November 2018 Current Affairs – Science and Technology

ఇండియాకి చేరిన INS తరంగిణి

ప్రపంచ నౌకాయాత్ర కోసం ఇండియా నౌకాదళం చేపట్టిన లోకయాన్-18′ లో INS-తరంగిణి నౌకను ఉపయోగించారు. ఇది 2018, ఏప్రిల్-10న కొచ్చిలో ప్రారంభమై అక్టోబర్-31న తిరిగి కొచ్చికి చేరుకుంది. 205 రోజుల పర్యటనలో 13 దేశాలు సందర్శించి 22,000నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించింది.

రష్యాతో యుద్ధ నౌకల ఒప్పందం

ప్రాజెక్ట్ 11356 తరగతికి చెందిన 4 యుద్ధ నౌకల కోసం అక్టోబర్-31న రష్యాతో ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. 950 మిలియన్ డాలర్ల విలువ గల ఈ నౌకల్లో రెండింటిని రష్యాలో నిర్మించి 2022 నాటికి అందజేయనుంది. మరో రెండింటిని గోవా షిప్ యార్డ్ లో నిర్మించనున్నారు.

రిటైర్ అయివ నాసా కెప్లర్ టెలిస్కోప్

దాదాపు దశాబ్దం పాటు సౌర కుటుంబం వెలుపల, ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలను పసిగట్టిన కెప్లెర్ అంతరిక్ష టెలిస్కోప్ శకం ముగిసింది. విశ్వంలో మరిన్ని పరిశీలనలు సాగించేందుకు అవసరమైన ఇంధనం ఇందులో లేకపోవడంతో దీని సేవలకు స్వస్తి పలకాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2018, అక్టోబర్-31న నిర్ణయించింది.

కెప్లెర్ టెలిస్కోప్ ను 2009, మార్చి-6న నాసా ప్రయోగించింది. సిగ్నస్ తారా మండలంలోని 1.5 లక్షల నక్షత్రాలను నిరంతరంగా పరిశీలించి, వాటి చుట్టూ తిరుగుతున్న గ్రహాలను పసిగట్టడం దీని ఉద్దేశం. కెప్లెర్ తన ప్రస్థానంలో 2,600కు పైగా ఎక్సోప్లానెట్లను గుర్తించింది. అందులో జీవులకు ఆవాసయోగ్యమైనవి కూడా ఉన్నాయి.

టెక్నాలజీ ఫెసిలిటీ సెంటర్ కు శంకుస్థాపన

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రి జితేంద్ర సింగ్ అస్సాంలోని జోర్హాట్ లో టెక్నాలజీ ఫెసిలిటీ సెంటర్ కు అక్టోబర్-19న శంకుస్థాపన చేశారు.దీనిని CSIR అధీకృత సంస్థ నార్త్ ఈస్ట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. దీని నిర్మాణ వ్యయం 40 కోట్లు. ఇది ఈశాన్య రాష్ట్రాలకు టెక్నాలజీలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ గా వ్యవహరించింది.

సిగ్నేచర్ బ్రిడ్జిప్రారంభం

దిల్లీ ఈఫిల్ టవర్ గా, సివిల్ ఇంజినీరింగ్ అద్భుతంగా పేరుగాంచిన సిగ్నేచర్ బ్రిడ్జిని 2018, నవంబరు-4న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యమునా నదిపై నిర్మించిన సిగ్నేచర్ బ్రిడ్జితో ఉత్తర, ఈశాన్య దిల్లీల మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గనుంది.

సిగ్నేచర్ బ్రిడ్జి భారత్ లోనే మొదటి అసిమెట్రికల్ కేబుల్ స్టేయిడ్ బ్రిడ్జి (సమరూప రహిత తీగల వంతెన) గా గుర్తింపు పొందింది. దీని నిర్మాణ వ్యయం రూ. 1,594 కోట్లు.

UAE ‘ఖలీఫా శాట్సక్సెస్

UAE గడ్డపై పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఖలీఫాశాట్అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను అక్టోబర్-29న విజయవంతంగా ప్రయోగించింది. జపాన్ లోని తనేగషిమా స్పేస్ సెంటర్ నుంచి H2A రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపింది. ఖలీఫాశాట్ తో పాటు జపాన్ పర్యావరణ శాటిలైట్ గోశాట్-2ను సైతం అదే రాకెట్ ద్వారా పంపించారు. UAE ఇంతకుముందు 2009లో దుబాయ్ శాట్-2లను పంపినా అవి స్వదేశీ టెక్నాలజీతో రూపొందించినవి కాదు.

విజయవంతమైన అగ్ని-1 పరీక్ష

ఒడిశా తీరంలోని డాక్టర్ అబ్దుల్ కలాం వీలర్స్ ఐలాండ్ నుంచి అక్టోబర్-31న అగ్ని-1ని విజయవంతంగా పరీక్షించారు. దీని పరిధి 700కి.మీ. 1000కిలోల పెలోడ్ సామర్థ్యం గల ఈ క్షిపణిని రాత్రివేళల్లో పరీక్షించింది. 2014, ఏప్రిల్-12 తర్వాత దీనిని పరీక్షించడం ఇది రెండోసారి. దీనిని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా ప్రారంభించాయి.

GSLV-మార్క్ 3-D2 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చరిత్రలోనే అత్యంత బరువైన GSLV-మార్క్ 3-D-2 రాకెట్ 2018, నవంబర్-14న కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-29ను విజయవంతంగా అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి దీన్ని ప్రయోగించారు.

GSLV-మార్క్ 3-D2 ఐదో తరం వాహకనౌక. దీన్ని ఇస్రో అభివృద్ధి చేసింది. 4వేల కిలోల బరువుండే ఉపగ్రహాలను భూబదిలీ కక్ష్యలోకి చేర్చేలా తీర్చిదిద్దారు. శ్రీహరికోట నుంచి చేపట్టిన 67వ వాహక నౌక ప్రయోగం ఇది.

జీశాట్-29 ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇది ఇస్రో రూపొందించిన 33వ సమాచార ఉపగ్రహం. కక్ష్యలోకి చేరిన బరువైన భారత ఉపగ్రహం(3,423 కిలోలు)గా పేరొందింది. ఇందులో అమర్చిన KA,KU బ్యాండ్ హైత్రోపుట్ ట్రాన్స్ పాండర్ల వల్ల ఈశాన్యం, జమ్ము కశ్మీర్ లలోని మారుమూల ప్రాంతాలకు సైతం అంతర్జాల సేవలు సులభతరమవుతాయి.

ఉపగ్రహంతో కలిపి రాకెట్ మొత్తం బరువు 640 టన్నులు. రాకెట్ ఎత్తు 43.4 మీటర్లు, వ్యాసం 4 మీటర్లు. ప్రయోగ దశలు 3(ఘన, ద్రవ, క్రయోజనిక్). ఉపగ్రహ జీవిత కాలం 10ఏళ్లు.

2017, జూన్-5న ఇస్రో బాహుబలి-1(GSLV-మార్క్ 3 D-1)ని తొలిసారిగా ప్రయోగించింది. దీంతో 3136 కిలోల దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-19ని విజయవంతంగా కక్ష్యలోకి చేరవేశారు.

INS అరిహంత్ తొలి గస్తీ

INS భారత నౌకాదళానికి చెందిన అణు జలాంతర్గామి INS అరిహంత్ తన తొలి అణునిరోధక గస్తీని విజయవంతంగా పూర్తి చేసినట్లు2018, నవంబర్-5న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

అరిహంత్ విశేషాలు:

మన దేశ అణ్వాయుధ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిన తొలి స్వదేశీ తయారీ అణు జలాంతర్గామి అరిహంత్. ఇది విశాఖపట్నం కేంద్రంగా సేవలు అందిస్తోంది. అరిహంత్ అంటే శత్రు సంహారిణిఅని అర్థం.

2009, జూలై-26న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ కేంద్రం నుంచి అరిహంత్ ను తొలిసారి సముద్రంలోకి పంపారు. అనేక పరీక్షల అనంతరం 2016లో INS అరిహంత్ ను నౌకాదళంలోకి తీసుకున్నారు.

ఇప్పటికే ఆకాశం నుంచి మిరేజ్-2000 యుద్ధ విమానం, భూమి నుంచి అగ్ని బాలిస్టిక్ క్షిపణి ద్వారా అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యాలు భారత్ కు ఉన్నాయి. ఇప్పుడు INS అరిహంత్ కూడా పూర్తిగా విజయవంతం కావడంతో గాలి, భూమి, నీరు మూడింటిలో ఎక్కడి నుంచైనా అణ్వస్త్రాన్ని ప్రయోగించే సామర్థ్యం భారత్ సొంతమైంది.

ప్రస్తుతం అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ లకు మాత్రమే గాలి, నీరు, భూమి నుంచి అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యం ఉంది. ఈ జాబితాలో భారత్ 6వ దేశంగా చేరింది.

INS అరిహంత్ బరువు 6వేల టన్నులు, పొడవు 110మీటర్లు, వెడల్పు 11 మీటర్లు. నీటిలో 24నాటికల్ మైళ్లు, నీటి ఉపరితలంపై 12-15 నాటికల్ మైళ్ల వేగంతో వెళుతుంది. ఇది చేసే శబ్దం పైకి వినిపించదు.

నీటిలో 300మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. 83 మెగావాట్ల అణు విద్యుత్ రియాక్టర్ ఇందులో ఉంటుంది. ఉపరితలానికి రాకుండా సముద్రం గర్భంలోనే కొన్ని నెలలపాటు ప్రయాణించగలదు.

INS అరిహంత్ గరిష్ఠంగా 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై దాడి చేయగలదు.

అరిహంత్ నావికాదళ రహస్య ప్రాజెక్టు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెస్సల్(ATV)లో భాగం. ఇది ప్రధాని కార్యాలయ పర్యవేక్షణలో ఉంటుంది. ATV ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ కేంద్రానికి అప్పగించారు.

2021లో గగన్ యాన్

భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించే ప్రయోగంగా పేరుగాంచిన గగన్ యాన్ను 2021 డిసెంబర్ లో నిర్వహిస్తామని ఇస్రో ఛైర్మన్ కె. శివన్ వెల్లడించారు. ఆయన ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. దీనికంటే ముందే 2020, డిసెంబర్ లో, 2021 ప్రారంభంలో రిహార్సల్స్ నిర్వహించి మూడో ప్రయత్నంలో ముగ్గురు వ్యోమగాముల్ని పంపనున్నారు.

జనవరిలో చంద్రయాన్-2

2019, జనవరిలో చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టనున్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టనున్న ఈ ప్రయోగానికి GSLV మార్క్ 3 రాకెట్ ను ఉపయోగించనున్నారు. భారత్, రష్యాలు సంయుక్తంగా చేపట్టాల్సిన ఈ ప్రయోగం నుంచి రష్యా ఇటీవలే తప్పుకుంది. దీనికి కారణం రష్యా ఇటీవల మార్స్ పైకి చేపట్టిన ఫొబోస్గ్రంట్ ప్రయోగం విఫలం కావడమే. భారత్ 2008, అక్టోబర్-22PSLV-11రాకెట్ ద్వారా చంద్రయాన్-1 ప్రయోగాన్ని నిర్వహించింది.

కృత్రిమ సూర్యుడిని రూపొందించిన చైనా

సూర్యుడితో పోలిస్తే 6 రెట్లు శక్తివంతమైన కృత్రిమ సూర్యుడిని రూపొందించినట్లు చైనా ప్రకటించింది. ఇది సూర్యుడి తీవ్రత(15 మిలియన్ డిగ్రీ సెంటిగ్రేడ్) కన్నా 6 రెట్లు ఎక్కువ వేడి (100 మిలియన్ డిగ్రీ సెంటిగ్రేడ్) కలిగి ఉంటుంది. దీన్ని చైనా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ రూపొందించింది. దీనిని ఎక్స్ పరిమెంటల్ అడ్వాన్స్ డ్ సూపర్ కండక్టింగ్ టోకమాక్(ఈస్ట్)గా వ్యవహరిస్తున్నారు. ఇది 11 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు, 360 టన్నుల బరువు కలిగి ఉంటుంది.

ప్రపంచంలోనే తొలి 3డీ బాడీ స్కానర్

మానవ శరీరాన్ని 20 నుంచి 30 సెకన్ల తేడాలో స్కాన్ చేసి అద్భుతమైన 3డీ ఫోటోలు తీయగల ప్రపంచంలోనే తొలి బాడీ స్కానర్ ఎక్స్ ప్లోరర్ ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది పాసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ, సిటీస్కాన్ ల కంటే 40 రెట్లు వేగంగా బాడీని ఫోటోలు తీయగలదు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న స్కానర్ల కంటే 40 శాతం తక్కువ రేడియేషన్ వెదజల్లుతుంది.

ఇండియాలో తొలి మురుగు శుద్ధి యంత్రం

నవంబర్-19 ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా దేశంలోనే తొలిసారిగా మురుగును శుద్ధి చేసే యంత్రాన్ని ఢిల్లీలో ప్రవేశపెట్టారు. దీనిని బిందేశ్వర్ పాఠక్ నేతృత్వంలోని సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రవేశపెట్టింది. ఈ యంత్రాన్ని విషవాయువులు వెలువడుతూ మరణిస్తున్న సఫాయి కార్మికుల స్థానంలో ఉపయోగించనున్నారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments