రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ 20 – 20 !!

తనని ఎర్రమట్టి కోర్టుల రారాజు అని ఎందుకంటారో 34 ఏళ్ల రాఫెల్ నాదల్ మరోసారి నిరూపించారు. ఆదివారం పారిస్ లోని రొలాండ్ గారోస్ లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్ ను చిత్తుచేసిన ప్రపంచ నంబర్ టూ రాఫెల్ నాదల్.. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ని గెలిచాడు. తొలి రెండు సెట్లని సునాయసంగా దక్కించుకున్న స్పెయిన్ దిగ్గజ స్టార్ ( 6 – 0, 6 – 2 ).. హోరాహోరీగా జరిగిన మూడో సెట్లోను పైచేయి సాధించి 7 – 5 తో సెర్బియన్ స్టార్ జకోవిచ్ ని ఓడించాడు. ఈ విజయంతో నాదల్.. పురుషుల గ్రాండ్ స్లామ్ లో 20 టైటిల్స్ సాధించిన రోజరర్ ఫెదరర్ తో సమానంగా నిలిచాడు. నాదల్ కి ఇది 13వ ఫ్రెంచ్ టైటిల్.



ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో గెలుపుతో పారిస్ లోని రొలాండ్ గారోస్ టెన్నిస్ కోర్టులో నాదల్ 100వ విజయాన్ని నమోదు చేశాడు. 2005లో అంతర్జాతీయ టెన్నిస్ లో అరంగ్రేటం చేసిన నాదల్.. ఇక్కడ ఆడిన మ్యాచ్ లలో కేవలం రెండింటిలో మాత్రమే ఓటమిని ఎదుర్కొన్నాడు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments