జన్ ధన్ ఓవర్ డ్రాఫ్ట్ రూ.10 వేలకు పెంపు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకం కింద ప్రస్తుతం రూ.5 వేల పరిమితితో ఉన్న ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 5న ప్రకటించింది. అలాగే పథకానికి అర్హతకు గరిష్ట వయసుని 60 నుంచి 65 ఏళ్ల పెంచారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. పథకానికి మంచి ఆదరణ లభిస్తుందన్నందున.. కొనసాగించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. రూ. 2 వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ పొందేందుకు ఎలాంటి షరతులు ఉండవని వివరించారు. ఇవీ జన్ ధన్ లెక్కలు జన్ ధన్ యోజన కింద నాలుగేళ్లలో 32.41 కోట్ల ఖాతాలు తెరిచారు. వీటిలో రూ.81,200 కోట్ల…
Read More