శ్రీవారి సన్నిధిలో 15 మంది అర్చకులకు కరోనా !

తిరుమల తిరుపతి దేవస్థానంలోని 50 మంది అర్చకుల్లో 15 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. మరో 25 మంది అర్చకుల ఫలితాలు రావాల్సింది ఉంది. దీంతో తితిదేలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన అర్చకులు, సిబ్బంది సంఖ్య 140కి చేరింది. అయితే.. కరోనా వైరస్ కేసులు ఎక్కువ అవుతున్నా.. ఇప్పట్లో దర్శనాలు నిలిపే పరిస్థితి లేదని టీటీడీ ఛైర్మన్ వై.వీ. సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి రోజు రోజుకీ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనాలు నిలిపివేయాలని కోరినా… టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఒప్పుకోవడం లేదంటూ.. టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ట్వీట్ చేసిన కొన్ని గంటలకే… వైవీ సుబ్బారెడ్డి దర్శనాలపై స్పష్టత ఇచ్చారు. రమణ దీక్షితులు చెప్పాల్సింది ఏదైనా ఉంటే టీటీడీ బోర్డుకి చెప్పాలీ…

Read More