2018 సెప్టెంబర్ 16న జరిగిన VRO పరీక్ష ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ ఇవాళ విడుదల చేసింది. A, B, C, Dసెట్ల వారీగా కీని వెల్లడించింది. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు టీఎస్పీఎస్పీ వెబ్ సైట్ – tspsc.gov.in ద్వారా పంపవచ్చు. ఆ తర్వాత పంపే అభ్యంతరాలను ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించరు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత టీఎస్పీఎస్సీ తుది కీ ని విడుదల చేస్తుంది.
Click Below Link to Downlaod TSPSC VRO Preliminary Key
TSPSC – VRO – Preliminary – Key
700 వీఆర్వో పోస్టులకు 12 లక్షల మంది దరఖాస్తు చేయగా.. 70 శాతానికి పైగా పరీక్షకు హాజరయ్యారు. ప్రశ్నపత్రం కఠినంగా ఉన్నందున… అత్యధిక స్కోర్ 120 లోపే ఉండవచ్చని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. కటాఫ్ కూడా గత నోటిఫికేషన్ల కన్నా తక్కువగాన్ ఉండవచ్చని తెలుస్తోంది.