తల్లిదండ్రులకు కరోనా – 6 నెలల బాబుకి అమ్మైన డాక్టర్ !!

“కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా.. కన్న అమ్మేకదా..” పైన ఫోటోని వర్ణించేందుకు ఈ పాటకన్నా అద్భుతమైనది మరొకటి దొరకదు. కరోనా తెచ్చిన భయం.. మనుషుల మధ్య అనుబంధాలని, మానవత్వాన్ని మంటకలుపుతోంది. ఇలాంటి సమయంలో… కేరళలోని ఓ డాక్టర్… కరోనా సోకిన దంపతులు ఆసుపత్రిలో చేరితో… వారి బిడ్డని అక్కున చేర్చుకొని.. నెల రోజులు కన్నబిడ్డలా ఆలించింది. లాలించింది. పాలించింది. ఆ దంపతులు కరోనా నుంచి కోలుకొని బిడ్డని తీసుకెళ్లేందుకు వస్తే.. బుడ్డోడిని వారికి అప్పగిస్తూ కన్నీటిపర్యంతమైంది. నెల రోజుల పాటు తన ఒడిలో ఆడుకున్న బాబు.. దూరం అవడంతో తల్లడిల్లింది. అందుకే.. అంటారు అమ్మ ప్రేమని మించింది లేదని. కన్న ప్రేమ అయినా.. పెంచిన ప్రేమ అయినా.. రెండూ గొప్పవే అని ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపితమైంది.…

Read More