Monthly Current Affairs – September – 2018 – Awards

సెప్టెంబర్ అవార్డులు

డా.బీ.కే. మిశ్రాకు బీ.సీ.రాయ్ జాతీయ అవార్డు – 2018

ముంబైకి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ బీ.కే. మిశ్రా.. ప్రతిష్టాత్మక డాక్టర్ బీ.సీ. రాయ్ జాతీయ అవార్డు – 2018 ఎంపికయ్యారు. ఎమినెంట్ మెడికల్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ కింద ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2019 జూలై 1న వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ మిశ్రా.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుని అందుకుంటారు.

· బీసీ రాయ్ అవార్డు.. భారత వైద్య రంగంలో అందించే అత్యున్నత పురస్కారం.

· బీసీ రాయ్ అవార్డుని 1976లో భారతీయ మెడికల్ కౌన్సిల్ నెలకొల్పింది.

· ప్రముఖ వైద్యుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ పేరిట ఈ అవార్డుని ఏర్పాటు చేశారు.

· ఆరు రంగాల్లో ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బిజినెస్ రిఫార్మర్ పురస్కారం

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్-2018 అవార్డు లభించింది. ఈ మేరకు టైమ్స్ గ్రూపు ఎండీ వినీత్ జైన్ సెప్టెంబర్ 5న ప్రకటించాడు. ముంబైలో అక్టోబర్ 27న జరిగే కార్యక్రమంలో కేసీఆర్‌కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ 2014 నుంచి 2017 వరకు సగటున ఏడాదికి 17.17 శాతం చొప్పున, 2018 మొదటి ఐదు నెలల్లో 21.96 శాతం ఆదాయాభివృది సాధించిందని కేసీఆర్ తెలిపారు. అలాగే టీఎస్ ఐపాస్ సింగిల్ విండో పారిశ్రామిక అనుమతుల విధానం ద్వారా ఇప్పటివరకు 7,000 పరిశ్రమలు అనుమతులు పొందాయని వివరించారు.

అంపశయ్య నవీన్ కు కాళోజీ పురస్కారం – 2018

తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక కాళోజీ సాహితీ పురస్కారం – 2018కి అంపశయ్య నవీన్ ఎంపికయ్యారు. ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తోంది. సెప్టెంబర్ 9న కాళోజీ 104వ జయంతిని పురస్కరించుకొని నవీన్ కు పురస్కారాన్ని అందజేశారు.

 • నవీన్ గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.

 • కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారుడిగా కూడా ఆయన వ్యవహరించారు.

 • నవీన్ స్వస్థలం వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామం

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నంబర్ – 1

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. విమాన సేవల నాణ్యతలో ప్రపంచ వ్యాప్తంగా తొలి స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నుంచి నంబర్ 1 ఎయిర్ పోర్ట్ ట్రోఫీని అందుకుంది. ఏసీఐ ప్రపంచవ్యాప్తంగా 34 విమానాశ్రయ సేవలను అధ్యయనం చేసి ఈ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది.

 • సెప్టెంబర్ 12న కెనడాలోని హాలీ ఫాక్స్ లో నిర్వహించిన ఏసీఐ కస్టమర్ ఎక్స్ లెన్స్ సమ్మిట్ లో ఈ అవార్దు అందజేశారు.

కాళేశ్వరం సీఈకి ఇంజినీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నల్లా వెంకటేశ్వర్లుకు ఉన్నత గౌరవం దక్కింది. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆయనకు ఇంజినీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు – 2018 ప్రకటించింది. సెప్టెంబర్ 15న భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 158వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో వెంకటేశ్వర్లుకు ఈ అవార్దు ప్రదానం చేశారు.

నీల్ బసుకి ఆసియాన్ అచీవర్స్ అవార్డు

బ్రిటన్ పోలీసు విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్న భారత సంతతి అధికారి నీల్ బసు .. ప్రతిష్టాత్మక ఆసియన్ అచీవర్స్ అవార్దుకు ఎంపికయ్యారు. ఆసియాన్ బిజినెస్ పబ్లికేషన్స్ లిమిటెడ్ (ABPL) అనే మీడియా సంస్థ ఏటా ఈ అవార్డులని ప్రదానం చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 14న నిర్వహించిన కార్యక్రమంలో నీల్ బసు తరపున సహ ఉద్యోగి అవార్దు అందుకున్నారు.

 • నీల్ బసు బ్రిటన్ లోని స్కాట్లాండ్ యార్డ్ లో తీవ్రవాద నిరోధక దళానికి నేతృత్వం వహిస్తున్న తొలి భారత సంతతి అధికారి.

విరాట్, మీరాలకు ఖేల్ రత్నఅవార్డు

కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ క్రీడా అవార్డులు – 2018ని సెప్టెంబర్ 20న అధికారికంగా ప్రకటించింది. ఇద్దరికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 8 మంది కోచ్ లకు ద్రోణాచార్య, నలుగురికి జీవితకాల పురస్కారం, 20 మందికి అర్జున అవార్డు, నలుగురికి ధ్యాన్ చంద్ అవార్డు ప్రకటించింది.

 • క్రికెట్ నుంచి సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని తర్వాత రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికైన మూడో క్రికెటర్ విరాట్ కోహ్లీ

 • తెలుగువారైన టేబుల్ టెన్నిస్ కోచ్ శ్రీనివాసరావుకు ద్రోణా చార్య అవార్డు దక్కింది.

 • తెలంగాణ డబుల్స్ స్టార్ షట్లర్ సిక్కిరెడ్డి అర్జున అవార్డుకు ఎంపికయ్యారు.

అవార్డు విజేతలు

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న

 • విరాట్ కోహ్లీ(క్రికెటర్)

 • మీరాబాయి చాను(వెయిట్ లిఫ్టర్)

ద్రోణాచార్య

 • ఆచయ్య కుట్టప్ప(బాక్సింగ్)

 • విజయ్ శర్మ(వెయిట్ లిఫ్టింగ్)

 • శ్రీనివాసరావు(టేబుల్ టెన్నిస్)

 • సుఖ్ దేవ్ సింగ్(అథ్లెటిక్స్)

ధ్యాన్ చంద్ అవార్డు

 • సత్యదేవ్ ప్రసాద్ (ఆర్చరీ)

 • భరత్ కుమార్ చైత్రీ(హాకీ)

 • బాబి అలోయ్ సియన్(అథ్లెటిక్స్)

 • చౌగలే దాడు దత్తాత్రేయ (రెజ్లింగ్)

రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్

 • విశాఖ ఉక్కు కర్మాగారం(రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్)

 • జేఎస్ డబ్ల్యూ స్పోర్ట్స్

 • ఇషా ఔట్ రీచ్

2018 ఆస్కార్ బరిలో భారత్ సినిమా విలేజ్ రాక్ స్టార్స్

2018 ఆస్కార్ అవార్డుల కోసం నామినేషన్స్ మొదల్యాయాయి. ఈ అవార్డుల కోసం ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో భారత్ నుంచి విలేజ్ రాక్ స్టార్స్చిత్రం అధికారికంగా ఎంపిక చేశారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 22న ఈ మేరకు వెల్లడించింది.

 • విలేజ్ రాక్ స్టార్స్.. అస్సామీ సినిమా.

 • దర్శకురాలు రీమా దాస్

 • 2018 జాతీయ చలన చిత్ర అవార్డుల్లో.. ఈ సినిమా ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్, ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది.

 • భారత్ 1957 నుంచి ఆస్కార్ కు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో నామినేషన్లు పంపుతోంది.

 • 1986లో కే. విశ్వనాథ్ తెరకెక్కించిన స్వాతిముత్యం ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ రేసు వరకు వెళ్లింది. కానీ నామినేషన్ దక్కించుకోలేదు.

 • స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్, రసూల్ వూకుట్టికి ఆస్కార్ వచ్చినాఆ చిత్రం బ్రిటీష్ సినిమా కింద రావటంతోభారత్ ఖాతాలోకి అవార్డు రాలేదు.

నరేంద్ర మోదీకి చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్అవార్డు

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి అందించే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్అవార్డుకి ఎంపికయ్యారు. మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ కూడా ఈ అవార్డుకి ఎంపికయ్యారు. ఈ మేరకు ఐరాస సెప్టెంబర్ 26న ప్రకటించింది. అంతర్జాతీయ సౌర కుటమి ఏర్పాటులో ఇద్దరు నేతలు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు పొందారు.

 • చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ఐరాస ఇచ్చే అత్యున్నత పర్యావరణ పురస్కారం.

 • సౌర శక్తితో నడుస్తున్న ఏకైక విమానాశ్రయంగా గుర్తింపు పొందిన కొచ్చి విమానాశ్రయానికి కూడా చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్అవార్డు దక్కింది.

జీహెచ్ఎంసీకి జాతీయ పర్యాటక అవార్డు

నగరంలో పర్యాటక ప్రాంతాల్లో ఉత్తమ పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి వసతి, రోడ్ల విస్తరణ తదితర కార్యక్రమాల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ 2016-17 సంవత్సరానికి జాతీయ పర్యాటక పురస్కారం దక్కించుంది. ఈ మేరకు సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర పర్యాటక శాఖ న్యూఢిల్లీలో అవార్డులు ప్రదానం చేసింది.

విజయ్ పాటిల్ కు లతా మంగేష్కర్ అవార్డు – 2018

మహారాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక లతా మంగేష్కర్ అవార్డు” 2018కి ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్ పాటిల్ ఎంపికయ్యారు. రామ్ లక్ష్మణ్ గా ప్రసిద్ధి చెందిన ద్వయంలో విజయ్ పాటిల్ లక్ష్మణ్ గా గుర్తింపు పొందారు. అవార్డు కింది రూ.50 వేల నగదు బహుమతిని అందజేస్తారు.

 • భారత రత్న, దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పుట్టిన రోజుని పురస్కరించుకొని ఏటా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రదానం చేస్తుంది.

స్వాతిలక్రాకు డాటర్స్ ఇండియా అవార్డు

తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ లో మహిళా భద్రతా విభాగం ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ స్వాతిలక్రారాజస్థాన్ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక డాటర్స్ ఇండియా అవార్డుకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 29న రాజస్థాన్ లో జైపూర్ లో జరిగిన హెల్త్ కేర్ సదస్సులో స్వాతి లక్రా ఈ అవార్డు అందుకున్నారు.

 • సేవ్ గర్ల్, ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగాల్లో దేశవ్యాప్తంగా కృషి చేస్తున్న సామాజిక వేత్తలకు, అధికారులకు రాజస్థాన్ ప్రభుత్వం ఏటా ఈ అవార్డు అందజేస్తుంది.

భారత యువతి అమికా జార్జ్ కు గోల్ కీపర్స్ ప్రోగ్రెస్ సోషల్ అవార్డు

కేరళకు చెందిన అమికా జార్జ్బిల్, మెలిండా ఫౌండేషన్ ప్రారంభించిన గోల్ కీపర్స్ ప్రోగ్రెస్ అవార్డుకు ఎంపికయ్యారు. అమికా.. బ్రిటన్ వీధుల్లో ప్రారంభించిన ఫ్రీ పీరియడ్స్ ఉద్యమం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఉద్యమం ఫలితంగా బ్రిటన్ ప్రభుత్వం పేద బాలికల రుతుక్రమ అవసరాలు తీర్చేందుకు ఉచిత శానిటరీ ప్యాడ్స్ కోసం 1.5 మిలియన్ పౌండ్లు వెచ్చించేలా చేసింది. అమికాతో పాటు మరో ఇద్దరు మహిళలకు ఈ అవార్డు దక్కింది.

 • సామాజిక అభివృద్ధి రంగంలో.. గోల్ కీపర్స్ ప్రోగ్రెస్ సోషల్ అవార్డుని ఆస్కార్ అవార్డుతో పోలుస్తారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments