రాహుల్ గాంధీ కోట్ చేసిన ఈ ఛాంబర్ నెయిల్ ఎవరు ?

భారత్ చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం.. దేశ రాజకీయాల్లో ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధానికి ఆజ్యం పోసింది. కరోనా వైరస్.. పెట్రోల్ ధరల పెంపు.. చైనాతో సరిహద్దు గొడవ తదితర అంశాల్లో.. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మోడీ సర్కార్ ఫెయిల్ అయిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా NDA ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. సరిహద్దులో చైనాతో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై రాహుల్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లడాఖ్ పర్యటనలో ఉన్న సమయంలోనేజూలై 18న రాహుల్ గాంధీ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.    

చైనా మన భూమిని ఆక్రమించుకుంది. భారత ప్రభుత్వం మాత్రం ఛాంబర్ లెయిన్ లా వ్యవహరిస్తోంది. ఈ వైఖరి చైనాకు ఇంకా ధైర్యాన్ని ఇస్తుంది. మోడీ సర్కార్ పిరికి చర్యల వల్ల భారత్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.” ఇవి ట్విట్టర్ ద్వారా రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలు. చైనాతో సరిహద్దు వివాదం పరిష్కారానికి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని పిరికిపందల చర్యగా అభివర్ణించిన రాహుల్..  ఛాంబర్ లెయిన్ తో పోల్చారు. అసలు ఈ పోలికకు అర్థమేంటి ? ఛాంబర్ లెయిన్ ఎవరు ?

       Neville Chamberlain

రాహుల్ ట్వీట్ లో కోట్ చేసిన వ్యక్తినెవిల్లే ఛాంబర్ లెయిన్. 1937 నుంచి 1940 వరకు బ్రిటన్ ప్రధాని. 1938 మునిచ్ ఒప్పందం ద్వారా ఛాంబర్ లెయిన్ చరిత్రలో నిలిచారు. గ్రేట్ జర్మనీ నిర్మాణంలో భాగంగా ప్రపంచ దేశాలపై దండెత్తుతున్న ఎడాల్ఫ్ హిట్లర్.. 1938లో  సెంట్రల్ యూరప్ లోని చెకోస్లేవేకియా గురిపెట్టాడు. ఆ దేశంలోని సుడెటెన్ లాండ్ ప్రాంతంలో జర్మన్ మూలాలు ఉన్న ప్రజలు ఎక్కువగా ఉన్నారన్న నెపంతో.. ఆ ప్రాంతాన్ని జర్మనీలో కలిపేసుకోవాలన్నది హిట్లర్ ప్రణాళిక. ఈ విషయాన్ని పసిగట్టిన చెక్.. ఒకవేళ జర్మనీ దండెత్తితే గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ తమకు అండగా నిలుస్తాయని ఆశించింది. కానీ యుద్ధ నివారణకే ప్రాధాన్యం ఇచ్చిన బ్రిటన్ ప్రధాని ఛాంబెర్ లెయిన్.. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించాలని చూశారు. అలా హిట్లర్ తో ఒప్పందానికే మొగ్గు చూపారు. ఛాంబెర్ చొరవతో ఫ్రాన్స్ కూడా అయిష్టంగానే మునిచ్ ఒప్పందానికి ఒప్పుకుంది. తద్వారాచెకోస్లేవేకియాలోని సుడెటెన్ లాండ్ ప్రాంతంపై జర్మనీకి హక్కు కల్పిస్తూ… 1930 సెప్టెంబర్ 30న జర్మనీలోని మునిచ్ నగరంలో అగ్రీమెంట్ పై గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ సంతకాలు చేశాయి ( దీన్ని తుంగలోకి తొక్కుతూ జర్మనీతదుపరి కాలంలో చెకోస్లేవేకియా మొత్తాన్ని గ్రేట్ జర్మనీలో కలిపేసుకుంది). రాజ్యాలపై దండెత్తే పంథాని కొనసాగిస్తూ.. జర్మనీ 1939 సెప్టెంబర్ 1న పోలాండ్ ఆక్రమణకు తెగబడింది. బ్రిటన్, ఫ్రాన్స్ వద్దని హెచ్చరించినాజర్మనీ వెనక్కి తగ్గలేదు. దీంతో.. పోలాండ్ కి అండగా నిలుస్తూ.. బ్రిటన్, ఫ్రాన్స్ .. జర్మనీపై యుద్ధానికి కదిలాయి. ఇదే రెండో ప్రపంచ యుద్ధానికి ప్రారంభం. సెకండ్ వరల్డ్ వార్ మొదలైన 8 నెలల తర్వాత ఛాంబర్ నెయిల్ స్థానంలో విన్ స్టన్ చర్చిల్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

ఇలా.. చెకోస్లోవేకియా వైపు జర్మన్ నాజీ హిట్లర్ తొలి అడుగు వేసినప్పుడే వారిని అడ్డుకోగలిగే స్థాయిలో ఉండి కూడా ఛాంబర్ నెయిల్ చర్చల పేరుతో హిట్లర్ ని బుజ్జగింజే ప్రయత్నం (appeasement) చేశాడనే ముద్ర ఛాంబర్ నెయిల్ పై పడింది. ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ఈ చారిత్రక విషయాలను మరోసారి గుర్తుచేసుకునేలా చేసింది.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments