సిద్ధిపేటకు ఎయిర్ పోర్ట్.. వాళ్లు ఒప్పుకుంటేనే ??

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల అభివృద్ధి పర్యటనల్లో వరాలు జాలువారుతాయి. జిల్లా మంత్రులు అడిగినవే కాకుండా అడగనివి కూడా మంజూరు చేస్తారు. గతంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల పర్యటనల మాదిరిగానే డిసెంబర్ 10న కేసీఆర్ సిద్ధిపేట పర్యటన సాగింది. తెలంగాణ రాష్ట్రానికి సిద్ధిపేట జిల్లాను బొడ్రాయిగా అభివర్ణించిన సీఎం.. హరీశ్ అడ్డాకి అనేక వరాలు ప్రకటించి వెళ్లారు. సిద్ధిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం తెస్తా అన్న వాగ్దానం.. చాలా మందిలో సాధ్యమేనా అనే సందేహాలు రేకెత్తించింది. ఎందుకంటే.. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ కే ఇప్పటి వరకు ఎయిర్ పోర్ట్ లేదు. ఇప్పుడు కొత్తగా సిద్ధిపేట పేరు తెరపైకి వచ్చి చేరింది. మరి వరంగల్, సిద్ధిపేట… ఈ రెండింట్లో దేనికి ముందుగా ఎయిర్ పోర్ట్ వస్తుంది ?? GMR ఒప్పుకుంటేనే .. !! తెలంగాణలో నిర్వహణలో…

Read More

ఖమ్మం లోక్ సభ సీటుపై కాంగ్రెస్ వృద్ధ నేతల నజర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవాతో కాంగ్రెస్ కాకలు తీరిన నేతలందరూ కొట్టుకుపోయారు. గులాబీ దళాధిపతి వేసిన పద్మవ్యూహంలో ఇరుక్కున్న చేయి నలిగిపోయింది. శాసనసభ ఎన్నికల్లో చతికిలపడ్డ హస్తం నేతలు…. సార్వత్రిక ఎన్నికల్లో ఉనికి కాపాడుకునేందుకు తాపత్రయపడుతున్నారు. తాజా ఎన్నికల ఫలితాల్లో సీనియర్ నేతలు సైతం మట్టికరవడంతో మోహం చూపించుకోలేక ఇళ్లకే పరిమితమయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచినవారిలో రాష్ట్రవ్యాప్తంగా తెలిసిన మోహాలు తక్కువే. కేవలం రిజర్వ్ డ్ స్థానాల్లోనే కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని చూపింది. మిగతా స్థానాల్లో అత్తెసరు మెజారిటీతో గట్టెక్కింది. ముఖ్యంగా గిరిజన, ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో గెలుపు హస్తం పార్టీకి అభయహస్తంలా నిలిచిందనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా పూర్వ ఖమ్మం జిల్లాలోనే కాంగ్రెస్ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడంతో… సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ ఎంపీ స్థానంపై కాంగ్రెస్ వృద్ధనేతల కన్నుపడింది. అక్కడైతే సులువుగా…

Read More

సింగరేణి గర్భంలో మహిళలు సైతం సై

మహిళలు ఆకాశంలో సగం అన్నది పాత మాట. అవకాశాల్లో సగం అన్నది నేటి మాట. అతివలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆకాశంలో, నీటిలో రాణి రుద్రమ వలే సైన్యంలో పోరాడుతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టసవరణతో మహిళలు.. భూగర్భంలోను అడుగు పెట్టేందుకు వీలు కలిగింది. మహిళలను భూగర్భ మైనింగ్ లోకి నిషేధించిన 1952 మైన్స్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరించింది. దీంతో దాదాపు 67 ఏళ్ల తర్వాత భూగర్భ మైనింగ్ లో మహిళలు కూడా విధులు నిర్వహించే అవకాశం లభించింది. అలాగే వారు కావాలంటే నైట్ షిఫ్ట్ లను కూడా ఎంచుకునే స్వేచ్ఛ కల్పించింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సవరణలను అమలు చేసిన ఘనతను తెలంగాణలోని సింగరేణి సంస్థ సొంతం చేసుకోనుంది. చట్ట సవరణ ద్వారా తీసుకొచ్చిన కొత్త…

Read More