మెర్సిడీస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్.. ఇటలీ గ్రాండ్ ప్రి ఫార్ములావన్ రేసు విజేతగా నిలిచాడు. ఇటలీలోని మోంజాలో సెప్టెంబర్ 2న జరిగిన రేసులో హామిల్టన్ 53 ల్యాప్ల దూరాన్ని గంటా 16 నిమిషాల 54.484 సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఫెరారీ డ్రైవర్ రైకోనెన్ రెండో స్థానం, మెర్సిడెస్కే చెందిన బొటాస్ మూడో స్థానం, ఫెరారీ మరో డ్రైవర్ వెటెల్ నాలుగో స్థానం దక్కించుకున్నారు. భారత్కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు.
ఈ ఫార్ములా వన్ సీజన్లో హామిల్టన్ కు ఇది ఆరో టైటిల్. కెరీర్లో 68వద టైటిల్.
మాదిరి ప్రశ్న
ఇటలీ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేసు – 2018 టైటిల్ విజేత ఎవరు ?
లూయిస్ హామిల్టన్
రైకోనెన్
వాల్తెరి బొటాస్
సెబాస్టియన్ వెటల్
జవాబు: లూయిస్ హామిల్టన్