Monthly Current Affairs – September – 2018 – Persons in News

సెప్టెంబర్ వార్తల్లో వ్యక్తులు

IBA చైర్మన్ గా సునీల్ మెహతా

2018-19 కాలానికి గాను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) చైర్మన్‌గా పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డెరైక్టర్ సునీల్ మెహతా ఎంపికయ్యారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ దీనబంధు మొహపాత్ర ఐబీఏ డిప్యూటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు.

 • ప్రస్తుతం ఐబీఏ డిప్యూటీ చైర్మన్లుగా ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ ఉన్నారు.
 • ఐబీఏ.. భారత బ్యాంకులు, ఆర్థిక సంస్థల సంఘం. దీనిని 1946 సెప్టెంబర్ 26న ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం ముంబైలో ఉంది.
 • ప్రస్తుతం ఐబీఏలో 237 మంది సభ్యులు ఉన్నారు.

ఎ ఇయర్ ఇన్ ఆఫీస్పుస్తక ఆవిష్కరణ

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రచించిన మూవింగ్ ఆన్, మూవింగ్ ఫార్వర్డ్: ఎ ఇయర్ ఇన్ ఆఫీస్పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సెప్టెంబర్ 2న జరిగిన కార్యక్రమంలో మోదీ ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా ఏడాది కాలంలో తన అనుభవాలను వివరిస్తు వెంకయ్యనాయుడు ఈ పుస్తకాన్ని రచించారు.

పాకిస్తాన్ అధ్యక్షడిగా ఆరిఫ్ అల్వీ

పాకిస్తాన్ నూతన అధ్యక్షుడిగా.. అధికార తెహ్రిక్ ఇ – ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ ఆరిఫ్ అల్వీ ఎన్నికయ్యారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగిన పోలింగ్ లో నేషనల్ అసెంబ్లీ, సెనేట్ కు సంబంధించిన 430 ఓట్లు ఉన్నాయి. ఇందులో అల్వీకి 212 ఓట్లు వచ్చాయి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆరీఫ్ అల్వీ సన్నిహితుడు.

మిస్ అమెరికా – 2019 గా నియా ఇమానీ

మిస్ అమెరికా – 2019 కిరీటాన్ని 25 ఏళ్ల నియా ఇమానీ ప్రాంక్లిన్ గెలుచుకుంది. ఈ మేరకు అట్లాంటిక్ సిటీలో జరిగిన తుదిపోరులో గెలిచి టైటిల్ ను కైవసం చేసుకుంది. నార్త్ కరోలినా యూనివర్సిటీలో ఆర్ట్స్ లో గ్రాడ్యుయేట్ అయిన ఈమె సింగర్ కూడా.

అలీబాబా కొత్త చైర్మన్ గా డేనియల్ జాంగ్

కామర్స్ దిగ్గజం అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు జాక్ మా సెప్టెంబర్ 10న వెల్లడించారు. తదుపరి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కంపెనీ సీఈవో డేనియల్ జాంగ్ ను ప్రకటించారు. డేనియల్.. అత్యంత ప్రజాదరణ పొందిన సింగిల్ డే సేల్ప్రచార రూపకర్త గా గుర్తింపు పొందారు. 2019 సెప్టెంబర్ 10న జాంగ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపడతారు.

 • అలీబాబా ప్రస్తుత మార్కెట్ విలువ 420 బిలియన్ డాలర్లు.

అంతర్జాతీయ క్రికెట్ కు అలిస్టర్ కుక్ గుడ్ బై

ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మెన్ అలిస్టర్ కుక్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. భారత్ తో టెస్ట్ సీరీస్ లో భాగంగా ఓవల్ వేదికగా సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్ కుక్ ఆఖరి మ్యాచ్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో సెంచిరీ (147) సాధించిన కుక్.. అరుదైన రికార్డు నమోదు చేశాడు. అరంగేట్రంతో పాటు చివరి మ్యాచ్ లో సెంచరీ సాధించిన క్రికెటర్ గా గుర్తింపు పొందాడు.

 • 2006లో నాగపూర్ వేదికగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేసిన అలిస్టర్ కుక్.. 104 పరుగులు సాధించాడు.

 • ఇంతముందు అరంగేట్ర, చివరి టెస్టులో రెగీ డఫ్‌ (ఆస్ట్రేలియా), పోన్స్‌ఫర్డ్‌ (ఆస్ట్రేలియా), గ్రెగ్‌ చాపెల్‌ (ఆస్ట్రేలియా), అజహరుద్దీన్‌ (భారత్‌) లు సెంచరీలు చేశారు. అయితే అరంగేట్ర, చివరి టెస్టు ఒకే జట్టుపై ఆడి సెంచరీలు చేసింది మాత్రం రెగీ డఫ్‌ (ఆస్ట్రేలియా), పోన్స్‌ఫర్డ్‌ (ఆస్ట్రేలియా), అలిస్టర్ కుక్(ఇంగ్లాండ్)లు మాత్రమే.

ఏబీసీ చైర్మన్ గా హార్మూస్ జీ కామా

2018-19 సంవత్సరానికి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్స్ (ABC) నూతన కార్యవర్గాన్ని సెప్టెంబర్ 13న ఎన్నుకున్నారు. ముంబై సమాచార్ డైరెక్టర్ హార్మూస్ జీ కామా ఎన్నికయ్యారు. ఆయన ఏడాది పాటు ఈ పదవిలో ఉంటారు. డిప్యూటీ చైర్మన్ గా డీడీబీ ముద్ర ప్రైవేట్ లిమిటెడ్ మాజీ చైర్మన్ మధుకార్ కామత్ ని ఎన్నుకున్నారు.

 • ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్స్పత్రికల సబ్ స్క్రిప్షన్స్ ని లెక్కిస్తుంది.

 • ఏబీసీని 1948లో ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం ముంబైలో ఉంది.

46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తి(CJI)గా జస్టిస్ రంజన్ గొగోయ్ నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయ మంత్రిత్వశాఖ సెప్టెంబర్ 14న వెల్లడించింది. ప్రస్తుత సీజేఐ దీపక్ మిశ్రా తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రంజన్ గొగోయ్ పేరుని సీజేఐగా లా కమిషన్ కు ప్రతిపాదించారు. కమిషన్ ఆ ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీకి పంపగాఆయన రాష్ట్రపతి ఆమోదానికి సిఫారసు చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయటంతో న్యాయమంత్రిత్వ శాఖ నియామక ప్రకటన విడుదల చేసింది.

 • ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి వ్యక్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ నిలిచారు.

 • ప్రస్తుత సీజేఐ దీపక్ మిశ్రా 2018 అక్టోబర్ 2న రిటైర్ అవుతారు.

పురుషుల డెకథ్లాన్ లో కెవిన్ మాయెర్ సరికొత్త రికార్డు

పురుషుల డెకథ్లాన్ లో సెప్టెంబర్ 17న కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన డెకాస్టర్ ఈవెంట్లో ఫ్రాన్స్ అథ్లెట్ కెవిన్ మాయెర్ 9,126 పాయింట్లు సాధించి స్వర్ణం గెలుచుకోవటంతో పాటు కొత్త ప్రపంచ రికార్డు లిఖించాడు. 2015లో అమెరికా అథ్లెట్ యాప్టన్ ఈటన్ 9,045 పాయింట్లతో నెలకొల్పిన రికార్డుని మాయెర్ తిరగరాశాడు.

డెకథ్లాన్ అంట్ ?

 • అథ్లెటిక్స్ లో 100 మీటర్లు, లాంగ్ జంప్, షాట్ పుట్, హైజంప్, 400 మీటర్లు, 110 మీటర్ల హార్టిల్స్, డిస్కర్ త్రో, పోల్ వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్ల పరుగు సమాహారం.

ద్యుతీచంద్ పై పుస్తకం రాయనున్న సందీప్ మిశ్రా

భారత స్ట్రింటర్ ద్యుతీ చంద్ ఆత్మకథను జర్నలిస్ట్ సందీప్ మిశ్రా పుస్తకం రూపంలో తీసుకొస్తున్నారు. పరుగు కోసం ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, అధిగమించిన సవాళ్లను వివరిస్తూ పుస్తకం రాస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పేదరికాన్ని జయించి ట్రాక్ పై పరుగు అందుకున్న ఒడిశాకు చెందిన ద్వితీ చంద్ లో పురుష లక్షణాలున్నాయని నిషేధం విధించారు. దీంతో కామన్ వెల్త్ గేమ్స్ కి దూరమయ్యారు. ఆ తర్వాత నిషేధంపై అర్బిట్రేషన్ కోర్టులో పోరాడి గెలిచింది.

 • ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో ద్యుతీ చంద్ 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో రెండు రజతాలు నెగ్గింది.

 • ఒడిశాలో పుట్టిన ద్యుతీ చంద్, హైదరాబాద్ లో పెరిగింది.

హిమదాస్ కు అడిడాస్ స్పాన్సర్ షిప్

భారత స్టార్ అథ్లెట్ హిమదాస్ కు ప్రముఖ క్రీడా పరికరాల సంస్థ అడిడాస్ స్పాన్సర్ షిప్ చేయనుంది. అస్సాం కు చెందిన హిమదాస్ తో అడిడాస్ సంస్థ సెప్టెంబర్ 18న ఒప్పందం కుదుర్చుకుంది.

 • హిమదాస్ భారత్ ప్రముఖ అథ్లెట్లలో ఒకరు.

 • ఫిన్ లాండ్ లో జరిగిన అండర్ – 20 ఛాంపియన్ షిప్ లో ఆమె బంగారు పతకం గెలిచి చరిత్ర సృష్టించింది.

 • ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణంతో పాటు రెండు రజతాలు గెలిచింది.

 • ఈ నేపథ్యంలో అడిడాస్ కంపెనీ ఆమె కోసం ప్రత్యేకంగా షూస్ ను తయారు చేసింది. ఒక బూటుపై హిమదాస్ అని.. ఇంకో బూటుపై క్రియేటివ్ హిస్టరీ అని ముద్రించింది.

4 గంటల్లో 2 కేజీలు తగ్గిన మేరీ కోమ్

5 సార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ అయిన భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్.. తానేంటో మరోసారి నిరూపించారు. 48 కేజీల కేటగిరీలో పోటీ పడేందుకు 4 గంటల్లో 2 కేజీలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. పోలాండ్ లో జరిగిన బాక్సింగ్ చాంపియన్ షిప్ కోసం అక్కడికి వెళ్లేసరికి మేరీకోమ్ బరువు 50 కేజీల బరువు ఉంది. వేయింగ్ కి మరో 4 గంటల సమయం మాత్రమే ఉండటంతో.. బరువు తగ్గాలని నిశ్చయించుకున్న ఆమెఏకబిగిన స్కిప్పింగ్ చేసింది. సరిగ్గా వేయింగ్ సమయానికి 2 కేజీలు తగ్గి 48 కేజీలకు వచ్చిపోటీకి అర్హత సాధించింది. తద్వారా సునాయాసంగా గెలిచి.. స్వర్ణం సాధించింది.

 • మణిపూర్ కు చెందిన మేరీ కోమ్ 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచి.. ఈ ఘనత సాధించిన తొలి మహిలా బాక్సర్ గా రికార్డు సృష్టించింది.

 • 2018 కామన్ వెల్త్ గేమ్స్ లోను స్వర్ణం గెలిచి రికార్డు నమోదు చేసింది.

 • 2016 ఏప్రిల్ లో అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మేరీ కోమ్ ను రాజ్యసభకు నామినేట్ చేశారు.

 • 2017లో కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ.. మేరీ కోమ్ ను జాతీయ బాక్సింగ్ పరీశలకురాలిగా నియమించింది.

 • 2003లో అర్జున అవార్డు, 2006లో పద్మ శ్రీ, 2013లో పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు.

భారత తొలి ఐఏఎస్ మహిళా అధికారిణి అన్నా రాజం కన్నుమూత

స్వతంత్ర భారత దేశ ప్రథమ మహిళా IAS అధికారిణి అన్నా రాజం మల్హోత్రా (91) ఏళ్ల వయసులో కన్నుమూశారు. సెప్టెంబర్ 18న ముంబై సబర్బణ్ అంధేరీలో ని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు.

 • అన్నా రాజం 1927 జులైలో కేరళలో జన్మించారు. ఉన్నత విద్యను మద్రాస్ లో అభ్యసించారు.

 • 1951లో అన్నా రాజం భారత సివిల్ సర్వీసెస్ కు ఎంపికయ్యారు. మద్రాస్ కేడర్ ను ఎంపిక చేసుకున్నారు. అప్పటి మద్రాస్ ముఖ్యమంత్రి సి. రాజగోపాలచారి ప్రభుత్వంలో అధికారిణిగా పనిచేశారు.

 • అన్నా రాజం భర్త ఆర్ ఎన్ మల్హోత్రా. ఆయన 1985 నుంచి 1990 వరకు భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు.

అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ గా కమ్లేశ్ నీల్ కాంత్ వ్యాస్

ప్రముఖ శాస్త్రవేత్త, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ కమ్లేశ్ నీల్ కాంత్ వ్యాస్.. అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ గా, డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ(DAE) కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ ఆయన నియామకానికి సెప్టెంబర్ 18న ఆమోదం తెలిపింది. 2021 మే వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.

 • ప్రస్తుత చైర్మన్ శేఖర్ బసు స్థానంలో కమ్లేశ్ నీల్ కాంత్ వ్యాస్ బాధ్యతలు చేపడతారు. శేఖర్ బసు 2015 అక్టోబర్ లో అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. 2018 సెప్టెంబర్ తో ఆయన పదవికాలం ముగిసింది.

 • కమ్లేశ్ నీల్ కాంత్ వ్యాస్ వడోదరలోని ఎంఎస్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పొందారు.

 • అణు పరిశోధన రంగంలో సేవలకు గాను కమ్లేశ్.. 2011లో ఇండియన్ న్యూక్లియర్ సొసైటీ నుంచి ఔట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డు, 2006లో హోమీ బాబా సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు పొందారు.

 • అటామిక్ ఎనర్జీ కమిషన్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ గవర్నింగ్ బాడీ. ఇది నేరుగా ప్రధాని పర్యవేక్షణలో ఉంటుంది. దీన్ని 1948లో ఏర్పాటు చేశారు.

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలు శిక్ష రద్దు

అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఆయన కూతురు మర్యం, అల్లుడు మహ్మద్ సఫ్దార్ ల జైలు శిక్షలను నిలిపివేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 19న ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. వారు ముగ్గురు జైలు నుంచి విడుదలయ్యారు.

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ కన్నుమూత

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ(100) సెప్టెంబర్ 19న అనారోగ్యంతో విశాఖపట్నంలో కన్నుమూశారు. కృష్ణా జిల్లా పామర్రులో జన్మించిన ఆమె.. ప్రజా సమస్యలపై పోరాటం చేశారు.

 • ఆమె భర్త నక్సల్ బరీ కీలక నేత కొండపల్లి సీతారామయ్య

 • స్వాతంత్రోద్యమ సమయంలో గాంధీజీ పామర్రు సందర్శించినప్పుడు కోటేశ్వరమ్మ తన నగలన్నింటినీ విరాళంగా ఇచ్చారు.

 • తెలంగాణ సాయుధ పోరాటంలో 3 ఏళ్ల పాటు అజ్ఞానంతో ఉన్నారు.

 • నక్సల్ బరీ ఉద్యమంలో తన కుమారుడు చంద్రశేఖర్ ఆజాద్ ను పోగొట్టుకున్నారు.

 • 92 ఏళ్ల వయసులో తన జీవిత విశేషాలతో నిర్జన వారధిపుస్తకాన్ని రచించారు.

ఎయిర్ ఇండియా స్వతంత్ర డైరెక్టర్ గా పురందేశ్వరి

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి.. ఎయిర్ ఇండియా స్వతంత్ర డైరెక్టర్ గా నియమితులయ్యారు. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ సెప్టెంబర్ 20న నియామ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఈ పదవిలో 3 ఏళ్లు కొనసాగుతారు.

 • యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించిన పురందేశ్వరి, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు.

ఆర్చరీ కోచ్ జీవన్ జ్యోత్ రాజీనామా

భారత ఆర్చరీ కాంపౌండ్ విభాగం జట్టు కోచ్ జీవన్ జ్యోత్ సింగ్.. తన పదవికి రాజీనామా చేశారు. ఉత్తమ కోచ్ లకు ఇచ్చే జాతీయ క్రీడా పురస్కారం ద్రోణాచార్యజాబితా నుంచి తన పేరుని తొలగించినందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అవార్డుల సెలక్షన్ కమిటీ జీవన్ జ్యోత్ సింగ్ పేరుని నామినీల జాబితాలో చేర్చింది. అయితే.. కేంద్ర క్రీడా శాఖ ఆయన పేరుని ఎంపిక జాబితా నుంచి తొలగించింది.

సెయిల్ చైర్మన్ గా అనిల్ కుమార్ చౌదరి

భారతీయ స్టీల్ అథారిటీ( Steel Authority of India – SAIL) చైర్మన్ గా అనిల్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. కేంద్ర నియామకాల కమిటీ ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. 2018 జూన్ లో పదవీ విరమణ పొందిన పీకే సింగ్ స్థానంలో అనిల్ కుమార్ చౌదరి కొత్త చైర్మన్ గా బాధ్యతలు చేపడతారు. 2020 డిసెంబర్ వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.

 • SAIL ను 1974లో ఏర్పాటు చేశారు.

భారత్ లో వాట్సాప్ గ్రీవెన్స్ అధికారిగా కోమల్ లాహిరి

వాట్సాప్ ద్వారా సమాచార దుర్వినియోగం, తప్పుడు వార్తల ప్రచారం ఎక్కువ అవుతోందన్న ఆరోపణలతో.. వాటిని అరికట్టేందుకు సంస్థ ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఈ తరహా ఆరోపణలపై ఫిర్యాదులను స్వీకరించేందుకు అమెరికాలో పనిచేస్తోన్న కోమల్ లాహిరిని గ్రీవెన్స్ అధికారిగా నియమించింది.

 • వినియోగదారులు ఈ – మెయిల్, యాప్ లేదా రాతపూర్వకంగా గ్రీవెన్స్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.

 • కోమల్ లాహిరి వాట్సాప్ గ్లోబల్ కస్టమర్ ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అంతకముందు ఆమె ఫేస్ బుక్ డైరెక్టర్ గా ఉన్నారు.

ఫోర్బ్స్ టైకూన్స్ ఆఫ్ టుమారోలో సింధు, ఉపాసన

ప్రముఖ మ్యాగజైన తొలిసారి విడుదల చేసిన టైకూన్స్ ఆఫ్ టుమారోలో హైదరాబాదీ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, అపోలో లైఫ్ ఎండీ ఉపాసన కామినేని స్థానం సంపాదించుకున్నారు. క్రీడా, వ్యాపార, నటనా రంగాల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహించిన 22 మంది యువ అచీవర్స్ తో ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. ఇది కేవలం భారత్ జాబితానే.

మాల్దీవుల అధ్యక్షుడిగా ఇబ్రహీం మహ్మద్ సోలిహ్

భారత్ కు మంచి మిత్రపక్ష దేశమైన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్ట్(MDP) సహ వ్యవస్థాపకులు.. ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ విజయం సాధించారు. దీంతో.. ఆయన దేశ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 23న వెలువడ్డ ఫలితాల్లో.. ఇబ్రహీం సోలిహ్ కు 58.3 శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు, ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ అభ్యర్థి అబ్దుల్లా యామీన్ కు 41.7 శాతం ఓట్లు వచ్చాయి. దీంతోయామీన్ తన ఓటమిని అంగీకరించారు.

 • ఎన్నికల్లో ఓటమిపాలైన అబ్దుల్లా యామీన్ భారత్ విరోధిగా పేరుపడ్డారు. ఈయన చైనాకు దగ్గరగా మెలిగారు.

 • కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ .. భారత్ అనుకూల వాదిగా ముద్రపడ్డారు.

 • మాల్దీవుల రాజధాని మాలె.

 • కరెన్సీ మాల్దీవియన్ రుఫియా

ఫేస్ బుక్ ఇండియా ఎండీగా అజిత్ మోహన్

ప్రముఖ వీడియో సేవల సంస్థ హాట్ స్టార్ సీఈవో అజిత్ మోహన్.. ఫేస్ బుక్ ఇండియా వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈ హోదాని కొత్తగా సృష్టించారు. 2019 జనవరిలో అజిత్ మోహన్.. బాధ్యతలు స్వీకరిస్తారు.

ధోని కెప్టెన్ @ 200వ వన్డే

మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా 200వ వన్డేలు పూర్తి చేసుకున్నాడు. ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ 25న ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ధోని ఈ నంబర్ ను అందుకున్నాడు. వాస్తవానికి ధోని 2016లోనే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. రెండేళ్ల కిందట విశాఖపట్నంలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ ధోనికి కెప్టెన్ గా 199వ ది. ఆసియా కప్ లో భాగంగా ఆఫ్గనిస్తాన్ తో మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతోధోని కెప్టెన్ గా అనూహ్యంగా బరిలో దిగాల్సి వచ్చింది.

బార్ క్లేస్ హురున్ ఇండియా – 2018

బార్ క్లేస్ హురున్ ఇండియా 2018 సంవత్సరానికి గాను సెప్టెంబర్ 25న విడుదల చేసిన సంపన్న భారతీయుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తొలి స్థానంలో కొనసాగుతున్నారు. హిందూజా కుటుంబం రెండో స్థానంలో ఉండగా, 3వ స్థానంలో ఎల్ ఎన్ మిట్టల్ ఉన్నారు.

 • తొలి స్థానంలో ముకేశ్ అంబానీ సంపద విలువ రూ. 3,71,000 కోట్లు

 • 2వ స్థానంలో ఉన్న హిందూజా కుటుంబం సంపద విలువ రూ.1,59,000 కోట్లు

 • 3వ స్థానంలో ఉన్న ఎల్ ఎన్ మిట్టల్ సంపద విలువ రూ. 1,14,500 కోట్లు

భారత గిరిజనుల అంబాసిడర్ గా మేరీకోమ్

భారత గిరిజనుల బ్రాండ్ అంబాసిడర్ గా కేంద్ర గిరిజనుల వ్యవహారాల మంత్రితత్వ శాఖ ఐదు సార్లు ప్రపంచ చాంపియన్ బాక్సర్ మేరీకోమ్ ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఆమెను ప్రచారకర్తగా నియమిస్తున్నట్లు సెప్టెంబర్ 27న వెల్లడించింది.

 • మోరీకోమ్ గతంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు.

BSF, SSB లకు కొత్త అధిపతుల నియామకం

సరిహద్దు భద్రతా దళం(Boarder Security Force – BSF), సశస్త్ర సీమా బల్(Sashastra Seema Bal – SSB) లకు కొత్త అధిపతులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 27న ఉత్తర్వులు జారీ చేసింది.

బీఎస్ఎఫ్ అధిపతిగా 1984 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ కేడర్ కు చెందిన రజనీకాంత్ మిశ్రాను నియమించింది. ఈయన 2019 ఆగస్టు వరకు పదవిలో ఉంటారు. ప్రస్తుతం బీఎస్ఎఫ్ చీఫ్ గా ఉన్న కేకే శర్మ సెప్టెంబర్ 30న పదవి విరమణ పొందుతారు.

1984 బ్యార్ హరియాణా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్ఎస్ దేశ్వాల్ ఎస్ఎస్ బీ చీఫ్ గా నియమితులయ్యారు. ఈయన 2021 వరకు కొనసాగుతారు.

CISC అధిపతిగా రాజేశ్వర్

Chief of Intergrated Defence – CISC గా లెఫ్టినెంట్ జనరల్ పి.ఎస్. రాజేశ్వర్ నియమితులయ్యారు. అక్టోబర్ 31న ప్రస్తుత చీఫ్ లెఫ్టినెంట్ జనర్ సతీశ్ దువా పదవీ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో పి.ఎస్. రాజేశ్వర్ బాధ్యతలు చేపడతారు.

 • CISC త్రీవిధ దళాలాతో కూడిన సమీకృత రక్షణ సిబ్బంది విభాగం

 • ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ విభాగాన్ని 2001 నవంబర్ 23న ఏర్పాటు చేశారు

 • దీని కేంద్ర కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది

పీటీఐ చైర్మన్ గా ఎన్. రవి

ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా( PTI) చైర్మన్ గా హిందూ గ్రూపు పేపర్స్ పబ్లిషర్ ఎన్. రవి ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 29న జరిగిన ఎన్నికల్లో రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా పంజాబ్ కేసరి గ్రూపు పత్రికల ప్రధాన సంపాదకుడు విజయ్ కుమార్ చోప్రాను ఎన్నుకున్నారు.

 • PTI అనేది భారత్ లో అతిపెద్ద న్యూస్ ఏజెన్సీ

 • పీటీఐని 1947 ఆగస్టు 27న ఏర్పాటు చేశారు

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments