పవన్ మౌనం.. ఏంటో వ్యూహం.. !

ప్రశ్నించేందుకే అంటు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. జనసేనతో ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. శ్రీకాకుళం ఉద్దానం కిడ్నీ సమస్య, ఉత్తరాంధ్ర వెనకబాటుతనం వంటి విషయాల్లో ఆలోచింపజేసే విధానాలతో ఆకట్టుకున్నారు. కానీ.. సినిమాల్లో లాగే.. రాజకీయాల్లోను ఆయనలో కంటిన్యుటీ లోపించినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను ప్రభావితం చేయగలిగే పలు సంఘటనలు ఇటీవల జరిగినా.. పవన్ మాత్రం వాటిపై కనీసం తమ పార్టీ విధానం ఏంటన్నది క్లారిటీ ఇవ్వలేదు. పార్టీలో పేరున్న లీడర్, ప్రజల దృష్టిని గ్రాబ్ చేయగల నాయకుడు ఆయన ఒక్కరే కాబట్టి… రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై జనసేన స్టాండ్ ని సహజంగా ఆయన నోటి నుంచే వినాలని అంతా అనుకుంటారు. కానీ పవన్ మాత్రం చాలా అంశాలపై మౌనమే సమాధానమనే ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోంది.…

Read More

Daily Current Affairs – MCQs – September 21 – 2018

☛ విరాట్, మీరాలకు “ఖేల్ రత్న” అవార్డు కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ క్రీడా అవార్డులు – 2018ని సెప్టెంబర్ 20న అధికారికంగా ప్రకటించింది. ఇద్దరికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 8 మంది కోచ్ లకు ద్రోణాచార్య, నలుగురికి జీవితకాల పురస్కారం, 20 మందికి అర్జున అవార్డు, నలుగురికి ధ్యాన్ చంద్ అవార్డు ప్రకటించింది. క్రికెట్ నుంచి సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని తర్వాత రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికైన మూడో క్రికెటర్ విరాట్ కోహ్లీ తెలుగువారైన టేబుల్ టెన్నిస్ కోచ్ శ్రీనివాసరావుకు ద్రోణా చార్య అవార్డు దక్కింది. తెలంగాణ డబుల్స్ స్టార్ షట్లర్ సిక్కిరెడ్డి అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డు విజేతలు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న : విరాట్ కోహ్లీ(క్రికెటర్), మీరాబాయి చాను(వెయిట్ లిఫ్టర్) ద్రోణాచార్య : ఆచయ్య కుట్టప్ప(బాక్సింగ్), విజయ్…

Read More

Daily Current Affairs, MCQs, September 19 – 2018

☛ భారత్ – బంగ్లాదేశ్ పైప్ లైన్ నిర్మాణం ప్రారంభం భారత్ – బంగ్లాదేశ్ మధ్య పైప్ లైన్ నిర్మాణ పనులు సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు దేశాల మధ్య నిర్మించనున్న 130 కిలో మీటర్ల ఫ్రెండ్ షిప్ పైప్ లైన్ నిర్మాణ పనులని ప్రారంభించారు. ఈ పైప్ లైన్ ద్వారా భారత్ నుంచి బంగ్లాకు ఆయిల్ ను సరఫరా చేస్తారు. ఏడాదికి 10 లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్ ను సరఫరా చేసే సామర్థ్యం ఉంటుంది. పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి, బంగ్లాదేశ్ లోని దినాజ్ పూర్ జిల్లాలోని పర్సతిపూర్ ను ఈ పైప్ లైన్ అనుసంధానం చేస్తుంది. ☛ ద్యుతీచంద్ పై పుస్తకం రాయనున్న సందీప్…

Read More

Daily Current Affairs–MCQs-September 12, 13 – 2018

PM-AASHA కు కేంద్ర కేబినెట్ ఆమోదం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా ప్రధాన మంత్రి – అన్నదాత ఆయ్ (ఆదాయ) సంరక్షణ అభియాన్ – PM AASHA పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్.. ఈ మేరకు పథకానికి అంగీకార ముద్ర వేసింది. పీఎం ఆశ పథకాన్ని అమలు చేసేందుకు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలకు రూ. 15 వేల కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఈ ఏడాది కేంద్రం ఉత్పత్తి వ్యయంలో 1.5 రెట్లు ప్రాతిపదికన కనీస మద్దతు ధర నిర్ణయించింది. మద్దతు ధర కోసం ప్రస్తుతం… ధర మద్దతు పథకం (PSS), ధర లోటు చెల్లింపు పథకం(PDPS), ప్రైవేటు ప్రొక్యూర్ మెంట్ మరియు స్టాకిస్ట్ పథకం(PPS) అమల్లో…

Read More

డైలీ కరెంట్ అఫైర్స్, సెప్టెంబర్ 2 – 2018

హామిల్టన్ కు ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్ మెర్సిడీస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్.. ఇటలీ గ్రాండ్‌ ప్రి ఫార్ములావన్ రేసు విజేతగా నిలిచాడు. ఇటలీలోని మోంజాలో సెప్టెంబర్ 2న జరిగిన రేసులో హామిల్టన్ 53 ల్యాప్‌ల దూరాన్ని గంటా 16 నిమిషాల 54.484 సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఫెరారీ డ్రైవర్ రైకోనెన్ రెండో స్థానం, మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ మూడో స్థానం, ఫెరారీ మరో డ్రైవర్ వెటెల్ నాలుగో స్థానం దక్కించుకున్నారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. ఆసియా క్రీడలు – 2018 ఇండోనేషియాలోని జకార్తా, పాలెంబాంగ్ నగరాల్లో 2018 ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు 18వ ఆసియా క్రీడలు జరిగాయి. ఈ క్రీడల్లో 45 దేశాలు పాల్గొన్నాయి. ఈ క్రీడల్లో…

Read More

“ఎ ఇయర్ ఇన్ ఆఫీస్” పుస్తక ఆవిష్కరణ

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రచించిన “మూవింగ్ ఆన్, మూవింగ్ ఫార్వర్డ్: ఎ ఇయర్ ఇన్ ఆఫీస్” పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సెప్టెంబర్ 2న జరిగిన కార్యక్రమంలో మోదీ ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా ఏడాది కాలంలో తన అనుభవాలను వివరిస్తు వెంకయ్యనాయుడు ఈ పుస్తకాన్ని రచించారు. మాదిరి ప్రశ్న “మూవింగ్ ఆన్, మూవింగ్ ఫార్వర్డ్: ఎ ఇయర్ ఇన్ ఆఫీస్” పుస్తక రచయిత ఎవరు ? వెంకయ్య నాయుడు నరేంద్ర మోదీ రామ్ నాథ్ కోవింద్ అమిత్ షా జవాబు: వెంకయ్య నాయుడు

Read More

కఠ్మాండులో 4వ బిమ్స్ టెక్ సమావేశం

4వ బిమ్స్ టెక్ సమావేశం నేపాల్ రాజధాని కఠ్మాండులో ఆగస్టు 30 – 31 తేదీల్లో జరిగింది. ఈ సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ.. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలపై పోరులో బిమ్స్ టెక్ దేశాలు సహకరించుకోవాలని అన్నారు. సభ్య దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక, రవాణా, డిజిటల్ సంబంధాలను మెరుగుపరిచేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బిమ్స్ టెక్ (బంగాళాఖాత దేశాల ఆర్థిక సహకార సంస్థ)లో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్ లాండ్, భూటాన్, నేపాల్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రపంచ జనాభాలో ఈ దేశాల మొత్తం వాటా 22 శాతంగా ఉంటుంది. బిమ్స్ టెక్ దేశాల జీడీపీ 2.8 ట్రిలియన్ డాలర్లు. మాదిరి ప్రశ్నలు 4వ బిమ్స్ టెక్ సమావేశంలో ఇటీవల…

Read More

రాక్సౌల్ – కఠ్మాండు రైల్వే పై భారత్ – నేపాల్ మధ్య ఒప్పందం

బిహార్ లోని రాక్సౌల్ నగరాన్ని నేపాల్ రాజధాని కఠ్మాండుతో అనుసంధానించే రైల్వే లైన్ నిర్మాణానికి భారత్, నేపాల్ మధ్య ఒప్పందం కుదిరింది. నేపాల్ రాజధాని కఠ్మాండులో ఆగస్టు 30-31 వరకు జరిగిన 4వ బిమ్ స్టెక్ (BIMSTEC) సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ… అనంతరం నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇందులో భాగంగా రాక్సౌల్, కఠ్మాండు మధ్య రైల్వే లైన్ నిర్మాణంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఏడాదిలోనే భారత్, నేపాల్ మధ్య ట్రాన్సిట్ ట్రీటీ కూడా కుదిరింది. నేపాల్ – భారత్ మైత్రి భవన్ ప్రారంభం నేపాల్ రాజధాని కఠ్మాండులోని పశుపతినాథ్ శివాలయంలో భారత ఆర్థిక సహాయంతో నిర్మించిన 400 పడకల భక్తుల వసతి కేంద్రాన్ని నేపాల్ ప్రధానితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.…

Read More