RRB లో NTPC, గ్రూప్ D, మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం రాత పరీక్షలను డిసెంబర్ 15 నుంచి నిర్వహించనున్నట్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. షిఫ్ట్ ల ప్రకారం పరీక్షలు జరుపుతామని తెలిపింది. మినిస్టీరియల్ అండ్ ఐసోలెటెడ్ కేటగిరీల్లో 1,663 పోస్టుల కోసం డిసెంబర్ 15 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. NTPC, గ్రూప్ D పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.
కోవిడ్ పరిస్థితుల వల్ల అభ్యర్థులకు ఎలాంటి కాల్ లెటర్లు పంపించడం జరగదని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టం చేసింది. రిక్రూట్మెంట్ వెబ్ సైట్ ద్వారా అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షకు సంబంధించిన వివరాలను కూడా సంబంధిత వెబ్ సైట్ నుంచి తెలుసుకోవాలి. దక్షిణమధ్య రైల్వేలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు http://www.rrbsecunderabad.nic.in/ ద్వారా తమ పరీక్షల తేదీలను తెలుసుకోవచ్చు. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
1, 03, 769 ఖాళీల భర్తీ కోసం 2018 లో విడుదల చేసిన గ్రూప్ డీ నోటిఫికేషన్ కి కోటి 15 లక్షలా 67 వేల 248 దరఖాస్తులు వచ్చాయి. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో (NTPC) లో 35, 208 ఖాళీల భర్తీ కోసం 2019లో ప్రకటించిన నోటిఫికేషన్ కి 1.2 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి. మినిస్టీరియల్ అండ్ ఐసోలెటెడ్ కేటగిరీలో 1,663 పోస్టుల కోసం 1,02, 940 మంది దరఖాస్తు చేశారు.