జమ్ము కశ్మీర్ లో తీవ్రవాదుల సంఖ్య….. !!!!

భూతల స్వర్గం లాంటి కశ్మీరం ఉగ్రవాద భూత పిశాచ గణాల పద ఘట్టనల్లో ప్రత్యక్ష నరకంగా మారింది. లోయలో పాకిస్తాన్ ప్రేరేపిత వేర్పాటు వాద శక్తులు, వారికి తోడుగా ఉగ్రమూకలు సృష్టిస్తోన్న మారణకాండకు కశ్మీరం కుమిలిపోతోంది. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రవాది ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఇలాంటి ఘటనలతో మంచు ప్రాంతంలో రక్తపుటేరులు పారిస్తున్న ఉగ్రవాదులుస్థానికంగా ఉన్న యువతను తీవ్రవాదం వైపు మళ్లిస్తున్నారు. వారిని భారత సైన్యంపైకి ఉసిగొల్పుతున్నారు.

కశ్మీర్ లోయలో తీవ్రవాదుల ఏరివేతకు భారత సైన్యం అపరేషన్లు నిర్వహిస్తూనే ఉంది. అయినా.. జమ్ము కశ్మీర్ లో తీవ్రవాదుల సంఖ్య ఇంకా ఆందోళన కలిగించే స్థాయిలోనే ఉంది. జమ్ము కశ్మీర్ పోలీసు విభాగం ఈ ప్రాంతంలో 327 మంది తీవ్రవాదులు యాక్టివ్ గా ఉన్నట్లు గుర్తించింది. ఈ మేరకు 2018 చివరి నాటికి తమ వద్ద ఉన్న గణాంకాలను విడుదల చేసింది. ఇందులో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు 141 మంది, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన వారు 128, జైష్ ఏ మొహమ్మద్ సంస్థకు చెందిన తీవ్రవాదులు 60 మంది ఉన్నట్లు గుర్తించింది. ఈ మొత్తంలో ప్రాంతాల వారీగా విభజించి చూస్తేఉత్తర కశ్మీర్ లో 129 మంది.. దక్షిణ కశ్మీర్ లో 181, మధ్య కశ్మీర్ లో 17 మంది తీవ్రవాదులు యాక్టివ్ గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు జమ్ము కశ్మీర్ పోలీసు విభాగం గుర్తించింది. ఈ మేరకు గణాంకాలతో కూడిన గ్రాఫిక్ ఇమేజ్ ని ట్వీటర్ లో న్యూస్ 18 సంస్థ ట్వీట్ చేసింది.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments