Monthly Current Affairs – September – 2018 – Science and Technology

సెప్టెంబర్ సైన్స్ అండ్ టెక్నాలజీ

రైళ్లలో భద్రతకు ‘రైల్‌ సురక్ష’ యాప్‌

రైలు ప్రయాణికులకు ఎదురయ్యే భద్రతా పరమైన సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం ‘రైల్‌ సురక్ష’ పేరుతో రైల్వే శాఖ మొబైల్‌ యాప్‌ను సెప్టెంబర్‌ 2న రూపొందించింది. ఈ యాప్‌ను సెంట్రల్‌ రైల్వే పరిధిలోని దూరప్రాంత, లోకల్‌ రైలు ప్రయాణికులకు సెప్టెంబర్‌ చివర నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రయాణికులు సురక్ష యాప్‌లో పెట్టిన సమస్య ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌లో ఉన్న కంట్రోల్‌ రూం(182)కు చేరుతుంది. ఫిర్యాదు వచ్చిన వెంట‌నే కంట్రోల్‌ రూం సిబ్బంది రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్‌)లేదా గవర్నమెంట్‌ రైల్వే పోలీస్‌ (జీఆర్‌పీ)లను అప్రమత్తం చేసి ఫిర్యాదు దారుడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు.

గాల్లోనే ఇంధనం తేజస్ మరో ఘనత

పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్.. గాల్లోనే ప్రయాణిస్తూనే IAF IL 78 అనే ట్యాంకర్ విమానం నుంచి 1,900 కేజీల ఇంధనాన్ని నింపుకుంది. భూమికి 20,000 అడుగుల ఎత్తులో గంటకు 500 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూ తేజస్ ఈ ఘనత సాధించింది. దీంతో.. యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపకలిగే సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ నిలిచింది.

 • తేజస్ తేలికపాటి యుద్ధ విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది.

 • 123 తేజస్ మార్క్ – 1 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత వాయుసేన 2017 డిసెంబర్ లో హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ కు రూ.50,000 కోట్ల ఆర్డర్ ఇచ్చింది.

తొలి హైడ్రోజన్ రైలుని ప్రారంభించిన జర్మనీ

ప్రపంచంలో తొలి హైడ్రోజన్ రైలుని జర్మనీ సెప్టెంబర్ 17న ప్రారంభించింది. ఫ్రెంచ్ టీజీవీ గ్రూప్ ఈ రైలుని తయారు చేసింది. 100 కిలోమీటర్ల దూరం ఉన్న నగరాల మధ్య ఈ రైళ్లను నడపాలని జర్మనీ నిర్ణయించింది.

 • ఎలక్ట్రిక్ ట్రాక్ వ్యవస్థ లేని చోట డీజిల్ రైళ్ల స్థానంలో వీటిని వినియోగిస్తారు.

 • హైడ్రోజన్ రైళ్ల నుంచి ఎలాంటి కర్బణ ఉద్గారాలు విడుదల కావు. అందుకే వీటిని పర్యావరహణ హితమైనవిగా గుర్తిస్తారు.

 • హైడ్రోజన్ రైళ్లలో ఫ్యూయల్ సెల్స్ ఉంటాయి. ఇవి.. హైడ్రోజన్ ను ఆక్సిజన్ తో అనుసంధానించి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. తద్వారా రైళ్లు నడుస్తాయి.

ప్రహార్ క్షిపణి పరీక్ష విజయవంతం

స్వల్ప శ్రేణి క్షిపణి ప్రహార్ను భారత సెప్టెంబర్ 20న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ రేంజ్ నుంచి జరిపిన పరీక్షలో క్షిపణి నిర్దేశిత 200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించింది.

 • ఈ క్షిపణిని ఉపరితరం తలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు.

 • డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ – DRDO ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది.

ఇస్రోతో కేంద్ర హోంశాఖ ఒప్పందం

అత్యాధునిక అత్యవసర ప్రతిస్పందన కేంద్రం ఏర్పాటు కోసం కేంద్ర హోంశాఖ.. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రోతో సెప్టెంబర్ 20న ఒప్పందం కుదుర్చుకుంది. దేశ అంతర్గత భద్రత, విపత్తు నిర్వహణ అంశంలో కావాల్సిన సాంకేతిక సహకారాన్ని ఇస్రో అందిస్తుంది. ఏడాదిన్నరలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.

ప్రపంచవ్యాప్తంగా పేదరికంలో 130 కోట్ల మంది

ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారని ఐరాస అభివృద్ధి కార్యక్రమం(USDP).. ఆక్సఫర్డ్ పేదరిక, మానవ అభివృద్ధి కార్యక్రమం(OPHI) సంయుక్త నివేదిక వెల్లడించింది. ఈ మేరకు “2018 – ప్రపంచ బహుల పరిమాణ పేదరిక సూచి – MPI” ని సెప్టెంబర్ 20న విడుదల చేశాయి.

 • నివేదిక ప్రకారం 2005-06 నుంచి 2015-16 మధ్య కాలంలో భారత్ లో 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.

 • ఈ పదేండ్లలో భారత్ లో పేదరికం రేటు 55 శాతం నుంచి 28 శాతానికి తగ్గిపోయింది.

 • పేదరిక నిర్మూలనలో కాలక్రమేణా పురోగతి సాధించిన మొదటి దేశం భారత్ అని నివేదిక పేర్కొంది.

గగన్యాన్ మిషన్ కోసం షార్ లో 3వ లాంచ్ ప్యాడ్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో .. గగన్యాన్ పేరుతో మానవ సహిత ప్రయోగం కోసం ఏర్పాట్లు చేస్తోంది. 2022లో చేపట్టే ఈ ప్రయోగం కోసం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లో 3వ లాంచ్ ప్యాడ్ ను ఇస్రో ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఈ కేంద్రంలో ఉన్న రెండు ప్రయోగ వేదికలు నిండుగా ఉన్నందున… 3వ ప్రయోగ వేదిక ఏర్పాటు జరుగుతోంది. అలాగే… Small Satellite Launch Vehicles (SSLV) ప్రయోగం కోసం గుజరాత్ లోని సముద్ర తీర ప్రాంతాల్లో అనువైన ప్రదేశంలో వేదికను ఏర్పాటు చేసేందుకు ఇస్త్రో కసరత్తు చేస్తోంది.

అస్త్ర క్షిపణి ప్రయోగం విజయవంతం

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీవో అభివృద్ధి చేసిన అస్త్ర క్షిపణిని శాస్త్రవేత్తలు సెప్టెంబర్ 26న విజయవంతంగా పరీక్షించారు. పశ్చిమబెంగాల్ లోని కలైకుండా ఐఏఎఫ్ స్థావరం నుంచి సుఖోయ్ – 30 యుద్ధ విమానం ద్వారా దీన్ని పరీక్షించారు. క్షిపణి నిర్దేశిత లక్ష్యాలను ఛేదించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

 • గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఉద్దేశించిన అస్త్ర క్షిపణిని డీఆర్డీవోతో పాటు మరో 50 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి అభివృద్ధి చేశాయి.

 • ఈ క్షిపణిని ప్రయోగించేందుకు వీలుగా సుఖోయ్ – 30 యుద్ధ విమానాన్ని ఆధునీకరించారు.

 • ఈ క్షిపణి 20 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వరకు గాలిలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments