November 2018 Current Affairs – Telangana

హైదరాబాద్ లో పాండ్రాల్

రైల్వేలకు అవసరమైన విడిభాగాలు తయారు చేసే ఇంటర్నేషనల్ సంస్థ పాండ్రాల్ అక్టోబర్-29న రాహీ టెక్నాలజీస్ తో కలిసి హైదరాబాద్ లో ప్లాంటును ప్రారంభించింది. ఈ ప్లాంటు ద్వారా ప్రధానంగా భారత మార్కెట్ కు విడిభాగాలను సరఫరా చేస్తారు. ఇక్కడ తయారయ్యే క్లిప్స్ ను మారిషస్ లో L&T నిర్మిస్తున్న రైల్వే ప్రాజెక్టుకు వినియోగించనున్నారు. భారత మెట్రో రైల్ ప్రాజెక్టులతో పాటు బంగ్లాదేశ్, ఘనాలో ట్రాక్ ల పునరుద్ధరణలోనూ వీటిని వాడనున్నారు.

భాగ్యనగరిలో వన్ ప్లస్ కేంద్రం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ హైదరాబాద్ లో పరిశోధన , అభివృద్ధి కేంద్రాన్ని(R&D) ఏర్పాటు చేయనుంది. చైనా, తైవాన్ ల అనంతరం ఆ సంస్థ ఏర్పాటు చేయనున్న కేంద్రం అది హైదరాబాద్ లోనే కావడం విశేషం. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది.

హైదరాబాద్ మెట్రోకు అవార్డు

హైదరాబాద్ మెట్రోలోని రసూల్ పురా, ప్యారడైజ్, ప్రకాశ్ నగర్ స్టేషన్లు పర్యావరణహితంగా ఉన్నాయంటూ వాటికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(IGBC) గ్రీన్ ప్లాటినం అవార్డుకు ఎంపిక చేసింది. నవంబర్-1HICCలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా మెట్రో రైలు MD NVS రెడ్డి ఈ అవార్డు అందుకున్నారు.

కపిలవాయి కన్నుమూత

తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత, పరిశోధకుడు కపిలవాయి లింగమూర్తి నవంబర్-6న కన్ను మూశారు. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం జినుకుంట ఆయన సొంతూరు. శాసనాలు, గ్రామీణ జనాల భాష, పుట్టువడిల గురించి అరుదైన పరిశోధనలు చేసిన ఆయన 130కి పైగా అంశాలపై గ్రంథాలు వెలువరించారు. ఆయన రచించిన గ్రంథాల్లో పాలమూరు జిల్లా దేవాలయాలుచెప్పుకోదగినది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి తొలి డాక్టరేట్ అందుకున్న వ్యక్తిగా కపిలవాయి గుర్తింపు పొందారు. భాగవత కథాతత్వం, సాలగ్రామ శాస్త్రం, మాంగల్యశాస్త్రం, స్వర్ణ శకలాలు ఇతని ప్రముఖ రచనలు.

AP హైకోర్టు ఏర్పాటుకు ఆదేశం

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు స్థానంలో ఆంధ్రప్రదేశ్ కు అమరావతిలో నూతన హైకోర్టుకు 2019, జనవరి-1 నాటికి నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్-214 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఉండాలన్న నిబంధనకు అనుగుణంగా రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తే దాని ప్రకారం ప్రారంభ తేదీ నిర్ణయిస్తారు.

ఎన్నికల ప్రచారకర్తగా విజయ్ దేవరకొండ

తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సానియా మీర్జా, పుల్లెల గోపీచంద్, గోరేటి వెంకన్న, VVS లక్ష్మణ్ లను రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తలుగా నియమించింది. మహబూబ్ నగర్ జిల్లాకు ప్రత్యేకంగా విజయ్ దేవరకొండను ప్రచారకర్తగా నియమించారు. మిగతా జిల్లాలకు ప్రచారకర్తలను నియమించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం తీసుకురావడానికి వీరు ప్రచారం చేయనున్నారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments