Monthly Current Affairs – September – 2018 – Sports

సెప్టెంబర్ క్రీడలు

హామిల్టన్ కు ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్

మెర్సిడీస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్.. ఇటలీ గ్రాండ్‌ ప్రి ఫార్ములావన్ రేసు విజేతగా నిలిచాడు. ఇటలీలోని మోంజాలో సెప్టెంబర్ 2న జరిగిన రేసులో హామిల్టన్ 53 ల్యాప్‌ల దూరాన్ని గంటా 16 నిమిషాల 54.484 సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఫెరారీ డ్రైవర్ రైకోనెన్ రెండో స్థానం, మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ మూడో స్థానం, ఫెరారీ మరో డ్రైవర్ వెటెల్ నాలుగో స్థానం దక్కించుకున్నారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు.

ఆసియా క్రీడలు – 2018

ఇండోనేషియాలోని జకార్తా, పాలెంబాంగ్ నగరాల్లో 2018 ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు 18వ ఆసియా క్రీడలు జరిగాయి. ఈ క్రీడల్లో 45 దేశాలు పాల్గొన్నాయి. ఈ క్రీడల్లో భారత్ 15 స్వర్ణాలు, 24 రజతాలు, 30 కాంస్యాలను గెలుచుకొని పతకాల పట్టికలో 8 స్థానంలో నిలిచింది. 2022 ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతాయి.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

చైనా 132 స్వర్ణాలు, 92 రజతాలు, 65 కాంస్యాలతో కలిపి మొత్తం 280 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. జపాన్ రెండో స్థానంలో(75 స్వర్ణాలు, 56 రజతాలు, 74 కాంస్యాలు, మొత్తం 205), దక్షిణ కొరియా మూడో స్థానంలో(49 స్వర్ణాలు, 58 రజతాలు, 70 కాంస్యాలు ,మొత్తం 177) నిలిచాయి.

  • ఆసియా క్రీడల్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా జపాన్ స్విమ్మర్ రికాకో ఇకీ ఎంపికైంది. స్విమ్మింగ్ విభాగంలో నిర్వహించిన పోటీల్లో 18 ఏళ్ల ఇకీ ఆరు పసిడి, రెండు రజత పతకాలను సాధించింది.దీంతో 1998 తర్వాత ఈ అవార్డు అందుకున్న ఏకైక మహిళగా ఇకీ గుర్తింపు పొందింది.

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్ లో ఓం ప్రకాశ్ కు స్వర్ణం

దక్షిణ కొరియాలో జరిగిన ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్ లో భారత పిస్టల్ షూటర్ ఓం ప్రకాశ్ మిథర్వాల్ స్వర్ణం గెలుచుకున్నాడు. కొరియాలోని చాంగ్ వాన్ నగరంలో జరిగిన ఈ పోటీల్లో 50 మీటర్ల పిస్టల్ విభాగంలో 23 ఏళ్ల ఓం ప్రకాశ్ 564 పాయింట్లు స్కోర్ చేసి తొలి స్థానంలో నిలిచాడు. తద్వారా స్వర్ణం నెగ్గాడు. దీంతో ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణం గెలిచిన నాలుగో భారతీయుడిగా ప్రకాశ్ గుర్తింపు సాధించాడు. గతంలో 2006లో అభినవ్ బింద్రా, 2006లో మానవ్ జిత్ సింధు, 2010లో తేజస్విని సావంత్ మాత్రమే ఈ ఘనత సాధించారు.

ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో ఓం ప్రకాశ్ 10 మీటర్లు, 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగాల్లో కాంస్యాలు గెలుచుకున్నాడు.

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత నవోమి

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా గెలుచుకుంది. న్యూయార్క్ లో సెప్టెంబర్ 9న జరిగిన ఫైనల్లో నవోమి ఒసాకా.. అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ను ఓడించి.. టైటిల్ విజేతగా నిలిచింది. తద్వారా గ్రాండ్ స్లామ్ సాధించిన తొలి జపాన్ క్రీడాకారిణిగా నవోమి ఒసాకా గుర్తింపు సాధించింది.

  • ఈ మ్యాచ్ లో సెరెనా విలియమ్స్ మ్యాచ్ చైర్ అంపైర్ తో వాగ్వాదానికి దిగింది. నువ్వొక దొంగ.. అబద్దాల కోరు అంటు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్ లో అంకుర్ కు స్వర్ణం

భారత షూటర్ అంకుర్ మిట్టల్ దక్షిణ కొరియాలోని చాంగ్ వాన్ నగరంలో జరిగిన ప్రపంచ సీనియన్ షూటింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుపొందాడు. సెప్టెంబర్ 8న జరిగిన పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, టీమ్ ఈవెంట్లో కాంస్యం సాధించాడు.

యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత జకోవిచ్

ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ గెలుచుకున్నాడు. సెప్టెంబర్ 10న జరిగిన న్యూయార్క్ లో జరిగిన ఫైనల్లో.. అర్జెంటీనా ప్లేయర్ యువాన్ మార్టిన్ డెల్ పొట్రో ను ఓడించి జకోవిచ్ టైటిల్ విజేతగా నిలిచాడు. తద్వారా మూడోసారి యూఎస్ ఓపెన్ ను కైవసం చేసుకున్నాడు.

  • టైటిల్ విజేత జకోవిచ్ కు 38 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ, రన్నరప్ డెల్ పొట్రోకు 18 లక్షల 50 వేల డాలర్ల ప్రైజ్ మనీ లభించింది.

పాన్ పసిఫిక్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత కరోలినా ప్లిస్కోవా

జపానా రాజధాని టోక్యోలో జరిగిన పాన్ పసిఫిక్ ఓపెన్ – 2018 మహిళల సింగిల్స్ టైటిల్ ను చెక్ రిపబ్లిక్ కు చెందిన కరోలినా ప్లిస్కోవా గెలుచుకుంది. సెప్టెంబర్ 23న జరిగిన ఫైనల్లో కరోలినాజపాన్ కు చెందిన నయోమి ఒసాకాను ఓడించి టైటిల్ ను కైవసం చేసుకుంది.

  • ఇటీవల జరిగిన యూఎస్ ఓపెన్ – 2018 మహిళల సింగిల్స్ టైటిల్ ను నెగ్గిన ఒసాకా.. గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించిన తొలి జపాన్ క్రీడాకారిణిగా గుర్తింపు సాధించింది.

రాడ్ లేవర్ కప్ – 2018 విజేత యూరప్ జట్టు

అమెరికాలోని షికాగోలో జరిగిన రాడ్ లేవర్ పురుషుల టెన్నిస్ కప్ – 2018ను యూరోప్ జట్టు గెలుచుకుంది. రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్(సెర్పియా), జ్వెరెక్(జర్మనీ), దిమిత్రోవ్(బల్గేరియా), గాఫిన్(బెల్జియం), ఎడ్మండ్(బ్రిటన్)లతో కూడిన యూరప్ జట్టు… 13 – 8 తేడాతో ప్రపంచ జట్టుని ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. తద్వారా రెండో ఏడాది ఈ కప్ ను సొంతం చేసుకుంది.

  • ప్రపంచ జట్టులో అండర్సన్(దక్షిణాఫ్రికా), ఇస్నెర్(అమెరికా), కిరియోస్(ఆస్ట్రేలియా), జాక్ సోక్(అమెరికా), ష్వార్ట్ జ్ మన్(అర్జెంటీనా), టీయాఫో(అమెరికా) ఉన్నారు.

చైనా ఓపెన్ – 2018

చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఇండోనేషియా ప్లేయర్ ఆంటోని సినిసుకా, మహిళల సింగిల్స్ టైటిల్ ను స్పెయిన్ దిగ్గజం కరోలినా మారిన్ గెలుచుకున్నారు.

సెప్టెంబర్ 23న పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆంటోని సినిసుకా.. జపాన్ ప్లేయర్ కెంటో మొమొట్టోను ఓడించి టైటిల్ విజేతగా నిలిచారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో కరోలినా మారిన్.. చైనా క్రీడాకారిణి చెన్ యూఫీని ఓడించి టైటిల్ గెలుచుకుంది.

శ్రీలంకతో టీ20 సీరీస్ ను 4-0తో నెగ్గిన భారత్ మహిళల జట్టు

  • శ్రీలంకతో జరిగిన 5 మ్యాచ్ లో టీ20 సీరీస్ ను భారత్ మహిళల జట్టు 4 – 0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి టైటిల్ గెలుచుకుంది. ఒక మ్యాచ్ వర్ష కారణంగా రద్దయింది.

  • మహిళల టీ20 టీమ్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్

  • ఈ పర్యటనలో వన్డే సీరీస్ ను కూడా టీమ్ ఇండియా 2 – 1తేడాతో గెలుచుకుంది.

ఆసియా క్రికెట్ కప్ – 2018 విజేత భారత్

యూఏఈలోని దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా క్రికెట్ కప్ – 2018 టైటిల్ ను భారత్ గెలుచుకుంది. సెప్టెంబర్ 28న బంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది… 7వ సారి ఆసియా కప్ ను సొంతం చేసుకుంది.

  • ఈ మ్యాచ్ లో సెంచరీ సాధించిన బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ లితన్ దాస్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

  • సీరీస్ అందరికీ కంటే ఎక్కువ పరుగులు సాధించిన భారత బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ కు మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డు దక్కింది.

  • ఆసియా కప్ – 2018లో మొత్తం 6 జట్లు పోటీ పడ్డాయి. అవి.. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, హాంకాంగ్

37 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టిన అథ్లెట్ అవినాశ్

ఒడిశాలోని భువనేశ్వర్ లో జరిగిన జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో అరుదైన రికార్డు నమోదైంది. చాంపియన్ షిప్ లో భాగంగా సెప్టెంబర్ 28న జరిగిన 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ లో సర్వీసెస్ తరపున బరిలో దిగిన అవినాశ్.. 8 నిమిషాల 29.80 సెకన్లలో పూర్తి చేసి 37 ఏళ్ల జాతీయ రికార్డుని తిరిగరాశాడు. 1981 టోక్యో అథ్లెటిక్స్ మీట్ లో గోపాల్ సైనీ 8 నిమిషాల 30.88 సెకన్లలో పూర్తి చేసిన నెలకొల్పిన రికార్డుని అవినాశ్ తుడిచివేశాడు.

ఆర్చరీ ప్రపంచ కప్ లో జ్యోతి సురేఖ జోడికి రజతం

టర్కీలోని సామ్సన్ నగరంలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ లో ఎగ్జిబిషన్ కాంపౌండ్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో భారత్ జోడి రజతం గెలుచుకుంది. సెప్టెంబర్ 29న జరిగిన ఫైనల్లో తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ్, అర్చర్ అభిషేక్ జోడి 152 – 159 స్కోర్ తేడాతో టర్కీ జట్టు చేతిలో ఓడిపోయింది. దీంతో రజతం దక్కింది.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments