రుతుక్రమంపై మూఢనమ్మకం : యువతి మృతి

ప్రపంచం అభివృద్ధిలో దూసుకుపోతోంది. మానవ మేధస్సు నింగికి నిచ్చెన వేస్తోంది. విశ్వంలో ఇతర గ్రహాలపై జీవాన్వేషణ కోసం మనిషి జువ్వున దూసుకుపోతున్నాడు. కానీ ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే. చీకట్లు, వేదనలు, వేధింపులు, మూఢనమ్మకాలు, ఆకలి కేకలు మరో వైపు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సామాజిక దురాచారాలకు మహిళలు ఇంకా బలవుతూనే ఉన్నారు. నేపాల్ లో ఈ ఏడాది జనవరి 31న జరిగిన ఓ ఘటన.. ఈ ప్రపంచంలో లింగ సమానత ఇంకా సుదూరంలో ఉందని చెబుతోంది. నేపాల్ లోని మారుమూల జిల్లా దోతిలో రుతుక్రమంపై కొన్నిజాతుల్లో ఉన్న మూఢనమ్మకం 21 ఏళ్ల యువతి ప్రాణం తీసింది. రుతుక్రమంలో ఉన్న పార్వతి అనే 21 ఏళ్ల యువతిని ఇంటి నుంచి బయటకు పంపించారు. ఊరి చివరన ఉన్న ఓ గుడిసెలో 3 రోజులు ఎవరికి కనపడకుండా ఉండాలి.…

Read More