కోవిడ్ – 19 || అన్ లాక్ – 3 లో ఇవి ఓపెన్ ?

కోవిడ్ – 19 అన్ లాక్ – 2 జూలై 31తో ముగుస్తోంది. దీంతో.. అన్ లాక్ – 3 ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 1 నుంచి మరికొన్ని అంశాల్లో నిబంధనలను సడలించేందుకు విధి విధానాలు సిద్ధం చేస్తోంది. మొదటి రెండు దఫాల్లో ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం… ఆగస్టు 1 నుంచి సినిమా థియేటర్లు, జిమ్ములు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇవ్వనుందట. పాఠశాలలు, కాలేజీలు, మెట్రీ సర్వీసులు మాత్రం యథావిధిగా మూసివేసి ఉంటాయట. ఇప్పట్లో పాఠశాలలు తెరవాలా వద్దా అనే అంశాన్ని రాష్ట్రాలతో చర్చించేందుకు కేంద్రం ఇప్పటికే ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. అన్ లాక్ – 3 లో థియేటర్లు, జిమ్ముల నిర్వహణకు అనుమతి ఇస్తూనే భౌతిక దూరం నిబంధనలను కచ్చితంగా పాటించేలా నిర్వాహకులు చర్యలు…

Read More

సుశాంత్ కి ఏఆర్ రహమాన్ సంగీత నివాళి

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్ తోపాటు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంతో ప్రతిభ కలిగిన యువ నటుడు.. బలవన్మరణానికి పాల్పడటం ఆయన సన్నిహితులని శోక సంద్రంలో ముంచేసింది. స్నేహితులు, బంధువులు, అభిమానులు వివిధ రూపాల్లో సుశాంత్ కి నివాళులు అర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ .. తన బృందంతో కలిసి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి వర్చువల్ కన్సర్ట్ ద్వారా సంగీత నివాళి అర్పించారు. సుశాంత్, సంజనా సంఘీ జంటగా నటించిన దిల్ బేచారా చిత్రంలోని పాటలని ఏఆర్ రహమాన్, బాలీవుడ్ టాప్ సింగర్స్ తో కలిసి ఆలపించారు. టైటిల్ సాంగ్ ని ఏఆర్ రహమాన్.. కూతురు రహీమా రహమాన్, కొడుకు ఏఆర్ అమీన్, మరో సింగర్ హిరాల్ విరాడియాతో కలిసి ఆలపించారు. ప్రముఖ…

Read More

66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు

66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 9న ప్రకటించింది. 2018లో విడుదలైన చిత్రాలను పరిశీలించి వివిధ విభాగాల్లో విజేతలను ప్రకటించారు. ఏటా ఏప్రిల్ లో ప్రకటించించే ఈ అవార్డులను ఈ ఏడాది పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసి.. ఆగస్టులో విజేతల జాబితా విడుదల చేశారు. అవార్డు విజేతలు జాబితా ఉత్తమ నటుడు : ఆయుష్మాన్‌ ఖురానా(అంధాధున్), విక్కీ కౌశల్ (ఉరి) ఉత్తమ నటి : కీర్తి సురేశ్‌ (మహానటి) ఉత్తమ దర్శకుడు : ఆదిత్య ధర్‌(ఉరి) బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ :మహానటి బెస్ట్‌ మేకప్, విజువల్‌ ఎఫెక్ట్‌ : అ! ఒరిజినల్‌ స్కీన్ర్‌ ప్లే : చి.ల.సౌ ఉత్తమ ఆడియోగ్రఫీ : రంగస్థలం ఉత్తమ తమిళ చిత్రం : బారమ్‌ ఉత్తమ కన్నడ సినిమా : నాతిచరామి ఉత్తమ యాక్షన్‌ సినిమా…

Read More