ప్రగతి భవన్ కు కేసీఆర్ – రైతుబంధుపై కీలక ఆదేశాలు !!

రెండు వారాలుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు.. ఇవాళ ప్రగతి భవన్ కి చేరుకున్నారు. రోజు రోజుకీ కరోనా తీవ్రత ఎక్కువ అవుతున్న పరిస్థితిలో.. వైద్య సదుపాయాలను సమీక్షిస్తూ ప్రజల్లో ధైర్యం నింపాల్సిన సీఎం.. ఫాం హౌస్ లో ఏం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. #WhereisKCR ట్యాగ్ తో ముఖ్యమంత్రి ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులతో ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. ఇద్దరు యువకులైతే ఏకంగా ప్రగతి భవన్ ముందు వేర్ ఈజ్ కేసీఆర్ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కోరుతు హై కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ పరిణామాల మధ్య తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలకు ఎండ్ కార్డ్ వేస్తూ.. రెండు వారాల…

Read More