ విధానం ఏంటన్నది క్లారిటీ ఇవ్వలేదు. పార్టీలో పేరున్న లీడర్, ప్రజల దృష్టిని గ్రాబ్ చేయగల నాయకుడు ఆయన ఒక్కరే కాబట్టి… రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై జనసేన స్టాండ్ ని సహజంగా ఆయన నోటి నుంచే వినాలని అంతా అనుకుంటారు. కానీ పవన్ మాత్రం చాలా అంశాలపై మౌనమే సమాధానమనే ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోంది.…

Read More

November 2018 Current Affairs – Sports

ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు రాయుడు బై వన్డేలలో నిలకడగా రాణిస్తున్న అంబటి రాయుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి వైదొలిగారు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రాయుడు ఫ స్ట్ క్లాస్ కెరీర్ లో 97 మ్యాచ్ లు ఆడి 6,151 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు సాధించగా అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 210 పరుగులు. ఆసియన్ స్నూకర్ విజేత పంకజ్ చైనాకు చెందిన జు రెటీని 6-1తేడాతో ఓడించడం ద్వారా ఆసియన్ స్నూకర్ టూర్ టైటిల్ రెండో దశ విజేతగా పంకజ్ అద్వాణి నిలిచారు. ఈ టైటిల్ అందుకున్న తొలిభారతీయుడు పంకజ్. మహారాష్ట్రలోని పుణెకు చెందిన పంకజ్ అద్వాణీ ప్రపంచ టైటిల్ ను 19 సార్లు గెలుచుకున్నాడు. ఐదోసారి ఫార్ములావన్ ఛాంపియన్ మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఐదోసారి…

Read More

November 2018 Current Affairs – Telangana

హైదరాబాద్ లో పాండ్రాల్ రైల్వేలకు అవసరమైన విడిభాగాలు తయారు చేసే ఇంటర్నేషనల్ సంస్థ పాండ్రాల్ అక్టోబర్-29న రాహీ టెక్నాలజీస్ తో కలిసి హైదరాబాద్ లో ప్లాంటును ప్రారంభించింది. ఈ ప్లాంటు ద్వారా ప్రధానంగా భారత మార్కెట్ కు విడిభాగాలను సరఫరా చేస్తారు. ఇక్కడ తయారయ్యే క్లిప్స్ ను మారిషస్ లో L&T నిర్మిస్తున్న రైల్వే ప్రాజెక్టుకు వినియోగించనున్నారు. భారత మెట్రో రైల్ ప్రాజెక్టులతో పాటు బంగ్లాదేశ్, ఘనాలో ట్రాక్ ల పునరుద్ధరణలోనూ వీటిని వాడనున్నారు. భాగ్యనగరిలో వన్ ప్లస్ కేంద్రం ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ హైదరాబాద్ లో పరిశోధన , అభివృద్ధి కేంద్రాన్ని(R&D) ఏర్పాటు చేయనుంది. చైనా, తైవాన్ ల అనంతరం ఆ సంస్థ ఏర్పాటు చేయనున్న కేంద్రం అది హైదరాబాద్ లోనే కావడం విశేషం. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు…

Read More

November 2018 Current Affairs – International

ఫిజి ప్రధానిగా బైనిమరామ ఫిజి ప్రధానిగా ఫ్రాంక్ వొరెక్ బైనిమరామ తిరిగి ఎన్నికయ్యారు. రిపబ్లిక్ ఆఫ్ ఫిజి మిలిటరీ ఫోర్సెస్ నుంచి నేతృత్వం వహిస్తున్న ఈయన 2007 జనవరి నుంచి ప్రధానిగా కొనసాగుతున్నాడు. ఇతని ప్రమాణ స్వీకారం ఆ దేశ అధ్యక్షుడు జియొజి కొన్రోట్ ఆధ్వర్యంలో జరిగింది. యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా మిల్లి సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘స్ట్రేంజర్ థింగ్స్‘తో పాపులర్ అయిన హాలివుడ్ నటి మిల్లి బాబి బ్రౌన్ యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఎంపికైన వారిలో ఈమెనే అతి పిన్నవయస్కురాలు కావడం విశేషం. మిల్లి బాలల హక్కులు, విద్య, హింస నుంచి రక్షణ అనే అంశాలపై పోరాడుతుంది. ప్రపంచ బాలల దినోత్సవం నవంబర్-20న యునిసెఫ్ మిల్లిని ఎంపిక చేసింది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న యునిసెఫ్ కు టోర్ హట్రెమ్ అధ్యక్షుడిగా…

Read More

November 2018 Current Affairs – National

మోదీ జపాన్ పర్యటన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్-28,29 న జపాన్ లో పర్యటించారు.ఈ సందర్భంగా జపాన్ లో జరిగిన 13వ భారత్–జపాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు.పారిశ్రామిక రోబోల తయారీ కేంద్రమైన ‘ఫనుక్‘ ను జపాన్ ప్రధాని షింజో అబెతో కలిసి సందర్శించారు.ఈ పర్యటనలో భాగంగా యోగా, ఆయుర్వేదంలో సహకారాన్నిపెంపొందించుకునే ఒప్పందాలు, విదేశీ మారక ద్రవ్యం పరంగా క్యాపిటల్ మార్కెట్లలో స్థిరత్వం కోసం స్థానిక కరెన్సీలో 7,500 కోట్ల డాలర్ల వరకు చెల్లింపులు చేసేందుకు వీలు కల్పించే భారీస్థాయి ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. సుష్మా స్వరాజ్ విదేశీ పర్యటన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అక్టోబర్-28 నుంచి 31 వరకు ఖతార్, కువైట్ దేశాల్లో పర్యటించారు. అక్టోబర్-28,29 తేదీల్లో ఖతార్ లో పర్యటించి ఆక్కడి ఉప ప్రధాని షేక్ మహమ్మద్ బిన్…

Read More