Daily Current Affairs – October 15, 2018

☛ జయరాజుకు సుద్దాల జాతీయ పురస్కారం – 2018 ప్రజా కవి సుద్దాల హనుమంతు – జానకమ్మల జాతీయ పురస్కారం – 2018ని ప్రఖ్యాత ప్రజాకవి జయరాజుకు ప్రదానం చేశారు. సుద్దాల అశోక్ తేజ తన తల్లిదండ్రుల పేరిట ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని సాహిత్యం రంగంలో విశేష కృషి చేసిన వారికి ఏటా ప్రదానం చేస్తున్నారు. ☛ ప్రపంచంలోనే వేగవంతమైన కెమెరాను కనుగొన్న అమెరికా వెలుతురు లేదా కాంతిని స్లో మోషన్ లో బంధించగల ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కెమెరాను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ కెమెరా సెకనుకి 10 లక్షల కోట్ల ఫ్రేమ్స్ ను కేప్చర్ చేయగలదని వెల్లడించారు. కాలఫోర్నియా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు ఈ కెమెరాను అభివృద్ధి చేశారు. దీని వేగాన్ని భవిష్యత్తులో సెకనుకు క్వాడ్రిలియన్ ఫ్రేములకు పెంచడానికి అవకాశాలున్నాయి.…

Read More

Daily Current Affairs – October 13 – 14, 2018

☛ UNHRC ఎన్నికల్లో భారత్ గెలుపు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో( United Nations Human Rights Commission ) సభ్య దేశాల ఎంపిక కోసం జరిగిన ఎన్నికలలో భారత్ విజయం సాధించింది. అక్టోబర్ 12న జరిగిన ఓటింగ్ లో విజయం సాధించేందుకు 97 ఓట్లు అవసరం కాగా… భారత్ కు 188 ఓట్లు వచ్చాయి. దీంతో.. 2019 జనవరి 1 నుంచి 3 ఏళ్ల కాలానికి భారత్ యూఎన్ హెచ్ఆర్సీలో సభ్య దేశంగా ఎంపికైంది. భారత్ తో పాటు మరో 18 దేశాలు కూడా ఎంపికయ్యాయి. 2011-14, 2014-17 మధ్య భారత్ రెండుసార్లు UNHRCకి ఎంపికైంది. UNHRC ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది. ఈ సంస్థను 2006లో స్థాపించారు. అంతర్జాతీయంగా మానవ హక్కుల రక్షణ కోసం ఈ సంస్థ కృషి చేస్తుంది.…

Read More

Daily Current Affairs – October 12 – 2018

☛ “తిత్లీ” తుపాను బీభత్సం.. శ్రీకాకుళం అతలాకుతలం తిత్లీ తుపాన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో విధ్వంసం సృష్టించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తిత్లీ తుపాను అక్టోబర్ 11న ఉదయం 4:30 నుంచి 5:30 మధ్య శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారథి గ్రామం వద్ద గంటకు 150 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటింది. అనంతరం బలహీనపడింది. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానంపై తిత్లీ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 2 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. జిల్లావ్యాప్తంగా 3 లక్షల కొబ్బరి చెట్లు నేలకూలాయి. తుపాన వల్ల మొత్తంగా రూ.1,500 కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని ప్రాథమిక అంచనా. ☛ ఉత్తరాఖండ్ సీజేగా జస్టిస్ రమేశ్ రంగనాథన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్..…

Read More

Daily Current Affairs – October 10, 11 – 2018

☛ 2018-19లో భారత వృద్ధి రేటు 7.3 శాతం : ఐఎంఎఫ్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF) అంచనా వేసింది. 2019-20లో 7.4 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ 9న ‘వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2018-19లో భారత్ ‘ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ’ హోదాను దక్కించుకుంటుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఇదే సమయంలో ప్రపంచ వృద్ధి రేటును 0.2 శాతం మేర ఐఎంఎఫ్ తగ్గించింది. ☛ సర్ చోటూరామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ హరియాణాకు చెందిన జాట్ నేత, రైతు పోరాట యోధుడు, దీన్‌బంధు సర్ చోటూరామ్ 64 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్…

Read More

Daily Current Affairs – October 08, 09 – 2018

☛ జపాన్ గ్రాండ్ ప్రీ విజేత హామిల్టన్ జపాన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేసు విజేతగా మెర్సడిసీ జట్టు జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నిలిచాడు. అక్టోబర్ 7న జరిగిన 53 ల్యాప్ ల రేసుని గంటా 27 నిమిషాల 17.062 సెకన్లలో పూర్తి చేసి తొలిస్థానంలో నిలిచాడు. తద్వారా 2018 ఫార్ములా వన్‌ సీజన్ లో హామిల్టన్ 9వ విజయాన్ని నమోదు చేశాడు. ఈ రేసులో ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడు, ఒకాన్ తొమ్మిది స్థానాల్లో నిలిచారు. ☛ 2018-19లో భారత వృద్ధి రేటు 7.3 శాతం: ప్రపంచ బ్యాంక్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఈ మేరకు అక్టోబర్ 7న ఓ నివేదికను విడుదల చేసింది. 2019-20,…

Read More

Daily Current Affairs – October 06, 07 – 2018

☛ ఎస్ – 400 పై రష్యాతో భారత్ ఒప్పందం ఎస్ – 400 ట్రయంఫ్ అధునాతన గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలుకు సంబంధించి భారత్ రష్యాతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా అక్టోబర్ 5న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అంతరిక్షం, రైల్వేలు, అణుశక్తి, విద్య, ఎరువుల తదితర రంగాల్లో 8 ఒప్పందాలు కుదిరాయి. 2022 నాటికి భారత్ చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్ యాన్ కు సాంకేతిక సహకారం అందించేందుకు రష్యా అంగీకరించింది. ఈ మేరకు ఇస్రో.. రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎస్-400 క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామంటూ…

Read More

Daily Current Affairs – October 04, 05 – 2018

☛ భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గోగోయ్ భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గోగోయ్ అక్టోబర్ 3న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ రంజన్ గోగోయ్ సీజేఐ గా 13 నెలలపాటు అంటే.. 2019 నవంబర్ 17 వరకు ఉంటారు. ఈశాన్య భారతం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయిన మొదటి వ్యక్తి.. జస్టిస్ రంజన్ గోగోయ్. 1954 నవంబర్ 18న అస్సాంలోని దిబ్రూగఢ్ లో రంజన్ గోగోయ్ జన్మించారు. 1978లో తొలిసారి న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2001లో గువాహతి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012 ఏప్రిల్ 23 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. 45వ సీజేఐ దీపక్…

Read More

Daily Current Affairs – October 03 – 2018

☛ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు జాతీయ పర్యాటక అవార్డు దక్షిణ మధ్య రైల్వేలోని కీలక రైల్వే స్టేషన్ అయిన సికింద్రాబాద్.. మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకుంది. ప్రయాణికుల సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, పర్యాటకులను ఆకట్టుకోవడంలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచి… జాతీయ పర్యాటక అవార్డు గెలుచుకుంది. ఈ మేరకు అక్టోబర్ 2న జాతీయ పర్యాటక సంస్థ ప్రకటించింది. నిత్యం 210 రైళ్లు, లక్షా 80 వేల మందికిపైగా ప్రయాణికుల రాకపోకలతో సికింద్రబాద్ రైల్వేస్టేషన్ దక్షిణ మధ్య రైల్వోలే అతిపెద్దది. ఈ ఏడాది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ … స్వచ్ఛ రైల్వే స్టేషన్ పురస్కారాన్ని సైతం గెలుచుకుంది. ప్రతిష్టాత్మక ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ సొసైటీ నుంచి పర్యావరణ పరిరక్షణ, ఇంధన వనరుల సద్వినియోగంలో ప్లాటినమ్ సర్టిఫికెట్ దక్కించుకుంది. ☛ పారా ఏషియాడ్ లో భారత పతాకధారిగా తంగవేలు…

Read More

Daily Current Affairs – October 02 – 2018

☛ చార్మినార్.. భారత స్వచ్ఛ ఐకాన్ 400 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన చార్మినార్… భారత స్వచ్ఛ ఐకాన్ గా గుర్తింపు పొందింది. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా చార్మినార్ కు స్వచ్ఛ ఐకాన్ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు అక్టోబర్ 2న న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛ భారత్ మిషన్ 4వ వార్షికోత్సవంలో కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రి ఉమా భారతి చేతుల మీదుగా జీహెచ్ఎంసీ అధికారులు అవార్డు అందుకున్నారు. చారిత్రక కట్టడాల అభివృద్ధి, పునరుద్ధరణ, స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది. ☛ సమాచార హక్కు చట్టం పరిధిలోకి బీసీసీఐ భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)ని సమాచార హక్కు చట్టం(RTI) పరిధిలోకి తెస్తూ కేంద్ర సమాచార కమిషన్(CIC) అక్టోబర్ 1న ఉత్తర్వులు జారీ చేసింది. పలు చట్టాలు,…

Read More

Daily Current Affairs – October 01 – 2018

☛ బిగ్ బాస్ – 2 విన్నర్ కౌశల్ స్టార్ మాలో ప్రసారమైన తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 2 కౌశల్ నిలిచారు. సెప్టెంబర్ 30న జరిగిన ఫైనల్లో కౌశల్ టైటిల్ విజేతగా.. గీతా మాధురి రన్నరప్ గా నిలిచారు. ఫైనల్ కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ హీరో వెంకటేశ్.. కౌశల్ కు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా కౌశల్ మాట్లాడుతూ… బహుమతి మొత్తాన్ని క్యాన్సర్ బాధితుల కోసం విరాళంగా ఇస్తానని ప్రకటించారు. హీరో నాని ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించారు. 2018 జూన్ 10న ప్రారంభమైన బిగ్ బాస్ – 2, 113 రోజుల పాటు జరిగింది. ☛ జాతీయ గాంధీ మ్యూజియంలో గాంధీ హృదయ స్పందన న్యూఢిల్లీలోని జాతీయ గాంధీ మ్యూజియంలో మహాత్మా…

Read More