తెలంగాణలో అడ్డగోలుగా… !!

తెలంగాణలో రసాయన ఎరువులు అడ్డగోలుగా వాడుతున్నారు. దేశంలో ఎకరాకు సగటున 51.2 కిలోల ఫర్టిలైజర్స్ వాడుతుంటే… తెలంగాణలో మాత్రం ఎకరానికి 185 కిలోలు వేస్తున్నారు. నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం (NPK) వాడకంలో అయితే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ చేసిన అధ్యయనంతో ఈ విషయాలు తెలిశాయి. 2016లో రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి 24 లక్షల టన్నుల ఎరువు వాడగా.. 2017లో 28.39 లక్షలకు పెరిగింది. ఇది కాస్తా 2019 నాటికి 35 లక్షల టన్నులకు చేరింది. 2020లో ఒక్క ఖరీఫ్ లోనే 23 లక్షల టన్నుల ఎరువులు రాష్ట్రానికి వచ్చాయి. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా.. రోజు రోజుకీ ఎరువుల వినియోగిం ఈ స్థాయిలో పెరగడం ఆందోళన కలిగించే…

Read More

రూ. 3 వేల నిరుద్యోగ భృతి.. ఎంప్లాయి మెంట్ కార్డే కీలకం !

వికాసం: అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండో దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్.. గతంలో లాగే జనాకర్షక పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి చెల్లించనుంది. ఆసరా పింఛన్ల పెంపుని 2019 ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. దీన్నిబట్టి చూస్తే.. నిరుద్యోగ భృతి పథకం కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచే మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అందిన సూచనలతో అధికారులు… పథకం విధివిధానాలు, లబ్ధిదారుల అర్హతలకు రూపకల్పన చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎవరిని అర్హులుగా నిర్ణయించాలి, ఏ ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలి అనే విషయాలపై కసరత్తు మొదలు పెట్టారు. ఈ పథకం కోసం ఇప్పటికే గ్రౌండ్…

Read More

TSPSC లో సంస్కరణలపై కేసీఆర్ నజర్… ???

వికాసం: రెండో దఫా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ముందు రోజుల్లో తాను చేయబోయే సంస్కరణలను చెప్పకనే చెప్పారు. డిసెంబర్ 12న టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అది నిరుద్యోగులకు సంబంధించినదే కావటంతో.. ఆసక్తి ఇంకా పెరిగింది. “ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నది మా కమిట్ మెంట్. ఇస్తాం. మేము ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సకాలంలో పూర్తి చేయలేకపోయింది. అగాధమైన కొన్ని పిచ్చి పిచ్చి పనులు పెట్టుకోని వాళ్లు చేయలే. మేం ఇచ్చిన నోటిఫికేషన్లు కంప్లీట్ చేయలే. అది కొంత మైనస్ కూడా అయ్యింది మాకు. అందుకే.. కొన్ని నోటిఫికేషన్లు టీఎస్పీఎస్సీ నుంచి తీసి డిపార్ట్ మెంట్లకు ఇచ్చినం. మీరే రిక్రూట్ మెంట్ చేయమని చెప్పి.” ఇవి ఇవాళ కేసీఆర్ మాటలు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. రానున్న…

Read More

కారుకి పాలమూరు ఓట్లాభిషేకం వయా… హరీశ్ !

వికాసం: మహబూబ్ నగర్…! తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న జిల్లా. పక్కనే కృష్ణా నది ఉన్నా.. కరువు, వలసలతో గోస పడే ప్రాంతం. ఇలాంటి చోట ప్రజల అంచనాలను అందుకోవడం ఏ ప్రభుత్వానికైనా కత్తి మీద సాము వంటిదే. ఈ సవాల్ ని బాధ్యతలా స్వీకరించిన కేసీఆర్ ప్రభుత్వం.. ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించి ఓట్ల రూపంలో దీవెనలను తిరిగి పొందింది. ఎన్నికలకు ముందు… చాలా మంది విశ్లేషిస్తూ… “మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ కు కష్టమే రా భయ్. ఒక్కో జిల్లాలో రెండు, మూడు సీట్లు గెలవడం కూడా కష్టమే” అన్నారు. మీడియాలో ఉన్న చాలా మంది మిత్రులు కూడా ఇదే విశ్లేషణ చేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తు.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 స్థానాల్లో 13 సీట్లను…

Read More

ఎగ్జిట్ పోల్స్ ను ఇలా లెక్కిస్తారు.. !

వికాసం : ఎన్నికల్లో కీలకం… పోలింగ్. ఈ తంతు ముగిశాక అన్ని పార్టీలు, రాజకీయ విశ్లేషకులు, పాలిటిక్స్ పై ఆసక్తి ఉన్న వారు ఆతృతగా ఎదురు చూసేది ఎగ్జిట్ పోల్స్ కోసమే. ప్రైవేట్ సంస్థలు, పత్రికలు, టీవీ ఛానళ్ల కోసం పనిచేసే సర్వే సంస్థలు… ఎగ్టిట్ పోల్స్ ను చేపడతాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో వివరిస్తూ విడుదల చేసే గణాంకాలు.. వాస్తవ ఫలితాలకు ముందస్తు అంచనా మాత్రమే. కాకపోతే.. అవి చాలా దగ్గరగా ఉంటాయని అనేక సార్లు రుజువైంది కూడా. నాణేనికి రెండో వైపు అన్నట్లు… ఎగ్జిట్ పోల్స్ తుది అంచనాలకు భిన్నంగా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఇలా… ఓటింగ్ జరిగిన రోజు… ఆయా సర్వే సంస్థల ప్రతినిధులు కొన్ని పోలింగ్ స్టేషన్లకు వెళతారు. అక్కడ ఓటు వేసిన వారిని…

Read More

మళ్లీ వీచేది “తెలంగాణమే”నా ?

వికాసం: తెలంగాణ లో ఇప్పుడు అందరి నోటా ఎగ్జిట్ పోల్స్ ముచ్చటే నడుస్తోంది. దాదాపు అన్ని సంస్థలు తెలంగాణలో మరోసారి అధికారం తెలంగాణ రాష్ట్ర సమితిదే అని తేల్చేశాయి. ఒక్క లగడపాటి తప్ప. దీంతో గులాబీ అనుచరులు అప్పుడే మస్తీలో మునిగితేలుతున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని( నేతృత్వంలోని అని గట్టిగా చెప్పలేని పరిస్థితి) ప్రజా కూటమి అధికారంపై పెట్టుకున్న ఆశలు అడి ఆశలే అని సర్వేలు నిర్మోహమాటంగా చెప్పేశాయి. సాధారణంగా దేశవ్యాప్తంగా గతంలో జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ను పరిగణలోకి తీసుకొని చూస్తే.. పోలింగ్ తర్వాత వెలువడే ముందస్టు రిజల్ట్స్ కాస్త వాస్తవానికి దగ్గరగా ఉంటాయని అనేక సార్లు రుజువైంది. మరి ఈ సారి కూడా తెలంగాణ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ తుది ఫలితానికి దగ్గరగా ఉంటాయా ? లేక ఢిల్లీ…

Read More