ఇది కథ కాదు – డ్రగ్స్ డాన్ – డైనమిక్ లేడీ ఆఫీసర్ – మధ్యలో ముఖ్యమంత్రి.. అసలేం జరిగింది ?

పోలీస్ డ్యూటీలో పురుషులతో సమానంగా విధులు నిర్వహించడమే కాదు… వారికంటే సమర్థంగా పనిచేయగలమని ఎందరో డైనమిక్ లేడీ ఆఫీసర్లు నిరూపించారు.  ఇటీవల గుజరాత్ లో కానిస్టేబుల్ సునీతా యాదవ్… కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి కుమారుడిని అడ్డుకొని నిలదీశారు. ఈ ఘటనతో ఆమెను సోషల్ మీడియాలో ఎంతో మంది అభినందించారు. ఊరందరిదీ ఓ తీరైతే.. పోలీసు శాఖలో ఉన్నతాధికారులు మరోతీరు కదా.. ! ఆమె మీద ఎలాంటి ఒత్తిడి వచ్చిందో ఏమోకానీ.. కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. పోలీసు పవర్.. వేసుకునే యూనిఫాంలో లేదని.. ఉద్యోగ ర్యాంక్ లో ఉందని.. ఈ సారి ఐపీఎస్ సాధించి మళ్లీ పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి వస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పారు.. సునీతా యాదవ్. ఇప్పుడు మీరు చదివే మణిపూర్ సూపర్ కాప్ స్టోరీ.. ఇంకా పవర్ ఫుల్. పోలీసు డిపార్ట్మెంట్…

Read More