ఈ యోధుడు “తెలంగాణ ట్వల్వ్” ఎలా అయ్యారు ?

వీరులు అస్తమిస్తారు. వారు పంచిన విప్లవ భావాలు, ధైర్య సాహసాలు మాత్రం నిత్యం వెలుగుతూ ఎందరిలోనో స్ఫూర్తి రగిలిస్తూనే ఉంటాయి. అలాంటి ఎందరో పోరాట యోధులని కన్నది తెలంగాణ గడ్డ. స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టి ఉరికంబం దాకా వెళ్లిన సాహసి, ‘తెలంగాణ ట్వల్వ్‌’ కేసులో ఒకరైన గార్లపాటి రఘుపతిరెడ్డి.. తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ ధీరుల్లో ఒకరు. ఆ పోరాట యోధుడు ఇప్పుడు లేరు. రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ సమస్యతో రెండు రోజులుగా మంచానికే పరిమితమైన ఆయన.. నల్లగొండ జిల్లా రామానుజపురంలోని స్వగృహంలో జూలై 26న సాయంత్రం కన్నుమూశారు. ఆయన భార్య శకుంతల 35 ఏళ్ల క్రితమే మృతిచెందారు. ఈ దంపతులకు నర్మద, నరోత్తంరెడ్డి, విజయకుమార్‌ రెడ్డి సంతానం. గ్రామ వతందార్‌ (గ్రామ పోలీస్‌ పటేల్‌) కుటుంబంలో జన్మించిన రఘుపతి రెడ్డి.. నారాయణగూడ,…

Read More