కేసీఆర్ రాజ్యంలో తెలంగాణ బాహుబలి పరిస్థితేంటి..?

టీఆర్‌ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు తన్నీరు హరీశ్‌రావు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారీ తనదైన వ్యక్తిత్వ ప్రదర్శనతో తెలంగాణ ప్రజల్లో గులాబీ గూడు కట్టుకునేలా చేసిన ఘనత కచ్చితంగా హరీశ్‌రావుదే. ఆయనో అజాత శత్రువు. ఇతర పార్టీలు సైతం హరీశ్‌రావును రాజకీయంగా, వ్యక్తిత్వపరంగా విమర్శలు చేసేందుకు సిద్ధపడవు. అది ఆయన నిజాయతీ, నిబద్ధతకు నిదర్శనం.

టీఆర్‌ఎస్‌ పార్టీని తెలంగాణ ఉద్యమాన్ని జనంలో నిత్యం నానేలా చేయడంలో కేసీఆర్‌కు రాజకీయంగా తోడునీడగా నిలిచిన హరీశ్‌రావుకు ఇప్పుడు ప్రాధాన్యం తగ్గిపోతోందనేది తెలంగాణ రాజకీయాలపై అవగాహన ఉన్న చిన్న కుర్రాడ్ని అడిగినా తడుముకోకుండా చెప్పగలరు. హరీశ్‌రావును ఫేడవుట్‌ చేయాలన్న ప్రయత్నం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. కేసీఆర్‌ తానుండగానే కొడుకు కేటీఆర్‌కు ఎలాంటి రాజకీయ ఇబ్బందులు లేకుండా చక్కదిద్దే ప్రయత్నంలోనే ఈ కార్యచరణకు దిగినట్లు హరీశ్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు.

హరీశ్‌రావు ప్రాధాన్యత తగ్గించేందుకు ఆయన్ను కొన్ని ప్రాంతాలకే లేదా కొన్ని వర్గాలకే పరిమితం చేస్తూ వచ్చినాఆయన అభిమానగణం ఆయన్ను బాహుబలి రేంజ్‌లో అన్ని వర్గాలకు చేరువచేశారు. టీఆర్ఎస్‌ పార్టీ కేవలం కేటీఆర్‌ నాయకత్వంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ముందుకు పోవడంతోనే ఈ అనుమానాలకు బలం చేకూరింది. ఆ విజయం కేటీఆర్‌ ప్రతిష్ఠ పెంచినా హరీశ్‌రావు అభిమానగణాన్ని తగ్గించలేకపోయింది. తదుపరి వచ్చినా కొన్ని స్థానాల్లోని ఉప ఎన్నికల్లోనూ కేటీఆర్‌ కనుసన్నల్లోనే కార్యచరణ చేసి విజయం సాధించి మీడియాలో కేటీఆర్‌ను బాహుబలిగా చూపించినాఅసలుసిసలు అభిమానగణం ఉన్న బాహుబలిగా హరీశ్‌రావు ఎదుగుతూ వచ్చారు. విపక్షాలు టీఆర్‌ఎస్‌పై విమర్శలతో విరుచుకుపడినా హరీశ్‌రావును పల్లెత్తు మాటకూడా అనలేకపోయేవారు. ఆయన వ్యవహారశైలి అలా ఉండటమే అందుకు కారణం. దీంతో తెలంగాణ ప్రజల్లో అజాతశత్రువుగా, బాహుబలిలా హరీశ్‌ ప్రతిష్ట పెరిగిపోయింది. దీన్ని తగ్గించి కేటీఆర్‌ను మరోసారి లిఫ్ట్‌ చేసే క్రమంలో కొంగరకలాన్‌ సభను ఏర్పాటుచేసినాఅది టీఆర్‌ఎస్‌ సభల చరిత్రలోనే యావరేజ్‌ ఓ రకంగా చెప్పాలంటే అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచిందని ప్రతిపక్షాల ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరీశ్ కొంచెం అంటీముట్టన్నట్లు వ్యవహరించారు. అయితే ఆవశ్యకతను గుర్తించిన కేసీఆర్అల్లుడిని పిలిచి మాట్లాడిన పరిస్థితిని చక్కదిద్దారు. ట్రబుల్ షూటర్ అన్న బిరుదుని సార్థకం చేసేలా కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించారు. డీకే అరుణ, రేవంత్ రెడ్డి వంటి నేతలను మట్టికరిపించారు. అయితేపార్టీ అధికారంలోకి వచ్చిన తదుపరి హరీశ్‌ కు ఇస్తున్న ప్రాధాన్యంలో ఆయన అభిమానులెవరూ సంతృప్తిగా లేరన్నది వాస్తవం. ఈ అంశంపై హరీశ్‌రావులో ఎలాంటి వ్యతిరేకత లేకున్నా తెలంగాణలో, టీఆర్‌ఎస్‌లో ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించడాన్ని హరీశ్‌ వర్గం జీర్ణించుకోలేకపోతోంది. కేసీఆర్‌ ఇప్పటికే పార్టీని కేటీఆర్‌కు అప్పగించిగా ఆయన తన అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. భవిష్యత్తులో హరీశ్‌వర్గం ఏకులో మేకై కూర్చుంటుందనే భావనతో ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హరీశ్‌రావుకు పార్టీ పరంగా ఎలాంటి పదవులు లేకపోయినా ఇప్పుడు ప్రభుత్వంలోనూ స్థానమివ్వకూడదని కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలి మంత్రివర్గ విస్తరణలో హరీశ్‌ పేరు లేదని లీకులు ఇచ్చి వ్యతిరేకత వస్తుందా రాదా అని కేసీఆర్‌ అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే పత్రికల్లో వార్తలు రావడం హరీశ్‌ ప్రాధాన్యం తగ్గిపోతోందనేదానికి నిదర్శనమైనా పూర్తిస్థాయిలో వ్యతిరేకత రాకపోవడంతో ఇప్పుడు జరిగే మంత్రివర్గ విస్తరణలో హరీశ్‌రావుకి అమాత్య పదవి లేదని లీకులు స్పష్టం చేస్తున్నాయి. ఇదే జరిగితే హరీశ్‌కు తీవ్ర అన్యాయం జరిగనట్లే అని ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments