సిద్ధిపేటకు ఎయిర్ పోర్ట్.. వాళ్లు ఒప్పుకుంటేనే ??

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల అభివృద్ధి పర్యటనల్లో వరాలు జాలువారుతాయి. జిల్లా మంత్రులు అడిగినవే కాకుండా అడగనివి కూడా మంజూరు చేస్తారు. గతంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల పర్యటనల మాదిరిగానే డిసెంబర్ 10న కేసీఆర్ సిద్ధిపేట పర్యటన సాగింది. తెలంగాణ రాష్ట్రానికి సిద్ధిపేట జిల్లాను బొడ్రాయిగా అభివర్ణించిన సీఎం.. హరీశ్ అడ్డాకి అనేక వరాలు ప్రకటించి వెళ్లారు. సిద్ధిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం తెస్తా అన్న వాగ్దానం.. చాలా మందిలో సాధ్యమేనా అనే సందేహాలు రేకెత్తించింది. ఎందుకంటే.. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ కే ఇప్పటి వరకు ఎయిర్ పోర్ట్ లేదు. ఇప్పుడు కొత్తగా సిద్ధిపేట పేరు తెరపైకి వచ్చి చేరింది. మరి వరంగల్, సిద్ధిపేట… ఈ రెండింట్లో దేనికి ముందుగా ఎయిర్ పోర్ట్ వస్తుంది ?? GMR ఒప్పుకుంటేనే .. !! తెలంగాణలో నిర్వహణలో…

Read More

రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ 20 – 20 !!

తనని ఎర్రమట్టి కోర్టుల రారాజు అని ఎందుకంటారో 34 ఏళ్ల రాఫెల్ నాదల్ మరోసారి నిరూపించారు. ఆదివారం పారిస్ లోని రొలాండ్ గారోస్ లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్ ను చిత్తుచేసిన ప్రపంచ నంబర్ టూ రాఫెల్ నాదల్.. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ని గెలిచాడు. తొలి రెండు సెట్లని సునాయసంగా దక్కించుకున్న స్పెయిన్ దిగ్గజ స్టార్ ( 6 – 0, 6 – 2 ).. హోరాహోరీగా జరిగిన మూడో సెట్లోను పైచేయి సాధించి 7 – 5 తో సెర్బియన్ స్టార్ జకోవిచ్ ని ఓడించాడు. ఈ విజయంతో నాదల్.. పురుషుల గ్రాండ్ స్లామ్ లో 20 టైటిల్స్ సాధించిన రోజరర్ ఫెదరర్ తో సమానంగా నిలిచాడు. నాదల్ కి ఇది…

Read More

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ – 2020 ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ – 2020 ఫలితాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎంసెట్ కు 2,73,588 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2,32,811 మంది పరీక్షకు హాజరు కాగా.. 2,02,682 ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతశాతం 87.05 శాతంగా నమోదైంది. ఇంజనీరింగ్‌ విభాగంలో 1,56,953 మందిలో 1,33,066 (84.78 శాతం), అగ్రి మెడికల్‌లో 75,858లో 69,616 (91.77 శాతం) క్వాలిఫై అయ్యారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడ్డ ఎంసెట్‌ను సెప్టెంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించారు. పరీక్షలకు హాజరుకాలేకపోయిన వారికి ఈసారి రెండోసారి ఎంసెట్‌ నిర్వహించారు. ఫలితాల కోసం ఈ కింద లింక్ క్లిక్ చేయండి AP EAMCET – 2020 RESULTS

Read More

సుశాంత్ కి ఏఆర్ రహమాన్ సంగీత నివాళి

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్ తోపాటు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంతో ప్రతిభ కలిగిన యువ నటుడు.. బలవన్మరణానికి పాల్పడటం ఆయన సన్నిహితులని శోక సంద్రంలో ముంచేసింది. స్నేహితులు, బంధువులు, అభిమానులు వివిధ రూపాల్లో సుశాంత్ కి నివాళులు అర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ .. తన బృందంతో కలిసి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి వర్చువల్ కన్సర్ట్ ద్వారా సంగీత నివాళి అర్పించారు. సుశాంత్, సంజనా సంఘీ జంటగా నటించిన దిల్ బేచారా చిత్రంలోని పాటలని ఏఆర్ రహమాన్, బాలీవుడ్ టాప్ సింగర్స్ తో కలిసి ఆలపించారు. టైటిల్ సాంగ్ ని ఏఆర్ రహమాన్.. కూతురు రహీమా రహమాన్, కొడుకు ఏఆర్ అమీన్, మరో సింగర్ హిరాల్ విరాడియాతో కలిసి ఆలపించారు. ప్రముఖ…

Read More

శ్రీవారి సన్నిధిలో 15 మంది అర్చకులకు కరోనా !

తిరుమల తిరుపతి దేవస్థానంలోని 50 మంది అర్చకుల్లో 15 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. మరో 25 మంది అర్చకుల ఫలితాలు రావాల్సింది ఉంది. దీంతో తితిదేలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన అర్చకులు, సిబ్బంది సంఖ్య 140కి చేరింది. అయితే.. కరోనా వైరస్ కేసులు ఎక్కువ అవుతున్నా.. ఇప్పట్లో దర్శనాలు నిలిపే పరిస్థితి లేదని టీటీడీ ఛైర్మన్ వై.వీ. సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి రోజు రోజుకీ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనాలు నిలిపివేయాలని కోరినా… టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఒప్పుకోవడం లేదంటూ.. టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ట్వీట్ చేసిన కొన్ని గంటలకే… వైవీ సుబ్బారెడ్డి దర్శనాలపై స్పష్టత ఇచ్చారు. రమణ దీక్షితులు చెప్పాల్సింది ఏదైనా ఉంటే టీటీడీ బోర్డుకి చెప్పాలీ…

Read More

కశ్మీర్ కల్లోలం.. ! కారణం, కారకులెవరు ? వికాసం విశ్లేషణ

జమ్ము కశ్మీర్.. ! భారత్ లో ప్రకృతి అందాల పరంగా భూతల స్వర్గం. శాంతి, భద్రత పరంగా చూస్తే మాత్రం నిత్యం రగులుతున్న కాష్టం. పాకిస్తాన్ సైన్యం ఓ వైపు, ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు మరోవైపు బరితెగించి జమ్ము కశ్మీర్ లో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. 1947లో మొదలైన ఈ విధ్వంసం… నేటికీ కొనసాగతోంది. కశ్మీర్ ప్రజలను నిత్యం అశాంతిలో, ఆందోళనలో, ఆవేదనలో బతుకులీడ్చేలా చేస్తోంది. ఈ మారణకాండలో వేలాది సైనికులు, సామాన్యులు సమిధలయ్యారు. భారత సైన్యం కంటిమీద కునుకులేకుండా జల్లెడపడుతూ తీవ్రవాదులను ఏరివేస్తున్నా… సరిహద్దులో గుంట నక్కలా కాచుకోని కూర్చున్న పాకిస్తాన్ కశ్మీర్ లో యువతను తీవ్రవాదం వైపు మళ్లిస్తు భారత్ పైకి ఉసిగొల్పుతోంది. పాకిస్తాన్ నిఘా సంస్థ ISI తోడ్పాటుతో జై షే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి కరుడుగట్టిన…

Read More

పవన్ కోసం పార్టీల పాకులాట ! “కాపు” కాసేది ఎవరో ?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం పూర్తిగా ఆవరించింది. ఏ నోట విన్నా.. జగన్ – పవన్ – బాబు. ఈ ముగ్గురు పేర్లు, వీరిలో ఎవరు ఎవరితో కలుస్తారు.. ఎవరిని ఎవరు దూరం పెడతారు అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ ప్రధాన పార్టీలుగా పోటీ పడుతుంటే.. జనసేన మాత్రం ప్రత్యామ్నాయం మేమే అంటూ దూసుకొస్తోంది. ఈ నెల చివరన, లేదా మార్చి తొలి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న అంచనాలతో.. పార్టీలు, బడా నేతలు సభలు, సమావేశాల హోరు పెంచారు. ముఖ్యంగా… అధికార, విపక్షాలు బల నిరూపణ కోసం బీసీ సభల పేరిట భారీ జనసందోహాన్ని సమీకరించి బలాబలాలను ప్రదర్శించుకున్నాయి. రాష్ట్రంలో బీసీ జనాభా అత్యధికం కావడంతో వారిపై వరాల వర్షం కురిపించిన రెండు పార్టీలు మరో బలమైన సామాజికవర్గం ఓట్ల కోసం కాపు…

Read More

జమ్ము కశ్మీర్ లో తీవ్రవాదుల సంఖ్య….. !!!!

భూతల స్వర్గం లాంటి కశ్మీరం ఉగ్రవాద భూత పిశాచ గణాల పద ఘట్టనల్లో ప్రత్యక్ష నరకంగా మారింది. లోయలో పాకిస్తాన్ ప్రేరేపిత వేర్పాటు వాద శక్తులు, వారికి తోడుగా ఉగ్రమూకలు సృష్టిస్తోన్న మారణకాండకు కశ్మీరం కుమిలిపోతోంది. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రవాది ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఇలాంటి ఘటనలతో మంచు ప్రాంతంలో రక్తపుటేరులు పారిస్తున్న ఉగ్రవాదులు… స్థానికంగా ఉన్న యువతను తీవ్రవాదం వైపు మళ్లిస్తున్నారు. వారిని భారత సైన్యంపైకి ఉసిగొల్పుతున్నారు. కశ్మీర్ లోయలో తీవ్రవాదుల ఏరివేతకు భారత సైన్యం అపరేషన్లు నిర్వహిస్తూనే ఉంది. అయినా.. జమ్ము కశ్మీర్ లో తీవ్రవాదుల సంఖ్య ఇంకా ఆందోళన కలిగించే స్థాయిలోనే ఉంది. జమ్ము కశ్మీర్ పోలీసు విభాగం ఈ ప్రాంతంలో 327 మంది తీవ్రవాదులు యాక్టివ్ గా ఉన్నట్లు గుర్తించింది. ఈ మేరకు…

Read More

కేసీఆర్ రాజ్యంలో తెలంగాణ బాహుబలి పరిస్థితేంటి..?

టీఆర్‌ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు తన్నీరు హరీశ్‌రావు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారీ తనదైన వ్యక్తిత్వ ప్రదర్శనతో తెలంగాణ ప్రజల్లో గులాబీ గూడు కట్టుకునేలా చేసిన ఘనత కచ్చితంగా హరీశ్‌రావుదే. ఆయనో అజాత శత్రువు. ఇతర పార్టీలు సైతం హరీశ్‌రావును రాజకీయంగా, వ్యక్తిత్వపరంగా విమర్శలు చేసేందుకు సిద్ధపడవు. అది ఆయన నిజాయతీ, నిబద్ధతకు నిదర్శనం. టీఆర్‌ఎస్‌ పార్టీని తెలంగాణ ఉద్యమాన్ని జనంలో నిత్యం నానేలా చేయడంలో కేసీఆర్‌కు రాజకీయంగా తోడు–నీడగా నిలిచిన హరీశ్‌రావుకు ఇప్పుడు ప్రాధాన్యం తగ్గిపోతోందనేది తెలంగాణ రాజకీయాలపై అవగాహన ఉన్న చిన్న కుర్రాడ్ని అడిగినా తడుముకోకుండా చెప్పగలరు. హరీశ్‌రావును ఫేడవుట్‌ చేయాలన్న ప్రయత్నం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. కేసీఆర్‌ తానుండగానే కొడుకు కేటీఆర్‌కు ఎలాంటి రాజకీయ ఇబ్బందులు లేకుండా చక్కదిద్దే ప్రయత్నంలోనే ఈ కార్యచరణకు దిగినట్లు హరీశ్‌ అభిమానులు…

Read More

అవంతి – గంటా. విశాఖలో ఎవరిది పై చేయి ?

విశాఖ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది ప్రత్యేక స్థానం. ఏపీ రాజకీయాల్లోనే గంటా అన్నా… ఆయన గ్యాంగ్ అన్నా… పార్టీలు వెల్ కమ్ బోర్డులతో పచ్చజెండా ఊపేస్తుంటాయి. రాష్ట్రస్థాయి రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో గంటా శ్రీనివాసరావు… తన సామర్థ్యాన్ని గుర్తుంచుకొని జిల్లాపై పూర్తి పట్టుసాధించే క్రమంలో అనుచరగణాన్ని పెంచుకున్నారు. తాను ఎటువెళ్తే అటు వచ్చే పరివారాన్ని తయారు చేసుకున్నారు. వారిలో ప్రథముడు అవంతి శ్రీనివాస్. టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఆయన అనుచరుడిగా ఎదిగిన అవంతి… తదుపరి ప్రజారాజ్యంలో అక్కడి నుంచి కాంగ్రెస్ మళ్లీ తిరిగి టీడీపీలో గంటా వెంటే నిలిచారు. కానీ ఏం లాభం మర్రి చెట్టు నీడలో మరో మొక్క ఎదగదన్నట్లు అయింది అవంతి పరిస్థితి. ఇది గుర్తించిన అవంతి శ్రీనివాస్ ఇక గంటా స్నేహానికి ఆఖరి గంట మోగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇవాళ…

Read More