సుశాంత్ కి ఏఆర్ రహమాన్ సంగీత నివాళి

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్ తోపాటు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంతో ప్రతిభ కలిగిన యువ నటుడు.. బలవన్మరణానికి పాల్పడటం ఆయన సన్నిహితులని శోక సంద్రంలో ముంచేసింది. స్నేహితులు, బంధువులు, అభిమానులు వివిధ రూపాల్లో సుశాంత్ కి నివాళులు అర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ .. తన బృందంతో కలిసి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి వర్చువల్ కన్సర్ట్ ద్వారా సంగీత నివాళి అర్పించారు. సుశాంత్, సంజనా సంఘీ జంటగా నటించిన దిల్ బేచారా చిత్రంలోని పాటలని ఏఆర్ రహమాన్, బాలీవుడ్ టాప్ సింగర్స్ తో కలిసి ఆలపించారు. టైటిల్ సాంగ్ ని ఏఆర్ రహమాన్.. కూతురు రహీమా రహమాన్, కొడుకు ఏఆర్ అమీన్, మరో సింగర్ హిరాల్ విరాడియాతో కలిసి ఆలపించారు. ప్రముఖ…

Read More

రూ. వెయ్యి అప్పుకి 5 ఏళ్లు వెట్టి చాకిరి !!

వెట్టి చాకిరి. దీని గురించి డిజిటల్ తరానికి పెద్దగా తెలియదు. సోషల్ పుస్తకాల్లో ఉంటుంది.. చదువుతారు.. అవునా.. అప్పట్లో ఇంత దారుణంగా ఉండేదా అనుకుంటారు. కేజీఎఫ్ వంటి సినిమాలు చూసి.. ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోతారు. కానీ… సినిమాల్లో చూపే దారుణ చిత్రాలు.. అలాంటి పరిస్థితులు ఇప్పటికీ వెలిగిపోతున్న భారతంలో అక్కడక్కడా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇదిగో.. పైన ఉన్న చిత్రమే అందుకు ఉదాహరణ. తమిళనాడులోని కాంచిపురంలో ఇటీవల రెవెన్యూ అధికారులు కట్టెకోత పరిశ్రమలపై దాడులు నిర్వహించారు. 42 మంది కార్మికులకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించారు. 60 ఏళ్ల కాశీ అనే పెద్దాయన కాంచీపురం తహశీల్దార్ కాళ్లకు దండం పెడుతున్న సందర్భంగా తీసిందే ఈ ఫోటో. న్యూస్ మినెట్ వెబ్ సైట్ ఇందుకు సంబంధించిన వార్తా కథనాన్ని తన వెబ్ సైట్ లో…

Read More