☛ నవయుగతో పోలవరం కాంట్రాక్టు రద్దు ఆంధ్రప్రదేశ్ జీవధారగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి నవయుగ కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనుల నుంచి తప్పించి.. కాంట్రాక్ట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాంట్రాక్ట్ ఒప్పందంలోని 89.3 క్లాజును అనుసరించి కాంట్రాక్ట్ ను ప్లీ క్లోజూర్ చేస్తున్నామని పేర్కొంటు కంపెనీకి నోటీసు పంపింది. పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన స్పిల్ వే, స్పిల్ చానల్ పనులు ఏడాదిలో పూర్తి చేసేందుకు జల వనరుల శాఖ గతంలో నవయుగతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ. 1,244 కోట్లు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున.. కాంట్రాక్ట్ రద్దుకి కేంద్రం అమోదం తప్పనిసరి. ☛ సెప్టెంబర్ 28న ఐరాసలో ప్రధాని మోదీ ప్రసంగం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఐక్యరాజ్య…
Read More