Daily Current Affairs, January 5, 2019

☛ పాక్ లో పురాతన హిందూ దేవాలయానికి అరుదైన గుర్తింపు పాకిస్తాన్ లోని పెశావర్ లో ఉన్న పంచ్ తీర్థ్ దేవస్థానాన్ని చారిత్రక జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపు లభించింది. పాకిస్తాన్ లోని కైబర్ పక్ తున్క్వా ప్రావిన్స్ ప్రభుత్వం ఈ మేరకు దేవాలయాన్ని చారిత్రక వారసత్వ సంపదగా ప్రకటించింది. కేపీ ఆంక్విటీస్ యాక్ట్ 2016 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దేవాలయం వద్ద 5 చిన్నపాటి సరస్సలు ఉన్నాయి. అందుకే పంచ్ తీర్థ్ అనే పేరు వచ్చింది. మహాభారతం ప్రకారం పాండు రాజు ఈ ప్రాంతానికి చెందిన వారు. కార్తీక మాసంలో ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించేందుకు అనేక మంది భక్తులు వచ్చే వారట. ☛ తెలంగాణ నీటిపారుదల శాఖకు CBIP అవార్డు తెలంగాణ రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖకు ప్రతిష్టాత్మక సెంట్రల్…

Read More

Download September 2018 Current Affairs – E – Magazine

కరెంట్ అఫైర్స్.. ! ప్రతి పోటీ పరీక్షలో ఈ విభాగం చాలా కీలకం. కనీసం పది నుంచి 15 ప్రశ్నలు వర్తమాన వ్యవహారాల నుంచి వస్తాయి. వస్తున్నాయి. ఇటీవల ప్రశ్నలు అడిగే విధానం చాలా మారింది. ఈ నేపథ్యంలో.. కాంపెటిటివ్ పరీక్షలు రాసే అభ్యర్థులకు మేలైన మెటీరియల్ ను ఉచితంగా అందించేందుకు Vikaasam తనవంతుగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కరెంట్ అఫైర్స్ E – Magazine ని మీ ముందుకు తెస్తోంది. తొలి ప్రయత్నంగా సెప్టెంబర్ ఈ – మ్యాగజైన్ ని ఉచితంగా డౌన్ లోడు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ కింది లింక్ ని క్లిక్ చేసి పీడీఎఫ్ కాపీని డౌన్ లోడ్ చేసుకోండి September – 2018 Current Affairs E – Magazine PDF

Read More

Monthly Current Affairs – September – 2018 – Science and Technology

సెప్టెంబర్ – సైన్స్ అండ్ టెక్నాలజీ ☛ రైళ్లలో భద్రతకు ‘రైల్‌ సురక్ష’ యాప్‌ రైలు ప్రయాణికులకు ఎదురయ్యే భద్రతా పరమైన సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం ‘రైల్‌ సురక్ష’ పేరుతో రైల్వే శాఖ మొబైల్‌ యాప్‌ను సెప్టెంబర్‌ 2న రూపొందించింది. ఈ యాప్‌ను సెంట్రల్‌ రైల్వే పరిధిలోని దూరప్రాంత, లోకల్‌ రైలు ప్రయాణికులకు సెప్టెంబర్‌ చివర నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రయాణికులు సురక్ష యాప్‌లో పెట్టిన సమస్య ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌లో ఉన్న కంట్రోల్‌ రూం(182)కు చేరుతుంది. ఫిర్యాదు వచ్చిన వెంట‌నే కంట్రోల్‌ రూం సిబ్బంది రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్‌)లేదా గవర్నమెంట్‌ రైల్వే పోలీస్‌ (జీఆర్‌పీ)లను అప్రమత్తం చేసి ఫిర్యాదు దారుడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. ☛ గాల్లోనే ఇంధనం – తేజస్ మరో ఘనత పూర్తి దేశీయ పరిజ్ఞానంతో…

Read More

Monthly Current Affairs – September – 2018 – Persons in News

సెప్టెంబర్ – వార్తల్లో వ్యక్తులు ☛ IBA చైర్మన్ గా సునీల్ మెహతా 2018-19 కాలానికి గాను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) చైర్మన్‌గా పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డెరైక్టర్ సునీల్ మెహతా ఎంపికయ్యారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ దీనబంధు మొహపాత్ర ఐబీఏ డిప్యూటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఐబీఏ డిప్యూటీ చైర్మన్లుగా ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ ఉన్నారు. ఐబీఏ.. భారత బ్యాంకులు, ఆర్థిక సంస్థల సంఘం. దీనిని 1946 సెప్టెంబర్ 26న ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం ముంబైలో ఉంది. ప్రస్తుతం ఐబీఏలో 237 మంది సభ్యులు ఉన్నారు. ☛“ఎ ఇయర్ ఇన్ ఆఫీస్” పుస్తక ఆవిష్కరణ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రచించిన “మూవింగ్ ఆన్, మూవింగ్ ఫార్వర్డ్: ఎ ఇయర్ ఇన్…

Read More

Monthly Current Affairs – September – 2018 – Awards

సెప్టెంబర్ – అవార్డులు ☛ డా.బీ.కే. మిశ్రాకు బీ.సీ.రాయ్ జాతీయ అవార్డు – 2018 ముంబైకి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ బీ.కే. మిశ్రా.. ప్రతిష్టాత్మక డాక్టర్ బీ.సీ. రాయ్ జాతీయ అవార్డు – 2018 ఎంపికయ్యారు. ఎమినెంట్ మెడికల్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ కింద ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2019 జూలై 1న వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ మిశ్రా.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుని అందుకుంటారు. · బీసీ రాయ్ అవార్డు.. భారత వైద్య రంగంలో అందించే అత్యున్నత పురస్కారం. · బీసీ రాయ్ అవార్డుని 1976లో భారతీయ మెడికల్ కౌన్సిల్ నెలకొల్పింది. · ప్రముఖ వైద్యుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ పేరిట ఈ అవార్డుని…

Read More

Monthly Current Affairs – September – 2018 – Sports

సెప్టెంబర్ – క్రీడలు ☛ హామిల్టన్ కు ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్ మెర్సిడీస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్.. ఇటలీ గ్రాండ్‌ ప్రి ఫార్ములావన్ రేసు విజేతగా నిలిచాడు. ఇటలీలోని మోంజాలో సెప్టెంబర్ 2న జరిగిన రేసులో హామిల్టన్ 53 ల్యాప్‌ల దూరాన్ని గంటా 16 నిమిషాల 54.484 సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఫెరారీ డ్రైవర్ రైకోనెన్ రెండో స్థానం, మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ మూడో స్థానం, ఫెరారీ మరో డ్రైవర్ వెటెల్ నాలుగో స్థానం దక్కించుకున్నారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. ☛ఆసియా క్రీడలు – 2018 ఇండోనేషియాలోని జకార్తా, పాలెంబాంగ్ నగరాల్లో 2018 ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు 18వ ఆసియా క్రీడలు జరిగాయి. ఈ క్రీడల్లో 45…

Read More

Monthly Current Affairs – September – 2018 – Economy

సెప్టెంబర్ – ఆర్థికం ☛ 2017-18లో మారిషస్ నుంచి అత్యధిక FDIలు 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత్ లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) పెట్టిన దేశంగా మారిషస్ నిలిచింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 2న వెలువరించిన వివరాల ప్రకారం.. 2017-18లో దేశంలోకి మొత్తం 37.36 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. వీటిలో 13.41 బిలియన్ డాలర్ల పెట్టుబడులు మారిషస్ నుంచి వచ్చాయి. 9.27 బిలియన్ డాలర్లతో సింగపూర్ రెండోస్థానంలో నిలిచింది. 2016-17లో మొత్తం 36.31 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు దేశంలోకి రాగా మారిషస్ నుంచి 13.38 బిలియన్ డాలర్లు, సింగపూర్ నుంచి 6.52 బిలియన్ డాలర్లు వచ్చాయి. ☛ లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా అమెజాన్ ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ కంపెనీ లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా…

Read More

Monthly Current Affairs – September – 2018 – International

సెప్టెంబర్ – అంతర్జాతీయం ☛ కఠ్మాండులో 4వ బిమ్స్ టెక్ సమావేశం 4వ బిమ్స్ టెక్ సమావేశం నేపాల్ రాజధాని కఠ్మాండులో ఆగస్టు 30 – 31 తేదీల్లో జరిగింది. ఈ సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ.. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలపై పోరులో బిమ్స్ టెక్ దేశాలు సహకరించుకోవాలని అన్నారు. సభ్య దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక, రవాణా, డిజిటల్ సంబంధాలను మెరుగుపరిచేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బిమ్స్ టెక్ (బంగాళాఖాత దేశాల ఆర్థిక సహకార సంస్థ)లో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్ లాండ్, భూటాన్, నేపాల్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రపంచ జనాభాలో ఈ దేశాల మొత్తం వాటా 22 శాతంగా ఉంటుంది. బిమ్స్ టెక్ దేశాల జీడీపీ 2.8…

Read More

Monthly Current Affairs – September – 2018 – AP & TS

సెప్టెంబర్ – రాష్ట్రీయం ☛ తిరుపతిలో ‘స్వీకార్ ’ తిరుపతి సమీపంలో అలిపిరి వద్ద శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఫర్ కేన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ (స్వీకార్) సంస్థను టాటా ట్రస్ట్ నిర్మించనుంది. టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వీకార్ నిర్మాణానికి ఆగస్టు 31న భూమి పూజ చేశారు. స్వీకార్‌ను తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) బోర్డు విరాళంగా ఇచ్చిన 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల వ్యయంతో నిర్మిస్తారు. దేశవ్యాప్తంగా టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో 124 ఆస్పత్రులు నడుస్తున్నాయి. ☛ ఆంధ్రప్రదేశ్ లో ‘చేరువ’ కార్యక్రమం సామాజిక మాధ్యమాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు రూపొందించిన ‘చేరువ..మీ చెంతకు.. మీ పోలీస్’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ విజయవాడలో ఆగస్టు 31న ప్రారంభించారు. ఏపీ…

Read More

Monthly Current Affairs – September – 2018 – National

సెప్టెంబర్ – జాతీయం ☛ ఇండస్ వాటర్ ఒడంబడిక – భారత్, పాక్ మధ్య అవగాహన ఇండస్ వాటర్ ఒడంబడిక 1960కి అనుగుణంగా రెండు దేశాల్లో ఆయా దేశాల నీటి కమిషనర్ల పర్యటనకు భారత్, పాకిస్తాన్ అంగీకరించాయి. భారత్ లో జమ్ము అండ్ కశ్మీర్ లో చేపడుతున్న జల విద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరం చెబుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ వివాదాల పరిష్కారం కోసం రెండు దేశాల ప్రతినిధులు ఇరు ప్రాంతాల్లో పర్యటించి.. సమస్యలను అధ్యయనం చేసేందుకు, వాటిని పరిష్కరించేందుకు రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ మేరకు భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు పాకిస్తాన్ లాహోర్ లో జరిగాయి. పాకిస్తాన్ నూతన ప్రధాన మంత్రిగా పాకిస్తాన్ తెహ్రీక్ – ఈ – ఇన్సాఫ్(PTI) పార్టీ అధినేత ఇమ్రాం ఖాన్…

Read More