November 2018 Current Affairs – Sports

ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు రాయుడు బై

వన్డేలలో నిలకడగా రాణిస్తున్న అంబటి రాయుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి వైదొలిగారు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రాయుడు ఫ స్ట్ క్లాస్ కెరీర్ లో 97 మ్యాచ్ లు ఆడి 6,151 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు సాధించగా అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 210 పరుగులు.

ఆసియన్ స్నూకర్ విజేత పంకజ్

చైనాకు చెందిన జు రెటీని 6-1తేడాతో ఓడించడం ద్వారా ఆసియన్ స్నూకర్ టూర్ టైటిల్ రెండో దశ విజేతగా పంకజ్ అద్వాణి నిలిచారు. ఈ టైటిల్ అందుకున్న తొలిభారతీయుడు పంకజ్. మహారాష్ట్రలోని పుణెకు చెందిన పంకజ్ అద్వాణీ ప్రపంచ టైటిల్ ను 19 సార్లు గెలుచుకున్నాడు.

ఐదోసారి ఫార్ములావన్ ఛాంపియన్

మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఐదోసారి ఫార్ములావన్ ఛాంపియన్ గా నిలిచాడు. మెక్సికన్ గ్రాండ్ ప్రీలో 4వ స్థానంలో నిలిచిన అతను ఫార్ములా వన్ డ్రైవర్స్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ను గెలుచుకున్నాడు. గతంలో 2008, 2014, 2015, 2017లో ఛాంపియన్ గా నిలిచాడు. ఇప్పటివరకు ఫార్ములా వన్ ని అత్యధికంగా 7 సార్లు గెలిచింది మైకేల్ షుమాకర్.

ఆసియా పురుషుల హాకీ ఛాంపియన్ షిప్

2018 ఆసియా పురుషుల హాకీ ఛాంపియన్ షిప్ ను ఒమన్ రాజధాని మస్కట్ లో నిర్వహించారు. వర్షం కారణంగా భారత్పాకిస్థాన్ లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. గతంలో భారత్ ఈటోర్నీని 2011, 2016లో గెలిచింది. ఇండియా టీమ్ ఆటగాడు అక్షయ్ దీప్ సింగ్ ఉత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు.

సిమోన్ బైల్స్ ఆల్ టైం రికార్డ్

అమెరికా జిమ్నాస్టిషియన్ సిమోన్ బైల్స్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఓవరాల్ గా 14 స్వర్ణాలు సాధించి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. బెలారస్ కు చెందిన పురుష జిమ్నాసిస్ట్ విటలీ చెర్టో(12) పతకాల రికార్డును అధిగమించింది.సిమోన్ దోహాలో జరుగుతున్న ప్రపంచ జిమ్నాస్టిక్ ఛాంపియన్ షిప్ లో ఆరు విభాగాలలో పతకాలు గెలుపొందింది. యెలెనా షుషునోవా తర్వాత ప్రపంచ టోర్నీలో పోటీపడ్డ ప్రతి ఈవెంట్ లోనూ పతకాన్ని నెగ్గిన తొలి జిమ్నాసిస్ట్ గా బైల్స్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

పారిస్ మాస్టర్స్ విజేత కరెన్

పురుషుల ప్రొఫెషనల్ టెన్నిస్ టోర్నీగా ప్రత్యేకత పొందిన పారిస్ మాస్టర్స్ టోర్నీ సింగిల్స్ లో సెర్బియా ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ను ఓడించి రష్యన్ ఆటగాడు కరెన్ కచనోవ్ సంచలనం సృష్టించాడు. మార్సెల్ గ్రానోల్లర్స్, రాజీవ్ రామ్ పురుషుల డబుల్స్ విజేతలుగా నిలిచారు.

T-20లో రోహిత్ శర్మ రికార్డు

ఇటీవల వెస్టెండీస్ తో జరిగిన 20-20 మ్యాచ్ లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ ప్రపంచంలోనే అత్యధికంగా 4 T-20సెంచరీలు చేసిన బ్యాట్స్ మన్ గా నిలిచారు. ఇంతకుముందు దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లాండ్ లపై వంద కొట్టాడు. ఈ క్రమంలో T-20ల్లో మూడు సెంచరీలు చేసిన న్యూజిలాండ్ ఆటగాడు కొలిన్ మున్రో రికార్డును అధిగమించాడు. దీంతోపాటు T-20ల్లో 2203 పరుగులు చేసి అత్యధిక t-20 పరుగులు చేసిన భారత క్రికెటర్ గా విరాట్ కోహ్లిన్ అధిగమించాడు.

ప్రొ వాలీబాల్ లీగ్ ప్రచారకర్తగా సింధు

2019, ఫిబ్రవరిలో తొలిసారి ప్రారంభం కానున్న ప్రొ వాలీబాల్ లీగ్ కు సింధు ప్రచారకర్తగా ఎంపికయ్యారు. ఈమెతో పాటు అమెరికన్ స్టార్ డేవిడ్ లీ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు. సింధు ఇప్పటికే స్వచ్ఛ ఆంధ్ర, CRPFకు ప్రచారకర్తగా ఉన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పతకం గెలిచిన తొలి భారత మహిళ షట్లర్ గా సింధు రికార్డు సొంతం చేసుకున్నారు.

ఫార్ములా వన్ పవర్ బోటింగ్ ఛాంపియన్ షిప్

నవంబర్-16 నుంచి 18 వరకు జరిగే ఫార్ములా వన్ పవర్ బోట్ ప్రపంచ ఛాంపియన్ షిప్ కు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆతిధ్యం ఇస్తోంది. ఈ టోర్నీని ఎఫ్ హెచ్2వో అనే పేరుతో నిర్వహిస్తున్నారు. 8 రౌండ్లలో విజేతను నిర్ణయించే ఈ టోర్నీలో భారత్ 5వ రౌండ్ కు ఆతిధ్యమిస్తుంది. 2004లో భారత్ ముంబాయిలో ఈ టోర్నీకి ఆతిధ్యమిచ్చింది.

మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ టోర్నీ నవంబర్-15 నుంచి 24 వరకు జరగనుంది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈ మెగా టోర్నీకి వేదిక కానుంది. టోర్నీ ప్రారంభ ఉత్సవాలలో మేరీ కోమ్ భారత పతకధారిగా వ్యవహరించారు. మేరీ కోమ్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ టోర్నీలలో ఐదుసార్లు విజేతగా నిలిచి కేటీ టేలర్(ఐర్లాండ్)తో సమానంగా ఉంది. 2006లో ఈ టోర్నీకి భారత్ ఆతిధ్యం ఇచ్చి టేబుల్ టాపర్ గా నిలిచింది.

ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ పంకజ్

భారత క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ IBSF-150 అప్ ఫార్మాట్ లో ఛాంపియన్ గా నిలిచాడు. ఫైనల్లో మయన్మార్ కు చెందిన నేత్వేవూను ఓడించడం ద్వారా ఓవరాల్ గా 20వ ప్రపంచ టైటిల్ ను సాధించాడు. ఈ టోర్నీ మయన్మార్ లోని యంగోన్ వేదికగా జరిగింది.

ఇండియా బ్లిట్జ్ విజేత ఆనంద్

భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ చెస్ ఇండియా బ్లిట్జ్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. నకమురా హికరు(అమెరికా)తో జరిగిన టై బ్రేక్ లో ఆనంద్1.5-0.5తో గెలుపొందాడు. దీంతో టోర్నీ ముగిసేసరికి ఆనంద్14 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. నకమురా(13) తర్వాతి స్థానంలో ఉన్నాడు.

రంజీ 11వేల పరుగుల క్లబ్ లో జాఫర్

విదర్భ రంజీ ఆటగాడు వసీం జాఫర్ రంజీల్లో 11వేల పరుగులు సాధించి రంజీ క్రికెట్ చరిత్రలోఈ మైలు రాయిని అందుకున్న తొలి భారత క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. జాఫర్ భారత జట్టుకు 31 టెస్టుల్లో నేతృత్వం వహించి 5-సెంచరీలు సాధించాడు. ఓవరాల్ గా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 242 మ్యాచుల్లో 18,110 పరుగులు చేయగా ఇందులో 53 సెంచరీలున్నాయి. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో అత్యధిక స్కోర్ 212 కాగా, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 314 పరుగులు.

సుబ్రతో కప్ విజేత బంగ్లాదేశ్

న్యూఢిల్లీలోని అంబేడ్కర్ స్టేడియం వేదికగా జరిగిన 59వ సుబ్రతో కప్ అంతర్జాతీయ ఫుట్ బాల్ టోర్నీ(జూనియర్ బాలుర కేటగిరీ)ని బంగ్లాదేశ్ క్రీడా శిక్షా ప్రతిష్టాన్ గెలుపొందింది. హబిబుర్ రెహమాన్ 11వ నిమిషంలో సాధించిన గోల్ తో అమిని స్కూల్ ఆఫ్ అఫ్గనిస్థాన్ ను ఓడించింది. 195 జట్లు, 1500 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి 8 జట్లు పాల్గొన్నాయి.

క్రిస్ ఎవర్ట్ ట్రోఫీ విజేత హలిప్

రొమేనియా టెన్నిస్ క్రీడాకారిణి సిమోన హలిప్ ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ తొలిసారి ప్రవేశపెట్టిన క్రిస్ ఎవర్ట్ డబ్ల్యూటీఏ ప్రపంచ నంబర్ వన్ ట్రోఫీని 2018గాను అందుకుంది.

ఉత్తమ ఆటగాడిగా మెస్సి

అర్జెంటీనా సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సి క్లబ్ లీగ్ లలో అత్యుత్తమ ఆటతీరుని కనబరిచినందుకు అందించే లాలిగాఅవార్డును 2017-18కి గానూ అందుకున్నాడు. ప్రస్తుతం మెస్సి స్పెయిన్ కు చెందిన బార్సిలోనా క్లబ్ కు నేతృత్వం వహిస్తున్నాడు. టాప్ స్కోరర్ కి అందించే కిచినీ ట్రోఫీ, ఉత్తమ ఆటగాడికి అందించే డిస్టేసానో ట్రోఫీని మెస్సి అందుకున్నాడు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments