మెషీన్ తో వరినాట్లు

కూలీల కొరత రైతులకు ప్రధాన అడ్డంకిగా మారినందున … వ్యవసాయంలో యాంత్రీకరణ ఆవశ్యకత మరింత పెరుగుతోంది. ప్రస్తుత వరి నాట్ల సీజన్ లో చాలా చోట్ల కూలీలు దొరకడం లేదు. దొరికినా నాట్లు వేసేందుకు ఖర్చు ఎక్కువ అవుతోంది. ఈ ఇబ్బందని అధిగమించేందుకు తెలంగాణ, ఏపీలో అనేక చోట్ల నాట్లు వేసేందుకు రైతులు యంత్రాలు వాడుతున్నారు. అతి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో నాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో… వరినాట్ల మెషీన్ పనితీరుపై అవగాహన కల్పించేందుకే ఈ వీడియో.. !!  

Read More

Daily Current Affairs – September 26 – 2018

☛ ధోని కెప్టెన్ @ 200వ వన్డే మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా 200వ వన్డేలు పూర్తి చేసుకున్నాడు. ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ 25న ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ధోని ఈ నంబర్ ను అందుకున్నాడు. వాస్తవానికి ధోని 2016లోనే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. రెండేళ్ల కిందట విశాఖపట్నంలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ ధోనికి కెప్టెన్ గా 199వ ది. ఆసియా కప్ లో భాగంగా ఆఫ్గనిస్తాన్ తో మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో… ధోని కెప్టెన్ గా అనూహ్యంగా బరిలో దిగాల్సి వచ్చింది. ☛ శ్రీలంకతో టీ20 సీరీస్ ను 4-0తో నెగ్గిన భారత్ మహిళల జట్టు శ్రీలంకతో జరిగిన 5 మ్యాచ్ లో టీ20 సీరీస్ ను భారత్ మహిళల…

Read More