November 2018 Current Affairs – International

ఫిజి ప్రధానిగా బైనిమరామ

ఫిజి ప్రధానిగా ఫ్రాంక్ వొరెక్ బైనిమరామ తిరిగి ఎన్నికయ్యారు. రిపబ్లిక్ ఆఫ్ ఫిజి మిలిటరీ ఫోర్సెస్ నుంచి నేతృత్వం వహిస్తున్న ఈయన 2007 జనవరి నుంచి ప్రధానిగా కొనసాగుతున్నాడు. ఇతని ప్రమాణ స్వీకారం ఆ దేశ అధ్యక్షుడు జియొజి కొన్రోట్ ఆధ్వర్యంలో జరిగింది.

యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా మిల్లి

సైన్స్ ఫిక్షన్ చిత్రం స్ట్రేంజర్ థింగ్స్‌తో పాపులర్ అయిన హాలివుడ్ నటి మిల్లి బాబి బ్రౌన్ యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఎంపికైన వారిలో ఈమెనే అతి పిన్నవయస్కురాలు కావడం విశేషం. మిల్లి బాలల హక్కులు, విద్య, హింస నుంచి రక్షణ అనే అంశాలపై పోరాడుతుంది. ప్రపంచ బాలల దినోత్సవం నవంబర్-20న యునిసెఫ్ మిల్లిని ఎంపిక చేసింది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న యునిసెఫ్ కు టోర్ హట్రెమ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

ఇజ్రాయిల్ బ్యాంక్ గవర్నర్ గా అమిర్

ఇజ్రాయిల్ దేశ సెంట్రల్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయిల్ గవర్నర్ గా అమిర్ యారోన్ ఎంపికయ్యాడు. 5 సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 2013 నుంచి తొలి మహిళ గవర్నర్ గా వ్యవహరించిన కర్నిత్ ఫ్లగ్ స్థానంలో ఆయన నియమించబడ్డారు.

మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ గా క్లారా

మయన్మార్ లోని యాంగూన్ లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో క్లారా సోసా(పరాగ్వే) విజేతగా నిలిచింది. భారత్ కు చెందిన మీనాక్షి చౌదరి తొలి రన్నరప్ గా నిలిచింది.

గ్లోబల్ పాస్ పోర్ట్ ఇండెక్స్

హెన్లీ అండ్ పార్ట్ నర్స్ సంస్థ2018 సంవత్సరం గ్లోబల్ పాస్ పోర్ట్ ఇండెక్స్ ను రూపొందించింది. దీని ప్రకారం సింగపూర్, జర్మనీ దేశాలు అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టులు కలిగిన దేశాలుగా నిలిచాయి. ఈ జాబితాలో ఇండియా, జింబాబ్వే, కిర్గిస్థాన్ సంయుక్తంగా 66వ ర్యాంక్ పొందాయి.

ఐర్లాండ్ అధ్యక్షుడిగా హిగ్గిన్స్

ఐర్లాండ్ అధ్యక్షుడిగా మైకేల్ డి హిగ్గిన్స్ వరుసగా 2వ సారి ఎన్నికయ్యారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఆయన 56శాతం ఓట్లు సంపాదించుకున్నాడు.

టర్కీలో అతిపెద్ద విమానాశ్రయం

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని టర్కీలోని ఇస్తాంబుల్ లో అక్టోబర్-29న ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రారంభించారు. టర్కీ ఆవిర్భవించి 95 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దీనిని ఆవిష్కరించారు. ఈ ఎయిర్ పోర్ట్ ద్వారా ఏటా 9కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఆ సంఖ్య 20 కోట్లకు చేరనుంది. మొత్తం 19,000 ఎకరాల్లో 6రన్ వేలతో అట్లాంటాలోని హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ రికార్డులను ఇది తిరగరాయనుంది.

ICC హాల్ ఆఫ్ ఫేమ్ లో ద్రవిడ్

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు సంపాదించుకున్న భారత దిగ్గజ బ్యాట్స్ మన్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కు 2018,నవంబర్-1ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ ట్రోఫీని తిరువనంతపురంలో మరో దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రదానం చేశారు. భారత్వెస్టిండీస్ అయిదో వన్డే ఆరంభానికి ముందు తిరువనంతపురంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

భారత్ నుంచి ఈ గౌరవం దక్కించుకున్న అయిదో ఆటగాడు ద్రవిడ్. అతడి కంటే ముందు భారత్ నుంచి బిషన్ సింగ్ బేడీ(2009), సునీల్ గవాస్కర్(2009), కపిల్ దేవ్(2010), అనిల్ కుంబ్లే(2015) లకు మాత్రమే ఈ గౌరవం దక్కింది.

రాహుల్ ద్రవిడ్ 164 టెస్టులు ఆడి 13,288 పరుగులు, 344 వన్డేలు ఆడి 10,889 చేశాడు. 36 టెస్టు సెంచరీలు, 12 వన్డే సెంచరీలు నమోదు చేశాడు.

2018 సంవత్సరానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి జూలై-1న రాహుల్ ద్రవిడ్ తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఇంగ్లండ్ మాజీ మహిళా క్రికెటర్ క్లెయిర్ టేలర్ లను హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చింది.

బ్రెజిల్ అధ్యక్షుడిగా బొల్సొనారో

సోషల్ లిబరల్ పార్టీకి చెందిన జైర్ బొల్సొనారో బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇతనికి 55.2శాతం ఓట్లు లభించాయి. ప్రస్తుత అధ్యక్షుడు మైకేల్ టెమర్ స్థానంలో బొల్సొనారో 2019, జనవరి-1న పదవిలోకి రానున్నారు.

శ్రీలంక పార్లమెంటు రద్దు

శ్రీలంక పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రకటించారు. తమ పార్టీ (యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయెన్స్-UPFA) ప్రతిపాదించిన ప్రధాన మంత్రి అభ్యర్థికి తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ఈ నిర్ణయం

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు

2018, నవంబర్-6న అమెరికాలో 435 మంది సభ్యులున్న ప్రతినిధుల సభతో పాటు సెనెట్ లో 35 స్థానాలకు మధ్యంతర ఎన్నికల పోలింగ్ నిర్వహించారు.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలకు రెఫరెండంగా భావించిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. విపక్ష డెమొక్రట్లు ప్రతినిధుల సభలో ఆధిక్యం సాధించగా, అధికార పక్షమైన రిపబ్లికన్లు సెనెట్ లో పట్టు నిలబెట్టుకున్నారు.

435 స్థానాలున్న ప్రతినిధుల సభలో ప్రస్తుతం రిపబ్లికన్లకు 235 సీట్లు, డెమొక్రట్లకు 193 సీట్లు ఉన్నాయి. సభలో ఆధిక్యం కోసం 218 సీట్లు అవసరం. తాజా ఎన్నికల్లో డెమొక్రట్లు 226 స్థానాలను, రిపబ్లికన్లు 197 సీట్లను గెలుచుకున్నారు. మరికొన్ని స్థానాల్లో తుది ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. కొత్త సభ జనవరిలో కొలువుదీరుతుంది.

అమెరికా క్రికెట్ జట్టు కెప్టెన్ గా భారతీయుడు

మాజీ అండర్ -19 ఆటగాడు, ముంబాయి మాజీ మీడియం పేసర్ ముంబాయికి చెందిన 27 ఏళ్ల సౌరభ్ నేత్రవల్కర్ అమెరికా జాతీయ క్రికెట్ సీనియర్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. 2023 వన్డే వరల్డ్ కప్ కు అర్హత టోర్నీ అయిన ICC వరల్డ్ కప్ లీగ్ డివిజన్-3 పోటీల్లో అతను USA క్రికెట్ జట్టుకు నాయకుడిగా వ్యవహరిస్తాడు. అమెరికాలో కంప్యూటర్ సైన్స్ చదివిన అతను 2010లో జరిగిన అండర్ -19 ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.

రీ ఇన్వెంటెడ్ టాయిలెట్ ఎక్స్ పో

బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్-2018, నవంబర్-6న బీజింగ్ లో రీ ఇన్వెంటెడ్ టాయిలెట్ ఎక్స్ పో‘(పునరావిష్కృత మరుగుదొడ్డి ప్రదర్శన) పేరిట ఒక సదస్సును నిర్వహించింది. పారిశుద్ధ్య రంగంలో సరికొత్త, చవకైన ఆవిష్కరణలను ఈ సందర్భంగా ప్రజల ముందుకు తీసుకొచ్చింది.

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ ధనికుల్లో ఒకరైన బిల్ గేట్స్ ఈ సదస్సుకు మానవ వ్యర్ధంతో కూడిన సీసాతో హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రపంచవ్యాప్తంగా సరిపడినన్ని మరుగుదొడ్లు లేక సతమతమవుతున్న తృతీయ ప్రపంచ దేశాల సమస్యపై అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఆయన ఈ పని చేశారు.

చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రారంభించిన టాయిలెట్ విప్లవంతో దేశంలో పారిశుద్ధ్యం గణనీయంగా మెరుగుపడుతోందని ఈ సదస్సులో బిల్ గేట్స్ ప్రశంసించారు.

ITU లో మళ్లీ భారత్

అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్స్ యూనియన్(ITU) కౌన్సిల్ లో భారత్ మళ్లీ సభ్యత్వం దక్కించుకుంది. 2019 నుంచి 2022 వరకు నాలుగేళ్ల పాటు ఈ సభ్యత్వం ఉంటుంది.

2018, నవంబరు-6న దుబాయ్ లో జరిగిన ITU సదస్సులో నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 193 ఓట్లకు గాను భారత్ కు 165 ఓట్లు వచ్చాయి. అంతర్జాతీయంగా ఎన్నికైన మొత్తం 48 దేశాల జాబితాలో 8వ స్థానం దక్కించుకుంది.

ITU దక్షిణాసియా ప్రాంతీయ కార్యాలయం, టెక్నాలజీ ఇన్నోవేషన్ కేంద్రాన్ని దిల్లీలో ఏర్పాటు చేయాలని ITU ఇటీవల నిర్ణయించింది.

భారత నూతన రాయబారులు

ఇటీవల కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాలకు నూతన రాయబారులను నియమించింది. ఇరాన్ కు గడ్డం ధర్మేంద్ర,డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు నినా షేరింగ్ లా, జపాన్ కు సంజయ్ కుమార్ వర్మ, లావోస్ కు దినకర్ ఆస్థానా లను తదుపరి రాయబారులుగా నియమించింది.

రోమ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారత చిత్రం

అక్టోబర్-18 నుంచి 28 వరకు జరిగిన రోమ్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్సినిమాను ప్రదర్శించారు.

ఐక్యరాజ్యసమితి దీపావళి స్టాంపు

ఐక్యరాజ్యసమితి నవంబర్-6న దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది. UNO సాధారణ సభలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ వెల్లడించారు. 1.15 అమెరికన్ డాలర్ల ధరతో కూడిన స్టాంపుల షీట్ ను UNO ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి స్టాంపుపై బ్యాక్ గ్రౌండ్ లో హ్యాపీ దివాళిఅని ఇంగ్లీష్ లో ముద్రించారు.

తొలి కృత్రిమ మేధ యాంకర్

చైనాకు చెందిన అధికారిక న్యూస్ ఛానల్ జిన్హువాప్రపంచంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) న్యూస్ యాంకర్ తో వార్తలు చదివించింది. ఏ మాత్రం అలసట లేకుండా 24 గంటలూ…365 రోజులూ సేవలు అందించనుందని ఆ ఛానల్ ప్రకటించింది. ప్రస్తుతం తూర్పు చైనాలోని ఝజియాంగ్ ఫ్రావిన్స్ లో జరుగుతున్న ప్రపంచ ఐదో ఇంటర్నెట్ సదస్సులో ఈ AI న్యూస్ యాంకర్ ను ఆ ఛానల్ ఆవిష్కరించింది. ఈ న్యూస్ యాంకర్ ను జిన్హువా న్యూస్ ఏజెన్సీ, చైనా సెర్చ్ ఇంజిన్ సొగోవ్.కామ్ సంయుక్తంగా రూపొందించాయి. మెషీన్ లెర్నింగ్ ద్వారా దీన్ని అభివృద్ధి చేశారు.

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు పూర్తైన సందర్భంగా 2018, నవంబర్-11న పారిస్ లో ప్రపంచ దేశాల అధినేతలు కలిసి యుద్ధంలో చనిపోయిన సైనికులకు నివాళులు అర్పించారు. పారిస్ లో చాంప్స్ఎలైసెస్ లో ఉన్న యుద్ధ స్మారకం ఆర్క్ డి ట్రియంఫెవద్ద ఈ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మొదటి ప్రపంచ యుద్ధం 1914, జూలై-28న ప్రారంభమై 1918, నవంబర్-11న ముగిసింది.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ నేతృత్వంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో, ఇంగ్లండ్ రాణీ క్వీన్ ఎలిజబెత్-2, ప్రధాని థెరిసా మే, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్, ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా మొత్తం 70 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సూపర్ హీరోల సృష్టికర్త మృతి

స్పైడర్ మ్యాన్ తదితర సూపర్ హీరోల సృష్టికర్త, హాలివుడ్ మేటి రచయిత, ఎడిటర్, పబ్లిషర్ స్టాన్ లీ(95) 2018,నవంబర్-12న లాస్ ఏంజల్స్ లో మరణించారు.

స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ఎక్స్‌మెన్, ఫెంటాస్టిక్ ఫోర్, ఇంక్రెడిబుల్ హల్క్, బ్లాక్ పాంథర్ లాంటి సూపర్ హీరో పాత్రలు ఈయన సృష్టించినవే. 1922, డిసెంబర్-28న న్యూయార్క్ లో జన్మించిన స్టాన్ లీ 1961లో మార్వెల్ కామిక్స్ లో చేరారు. అదే సంవత్సరంలో తొలిసారిగా ద ఫెంటాస్టిక్ ఫోర్పేరుతో క్యారెక్టర్లను సృష్టించిన ఆయన ఆ తర్వాత ఎన్నో సూపర్ హీరో పాత్రలకు ప్రాణం పోశారు.

హాలివుడ్ లో ఫాదర్ ఆఫ్ పాప్ కల్చర్‌గా స్టాన్లీ ఖ్యాతిగాంచారు. డాక్టర్ స్ట్రెయింజ్, కెప్టెన్ అమెరికా వంటి కామిక్ క్యారెక్టర్లను కూడా ఆయన సృష్టించారు.

ఆక్స్ ఫర్డ్ వార్షిక పదంగా టాక్సిక్

ఆక్స్ ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్-2018గా టాక్సిక్ఎంపికైంది. వివిధ సందర్భాల్లో, సంఘటనల్లో గత ఏడాదికాలంగా ప్రజలు ఈ పదాన్ని విస్తృతంగా వాడుతున్నట్లు సంస్థ పేర్కొంది. వాస్తవానికి విషపూరిత పదార్థాలను సూచించడానికి ఉపయోగించే ఈ పదాన్ని వాస్తవ వినియోగ పరిధిని దాటి కార్యాలయాలు, పాఠశాలలు, సంస్కృతులు, మానవ సంబంధాలు, ఇలా దేన్ని వివరించడానికైనా ఇదే పదాన్ని వాడుతున్నట్లు వెల్లడించింది. ‘టాక్సిక్ మాస్క్యులినిటీఅనే పదాన్ని మీటూఉద్యమం వెలుగులోకి తెచ్చిందని గుర్తుచేసింది.

ఇంటర్ పోల్ అధ్యక్షుడిగా కిమ్ జోంగ్ యాంగ్

అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్ పోల్అధ్యక్షుడిగా దక్షిణ కొరియా మాజీ పోలీసు అధికారి కిమ్ జోంగ్ యాంగ్ ఎన్నికయ్యారు. 2018, నవంబర్-21న దుబాయ్ లో జరిగిన ఇంటర్ పోల్ సర్వసభ్య సమావేశంలో ఈ పదవి కోసం పోటీపడిన రష్యా అభ్యర్థి అలెగ్జాండర్ ప్రొకొపుక్ పై మూడింట రెండొంతుల మెజారిటీతో కిమ్ గెలుపొందారు.

ఇంతకుముందు ఇంటర్ పోల్ అధ్యక్షుడిగా పనిచేసిన మెంగ్ హోంగ్ వై(చైనా) అవినీతి ఆరోపణలతో సెప్టెంబరులో తన పదవికి రాజీనామా చేశారు.

కిమ్ జోంగ్ యాంగ్ 2020 వరకూ ఈ పదవిలో ఉంటారు. ఇంటర్ పోల్ ప్రస్తుత ఉపాధ్యక్షుడైన అలెగ్జాండర్ ప్రొకొపుక్ అభ్యర్థిత్వాన్ని అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు వ్యతిరేకించాయి.

53వ స్థానంలో భారత్

స్విట్జర్లాండ్ కు చెందిన IMDబిజినెస్ స్కూల్ నైపుణ్యాలకు సంబంధించి 2018,నవంబర్-20న విడుదల చేసిన అంతర్జాతీయ వార్షిక ర్యాంకుల్లో భారత్ 53వ స్థానంలో నిలిచింది. 2017లో మన ర్యాంకు 51.

తాజా జాబితాలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉంది. నైపుణ్యాల్లో అగ్రగామిగా నిలవడంం వరుసగా ఇది 5వ సారి. ఆసియా దేశాల్లో అగ్రస్థానాల్లో నిలిచిన సింగపూర్ మాత్రం ప్రపంచ దేశాల్లో 13వ స్థానంలో ఉంది.

అభివృద్ధి చెందుతున్న, నిపుణులను ఆకర్షిస్తున్న, నిలిపి ఉంచుకుంటున్న 63 దేశాలతో ఈ జాబితా రూపొందించారు. తొలి 5-స్థానాల్లో వరుసగా స్విట్జర్లాండ్, డెన్మార్క్, నార్వే, ఆస్ట్రియా, నెదర్లాండ్స్ ఉన్నాయి.

బ్రిక్స్ దేశాల్లో బ్రెజిల్ 58, రష్యా 46,చైనా 39, దక్షిణాఫ్రికా 50 వ ర్యాంకుల్లో నిలిచాయి. వెనెజులా చివరగా 63వ స్థానంలో ఉంది.

ఉద్యోగానికి అవసరమైన నిపుణుల సంఖ్యాపరంగా మన దేశం 30వ స్థానంలో నిలిచింది. అయితే విద్యా వ్యవస్థ నాణ్యత, విద్యారంగంపై ప్రభుత్వ వ్యయాల పరంగా చూస్తే భారత్ 63వ స్థానంలో ఉంది.

ఇటలీ ప్రధాని భారత్ లో పర్యటన

ఇటలీ ప్రధాని గిసెప్పి కాంటె అక్టోబర్-30న భారత్ లో పర్యటించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మరింత సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించారు. ఈ పర్యటనలో రోబోటిక్స్, పునరుత్పాదక ఇంధన వనరులు, జెనెటిక్స్, విమానయానం, పరిశోధన రంగాలలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు.

వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ ప్రాంతీయ సమావేశం

నాలుగు రోజుల వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ ఆసియా ప్రాంతీయ సమావేశం రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరిగింది. 33 మంది ఆసియా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశానికి ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రికార్డ్ ట్రావినో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్, కస్టమ్స్ ఛైర్మన్ S.రమేశ్ సంయుక్తంగా నాయకత్వం వహించారు. డిజిటల్ కస్టమ్స్, కామర్స్ తదితర అంశాలపై చర్చించారు. ఈ కమిటీకి కునియొ మికియుర్ సెక్రెటరీ జనరల్ గా వ్యవహరిస్తుండగా దీని ప్రధాన కార్యాలయం బ్రస్సెల్స్ లో ఉంది.

సింబెక్స్-2018

2018, నవంబర్-10నుంచి 21 వరకు జరగనున్న ఇండియాసింగపూర్ ల సంయుక్త నౌకా విన్యాసాలు అండమాన్ సముద్రంలో ప్రారంభమయ్యాయి. ఈ విన్యాసాలను సింబెక్స్గా వ్యవహరిస్తున్నారు. ఈ సారి జరిగేవి 25వ విన్యాసాలు. వీటిని 1994నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సారి విన్యాసాలకు ఈస్టర్న్ ఫ్లీట్ కమాండింగ్ ఆఫీసర్ రియల్ అడ్మిరల్ దినీష్ కె త్రివేది నేతృత్వం వహిస్తున్నారు.

5వ ప్రపంచ ఇంటర్నెట్ సదస్సు

5వ ప్రపంచ ఇంటర్నెట్ సదస్సు నవంబర్-7 నుంచి 9 వరకు చైనాలోని వుహెస్ నగరంలో జరిగింది. ఈ సదస్సును తొలిసారి 2014లో నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ రంగంలో వచ్చిన 15-అత్యుత్తమ ఆవిష్కరణలని ఆమోదించడం, ఇంటర్నెట్ స్పీడ్, సెక్యూరిటీని పెంచే 400 ప్రాజెక్టులను ప్రోత్సహించడం దీని ఉద్దేశం.

సన్ స్క్రీన్ లోషన్స్ పై నిషేధం

ప్రవాళభిత్తికలు(రీఫ్స్)కి హాని కలిగించే సన్ స్క్రీన్ లోషన్స్ ను నిషేధించడం ద్వారా ఆ ప్రత్యేకత పొందిన ప్రపంచంలోని తొలి దేశంగా పలావు నిలిచింది. పశ్చిమ పసిఫిక్ దేశమైన పలావులో ఈ నిషేధం 2020 నుంచి అమల్లోకి రానుంది. సముద్ర జీవులకు హాని కలిగించే 10 రసాయనాలను కలిగి ఉన్న లోషన్లు అమ్మితే 1000 డాలర్లు జరిమానా విధిస్తారు. హవాయి ద్వీపాలు 2021 నుంచి ఇదే చట్టాన్ని అమలులోకి తేనుంది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన థాయ్ లాండ్ లోని మాయా ద్వీపాన్ని కాలుష్యం కారణంగా నిరవధికంగా మూసివేశారు.

అధిక కార్బన్‌డై ఆక్సైడ్ విడుదల దేశాలలో భారత్

ప్రపంచంలోనే అత్యధికంగా కార్బన్‌డైఆక్సైడ్ విడుదల చేసే దేశాలలో ఇండియా నిలుస్తుందని అంతర్జాతీయ నివేదిక పేర్కొంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇటీవల విడుదల చేసిన వరల్డ్ ఎనర్జీ అవుట్ లుక్నివేదికలో 2040 నాటికి ప్రపంచంలో అత్యంత ఎక్కువగా కార్బన్‌డైఆక్సైడ్ విడుదల దేశాలలో భారత్ చైనా తర్వాత 2వ స్థానంలో నిలువనుందని తెలిపింది.

బ్రిటన్ ప్రధానిపై అవిశ్వాసం

యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలన్న తీర్మానం(బ్రెగ్జిట్)కు వ్యతిరేకంగా బ్రిటన్ ప్రధాని థెరిసా మేని వ్యతిరేకిస్తూ బ్రెగ్జిట్ మంత్రి డొమినిక్ రాబ్‌తో కలిసి నలుగురు మంత్రులు రాజీనామా చేశారు. కన్జర్వేటివ్ నేత జాకబ్ వీస్ మాగ్ హౌస్ ఆఫ్ కామర్స్ లో అవిశ్వాసం ప్రతిపాదించారు. బ్రిటన్ యురోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలని 2016, జూన్-23న చేపట్టిన రెఫరెండంకు 51.89 శాతం మద్ధతు తెలిపారు.

కామన్వెల్త్ లో చేరికకు మాల్దీవుల కేబినెట్ ఆమోదం

మాల్దీవుల నూతన అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సొలిహ్ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కామన్వెల్త్ కూటమిలో తిరిగి చేరాలనే తీర్మానాన్ని ఆమోదించారు. 2016లో అబ్దుల్లా యామిన్ అబ్దుల్ గయీం నేతృత్వంలోని మాల్దీవులు ఈ కూటమి నుంచి వైదొలగింది.బ్రిటీష్ పాలిత దేశాల కూటమిగా ఏర్పడిన కామన్వెల్త్ 1926నాటి బాల్ ఫోర్ డిక్లరేషన్ ఆధారంగా 1931లో ఏర్పడింది. 53 దేశాలున్న ఈ కూటమి ప్రధాన కార్యాలయం లండన్ లో ఉంది.

పపువా న్యూగినియాలో అపెక్స్ సదస్సు

నవంబర్-17 నుంచి 18 వరకు పపువా న్యూగినియా రాజధాని పోర్ట్ మోర్సిబేలో జరిగిన ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కో ఆపరేషన్(అపెక్)సదస్సుకు ఆ దేశ ప్రధాని పీటర్ ఓ నీల్ ఛైర్మన్ గా వ్యవహరించారు. ‘హర్నెసింగ్ ఇన్ క్లూజివ్ ఆపర్చునిటీస్, ఎంబ్రాసింగ్ ది డిజిటల్ ఫ్యూచర్థీమ్ తో 2018 సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును ఎలాంటి సంయుక్త ప్రకటన లేకుండానే ముగించారు. ఇలా ప్రకటన లేకుండా సదస్సు ముగియడం 25 సంవత్సరాల అపెక్ చరిత్రలో ఇదే మొదటిసారి. తదుపరి సమావేశాలు 2019లో చిలీలో, 2020 లో న్యూజిలాండ్ లో జరగనున్నాయి. 21 దేశాలున్న అపెక్ ప్రధాన కార్యాలయం సింగపూర్ లో కలదు.

24వ కోల్ కతా అంతర్జాతీయ చిత్రోత్సవం

2018, నవంబర్-10 నుంచి 17 వరకు కోల్ కతాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవానికి ఆస్ట్రేలియా ఫోకస్ కంట్రీగా వ్యవహరించింది. ఇందులో ప్రారంభ చిత్రంగా ఆంటోని ఫిరంగిని ప్రదర్శించారు. 70 దేశాల నుంచి 171 చిత్రాలు, 150 లఘు చిత్రాలు ప్రదర్శించారు. వియత్నాంకు చెందిన ది థర్డ్ వైఫ్ఉత్తమ చిత్రంగా, అబుబాకర్ పాకి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు.

ఎరిత్రియాపై ఆంక్షల ఎత్తివేత

ఆఫ్రికా దేశమైన ఎరిత్రియాపై 2009 నుంచి కొనసాగుతున్న ఆంక్షలను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా తొలగించింది. 2444 తీర్మానం ఆధారంగా ఈ దేశంపై ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేసింది. గతంలో అల్ ఫాబబ్అనే ఉగ్రవాద సంస్థతో ఎరిత్రియాకు గల సంబంధాల ఆధారంగా UNO నిషేధం విధించింది. గత కొద్ది కాలంగా సరిహద్దు దేశాలతో వ్యవహారశైలిలో మార్పులు రావడంతో ఆంక్షల్ని తొలగించారు. 2018, జూలై– 9న ఇథియోపియా ప్రధాని అబి అహ్మద్ ఎరిత్రియా అధ్యక్షుడు ఇసాయిస్ అప్ వెర్కి శాంతి ఒప్పందంపై సంతకం చేయడంతో వివాదం ముగిసింది.

బ్రెగ్జిట్ మంత్రిగా స్టీఫెన్ బార్ల్కె

యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియ బ్రెగ్జిట్ కు మంత్రిగా స్టీఫెన్ బార్ల్కె నియమితులయ్యారు. బ్రెగ్జిట్ అంశంపై బ్రిటన్ లో 2016, జూన్-23న రెఫరెండం జరిగింది. అనుకూలంగా 51.89 శాతం ప్రజలు ఓటు వేశారు. ఇటీవల బ్రిటన్ ప్రధాని థెరిసా మే ప్రవేశపెట్టిన బ్రెగ్జిట్ ముసాయిదాకు వ్యతిరేకంగా డొమినిక్ రాభ్ రాజీనామా చేయడంతో స్టీఫెన్ ను నియమించారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments