టీ బీజేపీలో బండి వర్సెస్ ఈటల, రఘునందన్ ??

తెలంగాణలో బీజేపీ అంటే గతంలో దత్తాత్రేయ, ఇంద్ర సేనారెడ్డి, కిషన్ రెడ్డి, రాజా సింగ్, లక్ష్మణ్ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపించేవి. కానీ ఇప్పుడు తెలంగాణ బీజేపీ అంటే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్, సెంటర్ ఆఫ్ రెగ్యులేషన్ మొత్తం బండి సంజయ్ అన్నట్లే నడుస్తోంది వ్యవహారం. సీనియర్ లీడర్లను సైతం కాదని, అంతా తన మీదుగానే నడవాలని బండి భావిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం సందర్భంగా ఈ రోజు ( ఏప్రిల్ 14 ) ప్రధాన దినపత్రికలకు తెలంగాణ బీజేపీ పేరుతో ప్రకటనలు జారీ అయ్యాయి. అందులో బండి సంజయ్ ఫోకస్డ్ గామోదీ, అమిత్ షా, పార్టీ చీఫ్ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోపాటు రాష్ట్ర బీజేపీ నాయకులైన డీకే అరుణ, లక్ష్మణ్, రాజాసింగ్ ఫోటోలు వేశారు. ఈ ప్రకటనే ఇప్పుడు టీ బీజేపీలో అంతా సవ్యంగా లేదని చెప్పకనే చెప్పింది.

తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్ ఇప్పుడు కీలక నేత. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నించినా, అక్కడ కమలం పార్టీ గెలిచిందంటే, ఈటల పట్ల అక్కడి ప్రజలకు ఉన్న అభిమానం అలాంటిది. అలాగే దుబ్బాకలో రఘునందన్ రావు కూడా ఇలాగే సొంత ఇమేజ్ కి పార్టీ సింబల్ తోడై గెలిచారు. వీరిద్దరూ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులు. రాజకీయ వేదికగా తెలంగాణ పోరాటంలో కీలకంగా పాల్గొన్న వారు. తెలంగాణ ఉద్యమ కారులు ఏ పార్టీలో ఉన్నా ఈ ఇద్దరు నేతలపై అభిమానం చూపిస్తారు. అలాంటి నాయకులు ఇప్పుడు కాషాయ దళంలో ఉన్నా.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎందుకు వారిని దూరం పెట్టాలని చూస్తోంది అనేదే ఇప్పుడు అందరిలో పెద్ద డౌట్. ప్రజా సంగ్రామ యాత్ర పేరుటో అంత పెద్ద ప్రకటనలు ఇచ్చి.. అందులో ఈటల రాజేందర్, రఘునందన్ ల ఫోటో లేకపోవడం చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ లో ఉద్యమ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్ అన్నట్లుగానేఇప్పుడు బీజేపీలో కూడా భారత్ మాతాకి జై అనే బ్యాచ్, జై తెలంగాణ బ్యాచ్ వేర్వేరు అన్నట్లుగానే వ్యవహారం నడుస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసే వారికే సీట్లు వస్తాయని ఇటీవల బండి సంజయ్ వ్యాఖ్యానించడంపార్టీ అధ్యక్షులు తమకు సమాచారం ఇవ్వడం లేదని రఘునందన్ అసంతృప్తి వ్యక్తం చేయడంఇప్పుడు బండి యాత్రకు సంబంధించిన పేపర్ ప్రకటనల్లో ఈటల, రఘునందన్ ఫోటో లేకపోవడం చూస్తుంటేబీజేపీలో ఇంటి పోరు గట్టిగానే నడుస్తోందనిపిస్తోంది. మరి ఇది ఇంకా ముదురుతుందా ? లేక అధిష్టానం కలగజేసుకుని సంధి కుదుర్చుతుందా అనేది చూడాలి !!

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments