November 2018 Current Affairs – National

మోదీ జపాన్ పర్యటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్-28,29 న జపాన్ లో పర్యటించారు.ఈ సందర్భంగా జపాన్ లో జరిగిన 13వ భారత్జపాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు.పారిశ్రామిక రోబోల తయారీ కేంద్రమైన ఫనుక్ను జపాన్ ప్రధాని షింజో అబెతో కలిసి సందర్శించారు.ఈ పర్యటనలో భాగంగా యోగా, ఆయుర్వేదంలో సహకారాన్నిపెంపొందించుకునే ఒప్పందాలు, విదేశీ మారక ద్రవ్యం పరంగా క్యాపిటల్ మార్కెట్లలో స్థిరత్వం కోసం స్థానిక కరెన్సీలో 7,500 కోట్ల డాలర్ల వరకు చెల్లింపులు చేసేందుకు వీలు కల్పించే భారీస్థాయి ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

సుష్మా స్వరాజ్ విదేశీ పర్యటన

కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అక్టోబర్-28 నుంచి 31 వరకు ఖతార్, కువైట్ దేశాల్లో పర్యటించారు. అక్టోబర్-28,29 తేదీల్లో ఖతార్ లో పర్యటించి ఆక్కడి ఉప ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ తో సమావేశమయ్యారు. పెట్రో కెమికల్స్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలలో పెట్టుబడుల కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. కువైట్ లో అక్టోబర్-30,31 తేదీల్లో పర్యటించి ఉప ప్రధాని షేక్ సబా ఖలీద్ అల్ హమద్ అల్ సబాతో సమావేశమయ్యారు.

స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఆవిష్కరణ

సమైక్య భారత నిర్మాత, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ భాయ్ పటేల్ 143వ జయంతి(పటేల్ జయంతిని రాష్ట్రీయ ఐక్యత దివస్ గా నిర్వహిస్తున్నారు.) సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 182 మీటర్ల (597 అడుగులు) సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2018,అక్టోబర్ -31 న ఆవిష్కరించారు. దీన్ని గుజరాత్ లోని నర్మదా నదీ తీరాన కేవడియా వద్ద సాధుబెల్ లో ఏర్పాటు చేశారు. దీని రూపశిల్పి రామ్ వంజి సుతార్.ఇది ప్రపంచంలోనే అత్యంత కాంక్రీట్ వాడిన రెండో 1210 మీటర్ల పొడవైన కాంక్రీట్ గ్రావిటీ డ్యాం. విగ్రహ నిర్మాణ వ్యయం రూ.2,989 కోట్లు. ఈ విగ్రహ ప్రాజెక్టు మొత్తం పరిధి 19,700.మీ..పర్యాటకులు ఈ విగ్రహ సమీపంలోని ప్రకృతి అందాలను చూసేందుకు విగ్రహం లోపల 135 మీటర్ల ఎత్తులో గ్యాలరీ ఏర్పాటు చేశారు.ఈ విగ్రహ నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను L&T చేపట్టి రికార్డు స్థాయిలో 33 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేశారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తర్వాత ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తైన విగ్రహంగా చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ విగ్రహం(153 మీ.)నిలిచింది.

సౌర జలసంధి పథకం

సౌర జలసంధి పథకాన్ని ఒడిశాలో ప్రవేశపెట్టారు. సౌర విద్యుత్ ను వ్యవసాయ సాగుకు అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ పథకంలో భాగంగా 90 శాతం సబ్సిడీతో 3000 సోలార్ పంపు సెట్లను రైతులకు అందిస్తారు.దీనికోసం రూ.27.18 కోట్లు కేటాయించారు.

సమృద్ధి పథకం

ఎస్సీ,ఎస్టీలను పరిశ్రమల స్థాపన వైపు ప్రోత్సహించేందుకు 800 కోట్లతో కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన సమృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా 25,000 మందికి రూ.10 లక్షల గ్రాంటు అందజేస్తారు. రాబోయే మూడేళ్లలో ఏటా 10,000 మందికి లబ్ది చేకూర్చనున్నారు.

డిజిటల్ లైబ్రరీలను ప్రారంభించిన ఫేస్ బుక్

సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్ బుక్ అక్టోబర్ 296-భారతీయ భాషల్లో (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ)డిజిటల్ లైబ్రరీలను ప్రారంభించింది. 2018 చివరి నాటికి భారత్ లో 3లక్షల మందిని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే దీని ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా యువత, మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ సదుపాయాన్ని ఫేస్ బుక్ కల్పించింది.

ఈశాన్య రాష్ట్రాల ఒలింపిక్ క్రీడలు

ఈశాన్య రాష్ట్రాల ఒలింపిక్ క్రీడల్ని తొలిసారి అక్టోబర్ -24 నుంచి 29 వరకు మణిపూర్ రాజధాని ఇంఫాల్ లోని కుమాన్ లంపాక్ స్టేడియంలో 12 విభాగాల్లో క్రీడలు నిర్వహించారు. మణిపూర్ ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచింది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 2019 లో వీటిని అరుణాచల్ ప్రదేశ్ లో నిర్వహించనున్నారు.

ట్రైన్-18 ప్రవేశం

దేశంలో తొలి ఇంజిన్ రహిత సెమీ హైస్పీడ్ రైలుని మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మించింది.దీని వ్యయం 100 కోట్లు,ఇది గరిష్ఠంగా గంటకు 160 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది.

రాష్ట్రపతికి గవర్నర్ల కమిటీ నివేదిక

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం కేంద్రం నియమించిన గవర్నర్ల కమిటీ ఇటీవల నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. ఈ కమిటీకి ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ నేతృత్వం వహించారు. 21 సూచనలతో ప్రతి జిల్లాలో రైతు ఆత్మహత్యల నివారణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ప్రీమియం తగ్గించాలని, కొన్ని ముఖ్యమైన పథకాల్లో కేంద్ర,రాష్ట్రాల వాటా 90:10 ఉండాలని ఈ నివేదిక పేర్కొంది.

సుప్రీంకోర్ట్ కు నలుగురు న్యాయమూర్తులు

సుప్రీం కోర్టుకు నలుగురు న్యాయమూర్తులను నియమించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని కొలీజియం 2018,అక్టోబర్ 30న కేంద్రానికి సిఫారసు చేసింది. దీనికి ఆమోదం తెలిపిన కేంద్రం 2018,నవంబరు 1న నాలుగు వేర్వేరు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు జడ్జిలుగా కల్పించింది.

తెలంగాణకు చెందిన గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ M.R.షా, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా, త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు. వీరు 2018,నవంబరు-2న సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ నలుగురితో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది. దీంతో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 31.

పెరిగిన సుప్రీంకోర్టు ధర్మాసనాలు

సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారంతో వీరి సంఖ్య 28కి చేరింది. ఈ నేపధ్యంలో ధర్మాసనాల సంఖ్య పెంచాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ 2018, నవంబర్-13న నిర్ణయించారు. ఇప్పటివరకు 11గా ఉన్న ధర్మాసనాల సంఖ్య 14కు పెరిగింది.

12వ ధర్మాసనంలో జస్టిస్ AM ఖాన్విల్కర్, జస్టిస్ దీపక్ గుప్తా; 13వ ధర్మాసనంలో జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ MR షా; 14వ ధర్మాసనంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అజయ్ రస్తోగి వాదనలు వింటారు.

నూతన రోస్టర్ విధానం నవంబరు-19 నుంచి అమలులోకి వస్తుంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి వింటారు. సబ్జెక్టులవారీగా రోస్టర్ విధానాన్ని మాజీ CJI దీపక్ మిశ్రా 2018,ఫిబ్రవరిలో ప్రారంభించారు.

జీఎస్టీ వసూళ్లు రూ.1,00,710 కోట్లు

2018, నవంబరు 1న ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2018,అక్టోబరులో రూ.1,00,710 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి.వస్తు సేవల పన్ను వసూళ్లు 5 నెలల తర్వాత మళ్లీ లక్ష కోట్లు దాటాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటున నెలకు లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లు జరగాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అయితే ఒక్క ఏప్రిల్ మినహా ఏ నెలలోనూ లక్ష కోట్లు వసూలు కాలేదు.

అక్టోబర్ లో వసూలైన లక్ష కోట్ల రూపాయల్లో సెంట్రల్ జీఎస్టీ రూ.16,464 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.22,826 కోట్లు, సమీకృత జీఎస్టీ రూ.53,419 కోట్లు, సెస్ కింద మరో రూ.8000కోట్లు ఉన్నాయి.

సులభతర వాణిజ్య సూచీ

2018, అక్టోబర్ 31 ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన డూయింగ్ బిజినెస్-2019′ నివేదికలో భారత్ 77వ ర్యాంక్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లోని పరిస్థితులను పది పరిమితుల ఆధారంగా అంచనా వేసి ప్రపంచ బ్యాంకు ఈ ర్యాంకును ప్రకటించింది.

గతేడాది 100వ ర్యాంకులో ఉన్న భారత్ ఏకంగా 23 ర్యాంకుల్ని అధిగమించి 77కు చేరుకుంది.

మోదీ సర్కారు 2014లో కేంద్రంలో కొలువుతీరే నాటికి ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభతర వ్యాపార విధానాలు) ర్యాంకుల్లో 142వ స్థానంలో ఉంది.

190 దేశాల తాజా నివేదికలో వ్యాపార సులభతర విషయంలో న్యూజిలాండ్ తొలి స్థానంలో నిలిచింది. సింగపూర్, డెన్మార్క్, హాంగాంగ్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికా 8, చైనా 46, పాకిస్థాన్ 136వ స్థానాల్లో నిలిచాయి.

అవనిహతం

గత రెండు సంవత్సరాలుగా మహారాష్ట్రలో 14 మందిని చంపిన పులిని అవనిని అధికారాలు యావత్మాల్ అడవుల్లో కాల్చి చంపడం తీవ్ర వివాదస్పదం అయింది. T1గా పిలువబడే ఈ పులిని మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతితో షఫత్ అలీఖాన్, అస్ఘర్ అలీఖాన్ వేటాడారు.

AR రెహమాన్ బయోగ్రఫీ ఆవిష్కరణ

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు AR రెహమాన్ జీవిత చరిత్రను నోట్స్ ఆఫ్ ఎ డ్రీమ్: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ AR రెహమాన్పేరుతో ప్రముఖ రచయిత కృష్ణత్రిలోక్ రాశారు. ఈ పుస్తకాన్ని ఇటీవల ముంబాయిలో ఆవిష్కరించారు. తొలి చిత్రం రోజాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికైన రెహమాన్ 2016, ఆగష్టు-15న ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో సంగీత కచేరి నిర్వహించి MS.సుబ్బలక్ష్మి తర్వాత ఆ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా నిలిచాడు. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గానూ రెండు ఆస్కార్ అవార్డులు గెలుపొందారు.

AP లో కేంద్రీయ గిరిజన వర్సిటీ

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా రెల్లీలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర క్యాబినేట్ నవంబర్-8న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. AP విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో 6వ అంశం కింద ఇచ్చిన హామీకి అనుగుణంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టంలో మార్పులు చేసి ఏర్పాటు చేయనున్నారు. దీనికి తొలి దశలో రూ.420 కోట్లు కేటాయించనున్నారు. 2019-20 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కర్ణాటక ఉప ఎన్నిక ఫలితాలు

కర్ణాటకలో మూడు లోక్ సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్జెడిఎస్ కూటమి విజయం సాధించింది. శివ మొగ్గలో బీజేపీ అభ్యర్ధి బీవై రాఘవేంద్ర విజయం సాధించగా బళ్లారి, మాండ్య లోక్ సభ స్థానాలను జమఖండి, రామనగర అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్జేడీఎస్ కూటమి గెలుచుకుంది.

ఒడిశా రైతుల సమస్యలపై కమిటీ

ప్రతిష్ట, ధర, పెన్షన్అనే అంశాలపై గత కొన్ని రోజులుగా నవ నిర్మాణ్ కృషక్ సంఘటన్పేరుతో ఒడిశా రైతాంగం ఉద్యమిస్తోంది.ఈ సమస్యల పరిష్కారంపై అధ్యయనానికి ఒడిశా ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఆ రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి శశిభూషణ్ బెహెరా నేతృత్వం వహిస్తున్నారు.

UP లో పేర్ల మార్పు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవలే అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చగా ఇప్పుడు మరికొన్ని నగరాల పేర్లను మార్చనున్నట్లు ప్రకటించారు. ఫైజాబాద్ పేరు అయోధ్యగా, ఆయోధ్య ఎయిర్ పోర్ట్ ను రామ ఎయిర్ పోర్ట్ గా, మెడికల్ కాలేజీ పేరును రాముడి తండ్రి దశరథుడి పేరుతో మారుస్తున్నట్లుగా ప్రకటించారు. లక్నోలోని ఎకనా క్రికెట్ స్టేడియం పేరును భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయీస్టేడియంగా మార్చారు.

అతిపెద్ద హాస్పిటల్ ఏర్పాటుకు ఆమోదం

బిహార్ రాష్ట్రంలోని పాట్నా మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ను ప్రపంచంలోనే అతిపెద్ద ఆసుపత్రిగా మార్చేందుకు బిహార్ క్యాబినేట్ ఆమోదించింది. ఇప్పటివరకు 3,500 పడకలతో సెర్బియా రాజధాని బెల్ గ్రేడ్ లో ఉన్న ఆసుపత్రే ప్రపంచంలో అతిపెద్ద ఆసుపత్రిగా రికార్డుల్లో ఉంది. బిహార్ లో నిర్మించనున్న ఆసుపత్రిని 5,462 పడకలతో రూ. 5,540 కోట్లతో నిర్మించనున్నారు. ఈ ఆసుపత్రిలో 36 సూపర్ స్పెషాలిటీ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు.

మహిళా ఈహాత్

మహిళా రైతులను ప్రోత్సహించేందుకు, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మహిళా ఈహాత్పేరుతో వెబ్ పోర్టల్ ను ప్రవేశపెట్టింది. అక్టోబర్-26 నుంచి నవంబర్-4 వరకు ఢిల్లీలో జరిగిన 5వ జాతీయ మహిళా రైతుల సేంద్రీయ సమ్మేళనంలో దీనిని ప్రారంభించారు. దీని ద్వారా సేంద్రియ పంటలను పండిస్తున్న మహిళా రైతులను వాటిని కొనుగోలు చేసే పెట్టుబడిదారులను ఒకే వేదిక పైకి తీసుకురానున్నారు.

ఫిన్ టెక్ ఫెస్టివల్ లో మోదీ

ప్రపంచంలోనే డేటా వినియోగంలో ఇండియా 2వ స్థానంలో ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రెండు రోజుల సింగపూర్ పర్యటనలో ఉన్న మోదీ నవంబర్-14న ప్రతిష్ఠాత్మక ఫిన్ టెక్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ పరంగా వరల్డ్ లోనే అతిపెద్ద ఈవెంట్ గా పేరు గాంచిన ఫిన్ టెక్ ఫెస్టివల్ లో ప్రసంగించిన తొలి ప్రభుత్వ నేతగా మోదీ రికార్డు సృష్టించారు. సింగపూర్ ఉపప్రధాని షణ్ముగరత్నంతో కలిసి అపిక్స్‘(అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ ఎక్స్ఛేంజ్) టెక్నాలజీని ప్రధాని ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకు అకౌంట్ లేని 200కోట్ల మందికి బ్యాంకింగ్ సేవలను చేరువ చేసేందుకు బోస్టన్ కు చెందిన వర్చుసా కంపెనీ ఈ అప్లికేషన్ ను రూపొందించింది. ఇండియా సహా 23 దేశాల ప్రజలకు ఈ అప్లికేషన్ అందుబాటులోకి రానుంది. 2016 నుంచి ఫిన్ టెక్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు.

నవంబర్-15న సింగపూర్ లో జరిగిన 13వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు(EAS)లో ప్రధాని మోదీ ప్రసంగించారు. తూర్పు ఆసియా కూటమిలో 10 ఏషియాన్ దేశాలు(బ్రూనై, కాంబోడియా, లావోస్, మయన్మార్, ఇండోనేషియా, థాయ్ లాండ్, సింగపూర్, మలేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం)తో పాటు భారత్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, రష్యా, అమెరికాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఏషియాన్)- భారత్ శిఖరాగ్ర సదస్సులోనూ మోదీ పాల్గొన్నారు.

కేరళ ఉచిత విద్య

2017 నవంబర్ లో కేరళ, శ్రీలంక, మాల్దీవులలో ఒఖి తుఫాను తీవ్ర విధ్వంసం సృష్టించి భారత్ లోనే 210 మరణాలకు కారణమైంది. ఈ బాధిత కుటుంబాలలోని 194 మంది పిల్లలకు ఉచిత విద్యనందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ముఖ్యమంత్రి విపత్తు ఉపశమన నిధి నుంచి రూ.13.92 కోట్లు కేటాయించింది. LKG నుంచి 5వ తరగతి వరకు సంవత్సరానికి రూ.10వేలు, 6 నుంచి 10వ తరగతి వరకు రూ.25వేలు, ఇంటర్ లో రూ.30వేలు, డిగ్రీలో సంవత్సరానికి రూ.లక్ష చొప్పున అందించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు 2037 వరకు కొనసాగనుంది.

75 రూపాయల నాణెం

సుభాష్ చంద్రబోస్ 1943 డిసెంబర్-30న పోర్ట్ బ్లెయిర్ లోని సెల్యులార్ జైలులో జాతీయ జెండా ఎగరవేసి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 75 రూపాయల ప్రత్యేక నాణెం విడుదల చేయాలని ఇటీవల ఆర్ధిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సుభాష్ చంద్రబోస్ జాతీయ జెండాకు వందనం చేస్తున్న చిత్రాన్ని నాణెం వెనుక భాగంలో ముద్రించనున్నారు.

డిగ్రీ బాలికలకు బిహార్ ఆర్ధికసాయం

2018 ఏప్రిల్-25, ఆ తదుపరి నుంచి డిగ్రీ చదివిన ప్రతి బాలికకు రూ.25వేలు ఆర్ధికసాయం అందించాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిర్ణయించారు. మతం, ప్రాంతం, ఉత్తీర్ణత గ్రేడ్ లతే సంబంధం లేకుండా ఒకే దశలో ఆర్ధిక మొత్తం అందించనున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.300కోట్లు కేటాయించింది. పుట్టినప్పటి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ప్రతి బాలికకు రూ.54వేలు అందించే బృహత్తర పథకంలో ఇది ఒక భాగంగా పేర్కొన్నారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

2018,డిసెంబర్-11 నుంచి 2019 జనవరి-8 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ లో జరిగే ఈ సమావేశాలను 5 రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా డిసెంబరుకు మార్చారు.

పాఠశాలలకు GPS అనుసంధానం

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను GPSతో అనుసంధానించనున్నట్లు నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫియొ రియొ ప్రకటించారు. దీనిలో భాగంగా అన్ని సర్కారు బడుల రికార్డులను డిజిటలైజ్ చేయడమే కాకుండా కంప్యూటీకరణ చేస్తారు.

అత్యంత రద్దీ నగరం బెంగళూరు

నేషనల్ బ్యూరో ఆన్ ఎకనామిక్ రీసెర్చ్ ఇటీవల విడుదల చేసిన వివరాల ప్రకారం దేశంలోని అత్యంత రద్దీ గల 10 నగరాలలో బెంగళూరు మొదటిస్థానంలో నిలిచింది. “మొబిలిటీ అండ్ కంజెషన్ ఇన్ అర్బన్ ఇండియాపేరుతో వెలువడిన జాబితాలో ముంబాయి, ఢిల్లీ, చెన్నై, కోల్ కతాలు తరువాత స్థానాలలో నిలువగా హైదరాబాద్ 6వ స్థానంలో నిలిచింది.

మహిళల కోసం సంగ్వారిపోలింగ్ బూత్ లు

ఛత్తీస్ గఢ్ లో మహిళా ఓటర్లను అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేసేలా సమాయత్తం చేసేందుకు ఎన్నికల సంఘం సంగ్వారిపోలింగ్ బూత్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఛత్తీస్ గఢ్ మాండలికంలో సంగ్వారిఅనగా స్నేహితులుఅని అర్ధం. ఈ పోలింగ్ బూత్ లలో మొత్తం మహిళా సిబ్బందినే నియమిస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 5 సంగ్వారి పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేస్తున్నారు.

HRDలో నూతన ప్రోగ్రాంలు

మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యలో ప్రమాణాల పెంపుదల కోసం లీప్, అర్పిత్ అనే రెండు ప్రోగ్రాంలను ప్రారంభించింది. లీప్ (లీడర్ షిప్ ఫర్ అకాడమిషన్స్) అనేది 15 ఉన్నత విద్యాసంస్థలలోని జూనియర్ ఫ్యాకల్టీలకి 3 వారాల శిక్షణ కార్యక్రమం. దీనిలో రెండు వారాలు ఇండియాలో శిక్షణ ఇస్తారు. మిగతా వారం ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీలో ఒప్పందం ద్వారా శిక్షణ అందిస్తారు. అర్పిత్ (ఆన్యువల్ రీఫ్రెషర్ ప్రోగ్రాం ఇన్ టీచింగ్)అనేది దేశంలో ఉన్నత విద్యను అందిస్తున్న 15 లక్షల మంది ఉపాధ్యాయులలో ప్రమాణాలు పెంచేందుకు ఉద్దేశించిన పథకం.

కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారిగా తొలిమహిళ

దేశ చరిత్రలోనే కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సేవలందించిన తొలి మహిళ VS.రమాదేవి. తొలి తెలుగు వ్యక్తి ఈమెనే కావడం విశేషం. 26 నవంబర్,1990 నుంచి డిసెంబర్-11 వరకు పదవిలో కొనసాగారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా వ్యవహరించారు.

యునిసెఫ్ ఇండియా రాయబారిగా హిమదాస్

భారత స్టార్ స్ప్రింటర్ హిమదాస్ ఐక్యరాజ్యసమితిలో భారత్ తరపున యునిసెఫ్ కు తొలి యూత్ అంబాసిడర్ గా ఎంపికైంది. యునిసెఫ్ ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఆమె ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో బంగారు పతకం కైవసం చేసుకుంది.

హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

దేశంలోని 4 ప్రధాన హైకోర్టులు అయిన అలహాబాద్, పాట్నా, మధ్యప్రదేశ్, త్రిపురలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నవంబర్-10న నియమించారు.త్రిపురకు జస్టిస్ సంజయ్ కరోల్,అలహాబాద్ కు జస్టిస్ గోవింద్ మాథుర్, మధ్యప్రదేశ్ కు SK సేథ్, పాట్నా హైకోర్టుకు AP సాహి ప్రధాన న్యాయమూర్తులుగా రానున్నారు.

విశాఖలో క్రూయిజ్ టర్మినల్

ఆంధ్రప్రదేశ్ లో సముద్ర పర్యాటకాన్ని ప్రోత్సహించే విధంగా అత్యాధునిక వసతులతో క్రూయిజ్ టర్మినల్ ను విశాఖలో నిర్మించబోతున్నారు. రూ.80 కోట్ల వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యాటక శాఖ రూ.40కోట్లను మంజూరు చేయబోతుంది. శ్రీలంక నుంచి మొదటి క్రూయిజ్ నౌక వచ్చే నెలలో రానుంది.

CBDTలో నియామకాలు

న్యూఢిల్లీ కేంద్రంగా1944 నుంచి కొనసాగుతున్న కేంద్ర ప్రత్యక్ష పన్నుల సంఘంలో 1982 IRS బ్యాచ్ కు చెందిన PK దాస్, అఖిలేష్ రంజన్, నీనా కుమార్ లు నూతన సభ్యులుగా ఎన్నికయ్యారు. 6 సభ్యులు గల ఈ సంస్థకు సుశీల్ చంద్ర ఛైర్మన్ గా వ్యవహరిస్తుండగా, PC మోదీ, ఆదిత్య విక్రం సభ్యులుగా ఉన్నారు.

స్నేహలత శ్రీవాత్సవ

ఒక సంవత్సరం పదవీకాలం పొడిగించడం ద్వారా వార్తల్లోకి వచ్చిన లోక్ సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాత్సవ మధ్యప్రదేశ్ క్యాడర్ కు చెందిన 1982 IAS అధికారిణి. తొలి మహిళా సెక్రటరీ జనరల్ గా ఎంపికయ్యారు. 2019, నవంబర్-30 వరకు ఆమె పదవీకాలం పొడిగించారు.

సరిన్ కు ఫ్రాన్స్ పురస్కారం

అలయన్స్ ప్రానెయిస్ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్న ప్రముఖ ఫ్రెంచ్ భాషావేత్త జవహర్ లాల్ సరిన్ కు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్పురస్కారం లభించింది. ఫ్రెంచి భాషకు విస్తృత ప్రచారంతో పాటు, భారత్ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక సహకారం పెంపునకు చేసిన కృషికి గుర్తింపుగా ఎంపిక చేశారు. భారత్ లో ఫ్రాన్స్ రాయబారిగా ఉన్న అలెగ్జాండర్ జాగ్లర్ ఈ అవార్డును ఆయనకు అందజేశారు.

స్వాతి చతుర్వేది

సాహసవంతమైన వైఖరి, పత్రికా రచనలకుగానూ భారత ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ స్వాతి చతుర్వేదికి 2018కి గాను లండన్ ప్రెస్ ఫ్రీడం అవార్డు లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ అవార్డు పొందిన నలుగురిలో స్వాతి ఒకరు. ‘ఐయామ్ ఎట్రోల్; ఇన్ సైడ్ ద సీక్రెట్ వరల్డ్ ఆఫ్ BJPS డిజిటల్ ఆర్మీఅనే పుస్తకాన్ని ఆమె రాశారు. సోషల్ మీడియాలో వేధింపులు ఎదుర్కొన్నందుకుగానూ ఈ అవార్డు అందజేశారు.

అశోక్ కుమార్ గుప్తా

కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా(CCI) నూతన ఛైర్మన్ గా అశోక్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఇప్పటివరకు సుధీర్ మిట్టల్ ఈ పదవిలో కొనసాగుతుండగా కొత్తగా ఎన్నికైన గుప్తా 2022 వరకు ఛైర్మన్ గా కొనసాగనున్నారు.

దేశంలో తొలి ఏనుగుల ఆసుపత్రి

దేశంలోనే తొలిసారి ఏనుగుల కోసం ఆసుపత్రిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లా చుర్మురా గ్రామంలో ఏర్పాటు చేశారు. డిజిటల్ ఎక్స్ రే,లేజర్ ట్రీట్ మెంట్, అల్ట్రాసోనోగ్రఫీ తదితర సౌకర్యాలను కల్పించారు. 2010, అక్టోబర్-22న కేంద్రం ఏనుగు జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించి దేశంలో 29వేల ఏనుగుల సంరక్షణ చర్యలు చేపట్టింది. దీనికోసం 1992 నుంచే ప్రాజెక్ట్ ఎలిఫెంట్పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.

ఇండియాలో మలేరియా తగ్గుదల

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఇటీవల విడుదల చేసిన ప్రపంచ మలేరియా నివేదిక-2017′ లో 2016తో పోలిస్తే మలేరియా కేసుల సంఖ్య 24 శాతం తగ్గాయి. 2018, సెప్టెంబర్ నాటికి ప్రపంచంలో 4 శాతం మలేరియా కేసులు భారత్ నమోదవుతున్నాయని తెలిపింది. ఇండియాలో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 2,76,486 కేసులు నమోదయ్యాయి. మలేరియా మరణాలు ఇండియాలో 2017 నాటికి 194 కాగా 2018, సెప్టెంబర్ నాటికి 29కి తగ్గాయి. మనదేశంలో నమోదయ్యే కేసులలో 40శాతం వరకు ఒడిశాలోనే ఉండేవి. అక్కడ సాధించిన ప్రగతే ఈ తగ్గుదలకు కారణమైంది.

మత అధ్యయనాల కోసం జాతీయ సంస్థ

దేశంలోనే తొలిసారిగా జాతీయ మత అధ్యయనాల సంస్థను పంజాబ్ లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. గురునానక్ 550సంవత్సరాల జయంతి ఉత్సవాల సందర్భంగా దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటివరకు మతాల అధ్యయనాల కోసం ఎలాంటి సంస్థలు లేవు కాగా దీని ఏర్పాటుతో ఇదే మొదటిది కానుంది.

వజ్ర ప్రహార్ సైనిక విన్యాసాలు

భారత్అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు నవంబర్-19 నుంచి ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరగనున్న ఈ విన్యాసాలకు రాజస్థాన్ రాజధాని జైపూర్ ఆతిధ్యమిస్తోంది. భారత దళాలకు కల్నల్ సోంబిత ఘోష్ నేతృత్వం వహిస్తున్నారు.

మేఘాలయాలో ఏకలవ్య స్కూళ్లు

మేఘాలయాలోని 36 బ్లాక్ లలో 36 ఏకలవ్య స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం ప్రకటించారు. ప్రతి బ్లాక్ లో 50శాతం ఎస్టీజనాభా గల రాష్ట్రాలలో 2022 నాటికి ఏకలవ్య మోడల్ స్కూళ్లను ప్రారంభిస్తారు. ఒక్కో పాఠశాలకు 20కోట్ల చొప్పున మొత్తం 720కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 192 ఏకలవ్య పాఠశాలలుండగా కేంద్రం వీటిని 500కు పెంచాలని నిర్ణయించింది. నవోదయ పాఠశాలల లాగే ఇవి సంస్కృతి, కళలకు ప్రోత్సహిస్తూ పిల్లల్లో నైపుణ్యాలను అభివృద్ధిపరుస్తాయి.

పంజాబ్ లో హుక్కాలాంజ్ లపై నిషేధం

ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే హుక్కాబార్లు, లాంజ్ లపై పంజాబ్ ప్రభుత్వం నిషేధం విధించింది. మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత ఈ నిషేధం విధించిన మూడో భారత రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది.

మరాఠాలకు రిజర్వేషన్లు

ఆర్ధికంగా వెనకబడిన మరాఠాలకు 16శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రాష్ట్ర బీసీ కమీషన్ ఛైర్మన్ జస్టిస్ NG గైక్వాడ్ సూచన మేరకు SEBC(సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, బ్యాక్ వర్డ్ క్లాస్) అనే కేటగిరీని సృష్టించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్-15(5) ప్రకారం 50శాతానికి మించకుండా OBCలకు రిజర్వేషన్లు అందించవచ్చు అనే నియమం ఆధారంగా వీటిని అందజేస్తున్నారు.

హర్యానాలో విశ్వకర్మ స్కిల్ వర్సిటీ

దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేయనున్న శ్రీ విశ్వకర్మ స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీకి నవంబర్-19న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. దీనిని హర్యానాలోని పల్వాల్ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. దీని నిర్మాణానికి రూ.989 కోట్లు కేటాయించారు. దీంతో పాటు హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో 83 కిలోమీటర్ల కుండ్లిమనేసర్పల్వాల్ (KMP) ఎక్స్ ప్రెస్ వే, 3.2 కిలోమీటర్ల వల్లభ్ గఢ్ముజేసర్ మెట్రో రైల్ లింక్ ను మోదీ ప్రారంభించారు.

గౌ సంవృద్ధి ప్లస్ పథకం

రాష్ట్రంలోని డెయిరీ రైతులకు ఇన్సురెన్స్ కవరేజి కల్పించే నూతన పథకం గౌ సంవృద్ధి ప్లస్పథకానికి నవంబర్-16న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శ్రీకారం చుట్టారు. దీని కింద తక్కువ ప్రీమియం రేట్లతోనే ఇన్సురెన్స్ కల్పించనున్నారు. ఈ ప్రీమియంలో SC, ST రైతులకు 70శాతం, మిగతా రైతులకు 50శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు.

త్రిపురలో ఉగ్ర సంస్థల నిషేధంపై కమిటీ

త్రిపురలో గత కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న సంస్థలను ఉగ్ర సంస్థలుగా ప్రకటించే అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర హోం శాఖ జస్టిస్ సురేష్ కైత్ కమిటీని నియమించింది. ఈ కమిటీ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(NLFT), ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ (ATTF) కార్యకలాపాల్ని పరిశీలించనుంది.

జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ రద్దు

జమ్ము కాశ్మీర్ లో సస్పెండెడ్ యానిమేషన్ (సుప్త చేతనావస్థ)లో ఉన్న అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ నవంబర్-21న ప్రకటించారు. అధికారంలో ఉన్న PDP పార్టీకి BJP మద్ధతు ఉపసంహరించడంతో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో గత జూన్-19న రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు. 6నెలల గవర్నర్ పాలన డిసెంబర్-18తో ముగియనుంది. ఇప్పటికే PDP, కాంగ్రెస్ కలిసి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. మరోవైపు BJP సపోర్ట్ ఉందని పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జాద్ గవర్నర్ కు తెలపగా ఎవరికీ ఆమోదం తెలపని గవర్నర్ అసెంబ్లీని రద్దు చేశారు.

ED డైరెక్టర్ గా సంజయ్ కుమార్

ఆర్ధిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఆర్ధిక నేరాల నియంత్రణ కోసం ఏర్పడ్డ అత్యున్నత సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED)’ నూతన అధిపతిగా సంజయ్ కుమార్ మిశ్రా ఎంపికయ్యారు. ఇటీవల పదవీ విరమణ పొందిన కర్నాల్ సింగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

లోతట్టు జలమార్గాల మండలి ఛైర్మన్ గా శ్రీవాత్సవ

భారత అధికార సంస్థ లోతట్టు (ఇన్ లాండ్) జలమార్గాల మండలి ఛైర్మన్ గా జలాల్ శ్రీవాత్సవ ఎన్నికయ్యారు. ఈ సంస్థ నౌకాయన మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. గతంలో న్యూఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన కాలంలో శ్రీవాత్సవ మహిళల రక్షణ కోసం శక్తిక్యాబ్ ‘; ‘ఊర్జాయాప్స్ ప్రవేశపెట్టారు.

రాష్ట్రపతి ఆస్ట్రేలియా పర్యటన

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా 2018, నవంబర్-22న ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవడంపై ఇరువురు నేతలు జరిపిన చర్చల సందర్భంగా దివ్యాంగులకు సేవలు అందించడం, పెట్టుబడులు, శాస్త్రీయ తోడ్పాటు నవకల్పనలు, సంయుక్త PHD, వ్యవసాయ పరిశోధనలువిద్య అనే అంశాల్లో రెండు దేశాల మధ్య 5 ఒప్పందాలు కుదిరాయి.

ఇరువురు నేతలు న్యూసౌత్ వేల్స్ లో మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. రామ్ నాథ్ కోవింద్ ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ పీటర్ కాస్ గ్రోవ్ ఆహ్వానం మేరకు ఈ పర్యటనకు వెళ్లారు. ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత తొలి రాష్ట్రపతిగా వార్తల్లో నిలిచారు.

కిలోకి కొత్త నిర్వచనం

అంతర్జాతీయంగా ఇప్పటివరకూ ద్రవ్యరాశికి ప్రామాణికంగా భావిస్తూ వచ్చిన కిలోగ్రామ్ నిర్వచనం ఇకనుంచి మారనుంది. ఈ మేరకు ఒక ప్రతిపాదనను 2018, నవంబరు-16న ఫ్రాన్స్ లోని వార్సలీస్ లో జరిగిన సమావేశంలో 60 దేశాల పరిశోధకులు ఆమోదించారు.

ఇప్పటివరకు ఫ్రాన్స్ లోని సెవరెస్ ప్రాంతంలోని ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ మెజర్ మెంట్స్ లో భద్రపర్చిన 1889ప్లాటినంఇరిడియం మిశ్రమ లోహాకృతి(లీగ్రాండ్ కే)ని 129 సంవత్సరాలుగా ఖచ్చితమైన ఒక కిలోగ్రామ్ గా పరిగణిస్తూ వచ్చారు. దీన్ని 1889లో తయారు చేశారు.

వివిధ దేశాలు 40 ఏళ్లకు ఒకసారి తమ దగ్గర ఉన్న కిలోరాయిని సెవరస్ కు తీసుకెళ్లి దాని బరువుతో సరిచూసుకునేవి. దేశవ్యాప్తంగా దాన్నే ప్రమాణంగా తీసుకునేవారు. మనకైతే దిల్లీలోని నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీలో లీగ్రాండ్ కేతో పోల్చిచూసే కిలోకడ్డీ ఉంటుంది. దీన్ని నంబరు-57′ అంటారు. ప్రతి నలభై ఏళ్లకు ఒకసారి బయటకు తీసి ఈ కడ్డీతో కొలిచి చూసేవారు.

లీగ్రాండ్ కే బరువు 50మైక్రోగ్రాములు తగ్గిపోయిందని 2010లో గుర్తించారు. దీంతో భౌతిక నమూనా కిలోరాయిని కాలగర్భంలో కలిపేసి కిలోను విద్యుత్ శక్తితో కొలిచి, ‘కిబ్బుల్ బ్యాలెన్స్తో నూతన కిలోగ్రామ్ ను నిర్వచించారు. వచ్చే ఏడాది మే-20 నుంచి కిలోగ్రామ్ నూతన నిర్వచనం అమల్లోకి రానుంది. శాస్త్రజ్ఞుల తాజా నిర్ణయంతో మనం ఉపయోగిస్తున్న కిలోరాయిలో ఏ మార్పు రాదు, వీటన్నింటినీ తూచే నమూనా రాయి మాత్రమే మారింది. దాని స్థానంలో కిలోను నిర్వచించే విద్యుత్ శక్తి వచ్చింది.

దీంతోపాటు ఉష్ణోగ్రతకు ప్రామాణిక కొలత కెల్విన్, విద్యుత్ ను కొలిచే ఆంపియర్, అణువుల పరిమాణాన్ని కొలిచే మోల్ యూనిట్లను కూడా సవరించాలని తాజాగా నిర్ణయించారు.

కేంద్ర మంత్రి అనంతకుమార్ మరణం

ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్న కేంద్ర రసాయనాలు, ఎరువులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి HN అనంతకుమార్(59) 2018,నవంబర్-12న బెంగళూర్ లో మరణించారు. 1996లో భాజపా నుంచి లోక్ సభ సభ్యుడిగా పార్లమెంటులో ప్రవేశించారు. అప్పటినుంచి వరుసగా 6సార్లు Mpగా బెంగళూరు దక్షిణ నుంచి గెలుపొందారు. అనంతకుమార్ మరణంతో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖమంత్రిగా ఉన్న నరేంద్ర సింగ్ తోమర్ కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖను; గణాంకాలు,పథకాల అమలు శాఖమంత్రి సదానందగౌడకు ఎరువులు, రసాయనాల శాఖల బాధ్యతలను అప్పగించారు.

విజయ్ కుమార్ బిస్త్

సిక్కిం హైకోర్ట్ నూతన ప్రధాన న్యాయమూర్తిగా విజయ్ కుమార్ బిస్త్ నియామకమయ్యారు. ఉత్తరాఖండ్ కు చెందిన బిస్త్ 2000 నుంచి అలహాబాద్ లో ప్రాక్టీస్ ప్రారంభించి 2008లో ఉత్తరాఖండ్ జడ్జిగా నియమితులయ్యారు.

అనుపమ్ ఖేర్ రాజీనామా

ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) ఛైర్మన్ పదవికి అనుపమ్ ఖేర్ రాజీనామా చేశారు. సంస్థను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారంటూ విద్యార్ధుల నుంచి విమర్శలు రావడంతో గజేంద్ర చౌహాన్ స్థానంలో 2017, అక్టోబర్-11న అనుపమ్ ఖేర్ ను నియమించారు. ఈ సంస్థను 1960లో పుణెలో స్థాపించారు.

దీపోత్సవ్-2018

దీపావళి వేడుకల్లో భాగంగా 2018,నవంబరు-6న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో సరయూ నదీ తీరంలో అయోధ్యవాసులు నిర్వహించిన దీపోత్సవంలో 5 నిమిషాల్లోనే 3,01,152 దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. 2016లో హరియాణాలో 1,50,009 దీపాలతో దీపావళి నిర్వహించగా ఆ రికార్డును అయోధ్య దీపోత్సవ్ అధిగమించింది.

భారత పర్యటనలో ఉన్న దక్షిణ కొరియా ప్రథమ పౌరురాలు కిమ్ జంగ్ సుక్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లు దీపోత్సవ్-2018 కార్యక్రమానికి హాజరయ్యారు.

ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చనున్నట్లు ఈ కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

ఫార్చ్యున్ జాబితాలో శంతను నారాయణ్

న్యూయార్క్ కేంద్రంగా వెలువడుతున్న బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యున్‘ 2018 కి గాను ప్రకటించిన బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో అడోబ్ CEO శంతను నారాయణ్ కు 12వ స్థానం దక్కింది. 20 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో ప్రొగ్రెసివ్ ఇన్సూరెన్స్ కంపెనీ CEOట్రిసియ గ్రిఫిత్ కు మొదటి స్థానం లభించింది.

ఒబెసిటీ ప్రచారకర్తగా దీక్షిత్

మహారాష్ట్ర వైద్య, విద్య మంత్రిత్వ శాఖ ఇటీవల స్థూలకాయంపై అవగాహన కోసం చేపట్టిన కార్యక్రమానికి డాక్టర్ జగన్నాథ్ దీక్షిత్ ప్రచారకర్తగా ఎంపికయ్యారు. గతంలో వాట్సాప్ ద్వారా ఒబెసిటీపై అవగాహన కల్పించి ఆయా ప్రజలలో మంచి గుర్తింపు పొందారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments