ఎన్నికల వేళ వైసీపీలోకి వలసలు టీడీపీకి లాభమా నష్టమా… ?

మొన్న మేడా మల్లికార్జున రెడ్డి, నిన్న ఆమంచి కృష్ణమోహన్, నేడు అవంతి శ్రీనివాస్… ఇలా అధికార టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి. ఎన్నికల వేళ జంప్ జిలానీల సంఖ్య పెరగడం సహజమైనా వరసబెట్టి అధికార పార్టీ నుంచి విపక్షానికి నేతలు వరస కడుతుండటం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరసగా 23 మంది ఎమ్మెల్యేలు జగన్ పార్టీని వీడి సైకిల్ సవారీ చేయగా… ఇప్పుడు టీడీపీ నుంచి ఫ్యాన్ కిందకు చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు ప్రధానంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఓ ఎంపీ అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకోగా… ఈ లిస్టు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయా పార్టీల నేతలు స్పష్టంచేస్తున్నారు. ఉత్తరాంధ్రలో గంటా గ్యాంగ్ గా ఎదిగిన అవంతి శ్రీనివాస్ ఇప్పుడు ఆయన…

Read More

బాబు ధర్మ పోరాట దీక్ష ఖర్చెంతో తెలుసా.. ?

మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ టూ ఢిల్లీ రాజకీయాలు మొత్తం ప్రత్యేక హోదా చుట్టే తిరుగుతున్నాయి. ఏపీలో ప్రత్యేక హోదా నినాదం ద్వారా మైలేజ్ పొందేందుకు బాబు, జగన్, పవన్ లు ముగ్గురు పోటీ పడుతున్నారు. ఎలాగో అధికారంలో ఉన్నారు కాబట్టి.. తమ నినాదాన్ని కాస్త గట్టిగా వినిపించే అవకాశం చంద్రబాబు అండ్ కో టీమ్ కి లభించింది. వాళ్ల ప్లాన్ లో భాగంగానే ఫిబ్రవరి 11న చంద్రబాబు అండ్ టీమ్, అయ్యో.. సారీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్ష చేపట్టింది. కేవలం పార్టీ, నేతలు, ప్రజా ప్రతినిధులు ఉంటే సరిపోదు కదా. అందుకే ఏపీ నుంచి ప్రజల్ని(అంతా టీడీపీ కార్యకర్తలే అన్నది విపక్షాల…

Read More

మళ్లీ వీచేది “తెలంగాణమే”నా ?

వికాసం: తెలంగాణ లో ఇప్పుడు అందరి నోటా ఎగ్జిట్ పోల్స్ ముచ్చటే నడుస్తోంది. దాదాపు అన్ని సంస్థలు తెలంగాణలో మరోసారి అధికారం తెలంగాణ రాష్ట్ర సమితిదే అని తేల్చేశాయి. ఒక్క లగడపాటి తప్ప. దీంతో గులాబీ అనుచరులు అప్పుడే మస్తీలో మునిగితేలుతున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని( నేతృత్వంలోని అని గట్టిగా చెప్పలేని పరిస్థితి) ప్రజా కూటమి అధికారంపై పెట్టుకున్న ఆశలు అడి ఆశలే అని సర్వేలు నిర్మోహమాటంగా చెప్పేశాయి. సాధారణంగా దేశవ్యాప్తంగా గతంలో జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ను పరిగణలోకి తీసుకొని చూస్తే.. పోలింగ్ తర్వాత వెలువడే ముందస్టు రిజల్ట్స్ కాస్త వాస్తవానికి దగ్గరగా ఉంటాయని అనేక సార్లు రుజువైంది. మరి ఈ సారి కూడా తెలంగాణ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ తుది ఫలితానికి దగ్గరగా ఉంటాయా ? లేక ఢిల్లీ…

Read More