సంభోగ సమరంలో పులి బలి

అంతరించిపోతున్న జాతిని సంఖ్యాపరంగా వృద్ధిలోకి తేవాలన్న వ్యూహం బెడిసికొట్టింది. లండన్‌లోని జూలో సుమత్రన్ టైగర్ జాతికి చెందిన పులుల సంఖ్య పెంచేందుకు అధికారులు వాటి కలయికకు ఏర్పాటు చేశారు. అయితే ఆడమగ పులుల సంభోగ ప్రయత్నంసమరానికి దారితీసింది. అసిమ్ అనే ఏడేళ్ల మగపులి మేలు రకానికి చెందినది. మేటింగ్‌ ద్వారా సంతతిని పెంచేందుకు జూ అధికారులు మెలాటి అనే పదేళ్ల ఆడపులిని అసిమ్ ఎన్‌క్లోజర్‌కి పంపారు. కానీ అసిమ్ ఆ సమయంలో ఏ మూడ్‌లో ఉందోగానీ.. మెలాటిపై దాడి చేసింది. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు వాటిని విడదీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అసిమ్ దాడిలో మెలాటీ ప్రాణాలు కోల్పోయింది. దీంతో అసలుకే ఎసరొచ్చిందని గుర్తించిన అధికారులు ఉసూరుమన్నారు.

మెలాటి 2013లో 2 పిల్లలకు జన్మనిచ్చింది. అయితే అందులో ఒకటి ప్రమాదవశాత్తు చనిపోయింది. 2014లో 3 పిల్లలు పుట్టాయి. 2016లో మరో రెండు పిల్లలకు మెలాటి జన్మనిచ్చింది. ఇండోనేషియాలోని సుమత్రా అడవుల్లో సుమత్రన్ పులులు ఎక్కువగా ఉంటాయి. ఇటీవల కాలంలో వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటంతో IUCN వాటిని అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేర్చి.. సంరక్షణ చర్యలు తీసుకోవాలని అన్నిదేశాలను కోరింది.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments