Daily Current Affairs – September 29 – 2018

☛ CCS ఆర్థిక స్వేచ్ఛా సూచీలో భారత్ కు 96వ స్థానం సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ(CCS), కెనడా ఫ్రేసర్ ఇన్సిస్టిట్యూట్ లు సంయుక్తంగా విడుదల చేసిన ఆర్థిక స్వేచ్ఛా సూచీ(Economic Freedom Index)-2018 లో భారత్ 96వ స్థానంలో నిలిచింది. 162 దేశాల ర్యాంకింగ్స్ తో ఈ సూచీ విడుదలైంది. హాంకాంగ్ తొలి స్థానంలో నిలవగా, సింగపూర్ రెండో స్థానంలో నిలిచింది. 2017కు సంబంధించి ఇదే నివేదికలో భారత్ కు 98వ స్థానం దక్కింది. ☛ విజయ్ పాటిల్ కు లతా మంగేష్కర్ అవార్డు – 2018 మహారాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక “లతా మంగేష్కర్ అవార్డు” 2018కి ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్ పాటిల్ ఎంపికయ్యారు. రామ్ – లక్ష్మణ్ గా ప్రసిద్ధి చెందిన ద్వయంలో విజయ్ పాటిల్ లక్ష్మణ్ గా గుర్తింపు పొందారు.…

Read More

Daily Current Affairs – September 28 – 2018

☛ హైదరాబాద్ కు “యాంథెమ్” సంస్థ వైద్య రంగంలో అత్యాధునిక సదుపాయాల కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ సంస్థ వస్తోంది. అమెరికాలోని ఇండియానా పోలీస్ కేంద్రంగా హెల్త్ కేర్ సేవలు అందిస్తోన్న “యాంథెమ్” సంస్థ హైదరాబాద్ లో తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీని ద్వారా 2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. ☛ జీహెచ్ఎంసీకి జాతీయ పర్యాటక అవార్డు నగరంలో పర్యాటక ప్రాంతాల్లో ఉత్తమ పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి వసతి, రోడ్ల విస్తరణ తదితర కార్యక్రమాల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ – జీహెచ్ఎంసీ 2016-17 సంవత్సరానికి జాతీయ పర్యాటక పురస్కారం దక్కించుంది. ఈ మేరకు సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర పర్యాటక శాఖ న్యూఢిల్లీలో అవార్డులు ప్రదానం చేసింది. ☛…

Read More

Daily Current Affairs – September 27 – 2018

☛ ఆధార్ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఆధార్ రాజ్యాంగ బద్ధమే అని పేర్కొంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సెప్టెంబర్ 26న చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దీని ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందన్న వాదనలో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు 12 సంకెల ఆధార్ నంబర్ ను కొన్ని సేవలకు మాత్రమే తప్పనిసరి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 తో 1,442 పేజీల కీలక తీర్పు వెలువరించింది. ధర్మాసనంలో ఇదర సభ్యులు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఖన్విల్కర్. తీర్పులోని ముఖ్యాంశాలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి ఆదాయ పన్ను దాఖలు, పాన్ నెంబర్ కు ఆధార్ తప్పనిసరి ప్రభుత్వం నుంచి…

Read More

Daily Current Affairs, MCQs, September 20 – 2018

☛ “ట్రిపుల్ తలాక్” ను నిషేధిస్తూ ఆర్డినెన్స్ ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 19న ఆమెదం తెలిపింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దీనిపై సంతకం చేయటంతో వెంటనే ఆర్డినెన్స్ జారీ అయ్యింది. దీని ప్రకారం ముస్లింలకు తక్షణ విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పాల్పడే భర్తకు 3 ఏళ్ల వరకు జైలు శిక్షను ప్రతిపాదించారు. 2017 ఆగస్టు 22న సుప్రీం కోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేంద్రం ట్రిపుల్ తలాక్ బిల్లుని తీసుకొచ్చింది. ఇది లోక్ సభ ఆమోదం పొంది.. రాజ్యసభలో పెండింగ్ లో ఉంది. తక్షణ ట్రిపుల్ తలాక్ ను భారత్ సహా 22 దేశాలు నిషేధించాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్గనిస్తాన్ లో కూడా…

Read More

Download Current Affairs PDF – Weekly – September 1 – 7 , 2018

 పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం టీమ్ వికాసం రోజూ వారి కరెంట్ అఫైర్స్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను అందిస్తోంది. వీక్లీ, మంత్లీ వారీగా కేటగరైజ్ చేసి అందుబాటులో ఉంచుతోంది. చదువుకోడానికి వీలుగా వెబ్ సైట్ లో పొందుపరటంతో పాటు డౌన్ లోడ్ ఆప్షన్ కూడా కల్పిస్తోంది. ఫైల్ రూపంలో వీక్లీ కరెంట్ అఫైర్స్ కావాల్సిన వారు ఈ కింది లింక్ ను క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు – Team Vikaasam Vikaasam_Sep 1-7_Current Affairs

Read More

Daily Current Affairs–MCQs-September 17, 2018

పీఎస్ఎల్వీ – సీ42 ప్రయోగం విజయవంతం నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని షార్ కేంద్రం ప్రథమ ప్రయోగ వేదిక నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ISRO చేపట్టిన పీఎస్ఎల్వీ – సీ 42 ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో విజయాల రాకెట్ గుర్తింపు సాధించిన పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(PSLV) 889 కిలోల బరువున్న 2 బ్రిటన్ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. క్లుప్తంగా రాకెట్ పేరు – పీఎస్ఎల్వీ సీ – 42 ఎత్తు – 44. 4 మీటర్లు బరువు – 230.4 టన్నులు ఉపగ్రహాలు నోవాసర్ ఎస్ : 455 కిలోలు ఎస్ 1 – 4 : 444 కిలోలు ఈ ప్రయోగంతో ఇస్రో ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 239 కి చేరింది. వీటిలో…

Read More

Daily Current Affairs–MCQs-September 14, 15 – 2018

మానవాభివృద్ధి సూచీలో భారత్ కు 130వ స్థానం ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం(USDP) సెప్టెంబర్ 14న విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచీ– 2018లో భారత్ 130వ స్థానంలో నిలిచింది. 189 దేశాల ర్యాంకింగ్స్ తో యూఎస్ డీపీ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో నార్వే, 2వ స్థానంలో స్విట్జర్లాండ్, 3వ స్థానంలో ఆస్ట్రేలియా, 4వ స్థానంలో ఐర్లాండ్, 5వ స్థానంలో జర్మనీ నిలిచాయి. తాజా ర్యాంకింగ్స్ లో బంగ్లాదేశ్ 136వ స్థానంలో, పాకిస్తాన్ 150వ స్థానంలో నిలిచాయి. 2017 ర్యాంకింగ్స్ లో భారత్ కు 131వ స్థానం దక్కింది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నంబర్ – 1 హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. విమాన సేవల నాణ్యతలో ప్రపంచ వ్యాప్తంగా తొలి స్థానంలో…

Read More

Daily Current Affairs–MCQs-September 7, 2018

తెలంగాణ శాసనసభ రద్దు తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ రద్దయింది. నిర్ణీత కాల వ్యవధి కన్నా 8 నెలల 26 రోజుల ముందే ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు శాసనసభ రద్దుకి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రిమండలిలో చేసిన తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్ కు అందజేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 క్లాజ్ 2(బీ) అనుసరించిన గవర్నర్ శాసనసభను రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు గవర్నర్ నోటిఫికేషన్ ను ప్రస్తావిస్తు గెజిట్ జారీ చేశారు. ఎన్నికలు జరిగి, తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. రాష్ట్రంలో నిర్ణీత కాలం ప్రకారం 2019 ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉండగా… టీఆర్ఎస్ అధ్యక్షుడు కే.చంద్రశేఖర్ రావు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ముందుగానే…

Read More